Ola S1 Pro Gen2: ఓలా ఎస్ 1, ప్రొ జెన్ 2 ఎలక్ట్రిక్ స్కూటర్ల డెలివరీ ప్రారంభం
13 October 2023, 20:30 IST
- Ola S1 Pro Gen2: ఎస్ 1 ప్రొ జెన్ 2 (S1 Pro Gen2) ఎలక్ట్రిక్ స్కూటర్ల డెలివరీ ని ఓలా ప్రారంభించింది. దేశవ్యాప్తంగా దాదాపు 100 నగరాల్లో ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ల డెలివరీని ప్రారంభించినట్లు ఓలా ప్రకటించింది.
ఎస్ 1 ప్రొ జెన్ 2 ఎలక్ట్రిక్ స్కూటర్
Ola S1 Pro Gen2: భారతదేశంలో అతిపెద్ద ఎలక్ట్రిక్ వాహనాల కంపెనీ ఓలా ఎలక్ట్రిక్ ఈరోజు సరికొత్త S1 ప్రో Gen 2 స్కూటర్ల డెలివరీని ప్రారంభించింది. దాదాపు 100 నగరాల్లో ఈ స్కూటర్ల డెలివరీ ప్రారంభమైంది.
అడ్వాన్స్డ్ టెక్నాలజీ..
భారతదేశంలో S1 Pro Gen2 ఎలక్ట్రిక్ స్కూటర్స్ డెలివరీలను ప్రారంభిస్తున్నట్లు ఓలా ఎలక్ట్రిక్ (Ola Electric) ప్రకటించింది. ఈ స్కూటర్ ధరను రూ. 1.48 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఇండియా) గా నిర్ణయించారు. ఈ ఏడాది ఆగస్ట్ లో ఈ స్కూటర్స్ బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. ఈ బైక్ కు సంబంధించినంతవరకు చాసిస్ లో, బ్యాటరీ ప్యాక్ లో, టెక్నాలజీలో కీలక మార్పులు చేశారు. వాహనం బరువును కూడా భారీగా తగ్గించారు. ఇందులో మోనో షాక్ యూనిట్ కు బదులుగా టెలీస్కోపిక్ ఫ్రంట్ ఫోర్క్స్ ను అమర్చారు.
11 కిలోవాట్ బ్యాటరీ
ఈ ఎస్ 1 ప్రొ జెన్ 2 (S1 Pro Gen2) ఎలక్ట్రిక్ స్కూటర్ లో శక్తిమంతమైన 11 కిలోవాట్ (14.7 బీహెచ్పీ) బ్యాటరీ ప్యాక్ ను పొందుపర్చారు. ఈ బైక్ గంటకు 120 కిమీల గరిష్ట వేగంతో వెళ్లగలదు.అంతేకాదు, జీరో నుంచి 40 కిమీల వేగాన్ని కేవలం 2.6 సెకన్లలో చేరుకోగలదు. సింగిల్ చార్జ్ తో గరిష్టంగా 185 కిమీలు ప్రయాణించగలదు. అంతేకాదు, ఈ బైక్ జెన్ 1 మోడల్ కన్నా 6 కేజీలు తక్కువ బరువు ఉంటుంది.
ఇతర ఫీచర్లు..
కొత్త S1 ప్రో లో రీడిజైన్ చేయబడిన అల్లాయ్ వీల్స్, సింగిల్-పీస్ గ్రాబ్ రైల్ ను అమర్చారు. అయితే బూట్ స్పేస్ ను మాత్రం జెన్ 1 మోడల్ కన్నా 2 లీటర్లు తగ్గించారు. ఈ మోడల్ బూట్ స్పేస్ 34 లీటర్లు. స్ 1 ప్రొ జెన్ 2 (S1 Pro Gen2) ఎలక్ట్రిక్ స్కూటర్ జెట్ బ్లాక్, మ్యాట్ వైట్, స్టెల్లార్, మిడ్‌నైట్ బ్లూ మరియు అమెథిస్ట్ అనే ఐదు రంగులలో లభిస్తుంది.