తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Oneplus Nord Ce 3 Lite 5g: వన్‍ప్లస్ నయా ఫోన్ గురించి మరిన్ని వివరాలు వెల్లడి.. డ్యుయల్ స్టీరియో స్పీకర్లతో..

OnePlus Nord CE 3 Lite 5G: వన్‍ప్లస్ నయా ఫోన్ గురించి మరిన్ని వివరాలు వెల్లడి.. డ్యుయల్ స్టీరియో స్పీకర్లతో..

02 April 2023, 19:29 IST

google News
    • OnePlus Nord CE 3 Lite 5G: వన్‍ప్లస్ నార్డ్ సీఈ 3 లైట్ 5జీ గురించిన మరిన్ని వివరాలు బయటికి వచ్చాయి. డ్యుయల్ స్టీరియో స్పీకర్లను ఈ ఫోన్‍ను తీసుకొస్తున్నట్టు వన్‍ప్లస్ పేర్కొంది.
OnePlus Nord CE 3 Lite 5G: వన్‍ప్లస్ నయా ఫోన్ గురించి మరిన్ని వివరాలు వెల్లడి.. డ్యుయల్ స్టీరియో స్పీకర్లతో.. (Photo: OnePlus)
OnePlus Nord CE 3 Lite 5G: వన్‍ప్లస్ నయా ఫోన్ గురించి మరిన్ని వివరాలు వెల్లడి.. డ్యుయల్ స్టీరియో స్పీకర్లతో.. (Photo: OnePlus)

OnePlus Nord CE 3 Lite 5G: వన్‍ప్లస్ నయా ఫోన్ గురించి మరిన్ని వివరాలు వెల్లడి.. డ్యుయల్ స్టీరియో స్పీకర్లతో.. (Photo: OnePlus)

OnePlus Nord CE 3 Lite 5G: వన్‍ప్లస్ నార్డ్ సీఈ 3 లైట్ 5జీ లాంచ్ సమీపిస్తోంది. ఈ తరుణంలో ఈ ఫోన్ గురించిన సమాచారం బయటికి వస్తూనే ఉంది. ఇప్పటికే కొన్ని కీలకమైన స్పెసిఫికేషన్లను వన్‍ప్లస్ (OnePlus) అధికారికంగా వెల్లడించగా.. మరిన్ని లీక్‍ల ద్వారా వెల్లడయ్యాయి. అంచనా ధర కూడా బయటికి వచ్చింది. తాజాగా ఈ ఫోన్ డ్యుయల్ స్టీరియో స్పీకర్లతో రానుండడం ఖరారైంది. మరిన్ని వివరాలను కూడా లాంచ్ పేజీలో వన్‍ప్లస్ పేర్కొంది. ఈనెల 4వ తేదీన వన్‍ప్లస్ నార్డ్ సీఈ 3 లైట్ 5జీ ఇండియాలో విడుదల కానుంది. ఈ ఫోన్ గురించి ఇప్పటి వరకు వెల్లడైన సమాచారం ఇదే. ఓ లుక్కేయండి.

వన్‍ప్లస్ నార్డ్ సీఈ 3 లైట్ 5జీ స్పెసిఫికేషన్లు

OnePlus Nord CE 3 Lite 5G Specifications: 6.72 ఇంచుల డిస్‍ప్లేతో వన్‍ప్లస్ నార్డ్ సీఈ 3 లైట్ 5జీ రానుంది. 120 హెర్ట్జ్ స్క్రీన్ రిఫ్రెష్ రేట్ ఉంటుందని వన్‍ప్లస్ పేర్కొంది. ఎల్సీడీ డిస్‍ప్లే ఉంటుందని తెలుస్తోంది. ఇక డ్యుయల్ స్టీరియో స్పీకర్ సెటప్ ఈ ఫోన్‍కు ఉంటుందని వన్‍ప్లస్ తాజాగా వెల్లడించింది. ఎక్కువ సౌండ్ కోసం అల్ట్రా వాల్యూమ్ మోడ్ ఉంటుందని తెలిపింది.

OnePlus Nord CE 3 Lite 5G ఫోన్‍లో స్నాప్‍డ్రాగన్ 695 ప్రాసెసర్‌ ఉంటుందని వన్‍ప్లస్ కన్ఫార్మ్ చేసింది. ఇంటర్నల్ స్టోరేజీని ఉపయోగించుకొని వర్చువల్‍గా ర్యామ్‍ను పొడిగించుకునే ఫీచర్ ఇవ్వనున్నట్టు పేర్కొంది. ఈ ఫోన్ వెనుక మూడు కెమెరాలు ఉంటాయి. 108 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరాగా ఉంటుందని వన్‍ప్లస్ వెల్లడించింది. 2 మెగాపిక్సెల్, 2 మెగాపిక్సెల్ సామర్థ్యంతో మిగిలిన రెండు కెమెరాలు ఉంటాయని తెలుస్తోంది. 16 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉండొచ్చు.

వన్‍ప్లస్ నార్డ్ సీఈ 3 లైట్ 5జీ మొబైల్ 5,000mAh బ్యాటరీతో వస్తోంది. 67 వాట్ల పాస్ట్ చార్జింగ్‍కు సపోర్ట్ చేస్తుందని వన్‍ప్లస్ వెల్లడించింది. రెండు కలర్ ఆప్షన్‍లలో ఈ ఫోన్ వస్తుందని వన్‍ప్లస్ ఇప్పటికే ఫొటోలను టీజ్ చేస్తోంది.

వన్‍ప్లస్ నార్డ్ సీఈ 2 లైట్ 5జీకి సక్సెసర్‌గా నార్డ్ సీఈ 3 లైట్ 5జీ వస్తోంది.

OnePlus Nord CE 3 Lite 5G Price: వన్‍ప్లస్ నార్డ్ సీఈ 3 లైట్ 5జీ ప్రారంభ ధర రూ.21,999గా ఉండనుందని సమాచారం లీకైంది. పాస్టెల్ లైమ్, క్రోమాటిక్ గ్రే కలర్ ఆప్షన్‍లలో ఈ ఫోన్ లభిస్తుంది. ఈనెల 4వ తేదీ సాయంత్రం 7 గంటలకు వన్‍ప్లస్ నార్డ్ సీఈ 3 లైట్ 5జీ ఫోన్‍తో పాటు వన్‍ప్లస్ నార్డ్ బడ్స్ 2 (OnePlus Nord Buds 2) టీడబ్ల్యూఎస్ కూడా విడుదల కానుంది.

తదుపరి వ్యాసం