తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Noisefit Force Plus: అమోలెడ్ డిస్‍ప్లే, రగెడ్ లుక్‍తో నాయిస్‍ కొత్త స్మార్ట్‌వాచ్ లాంచ్: ధర, ఫీచర్ల వివరాలివే

NoiseFit Force Plus: అమోలెడ్ డిస్‍ప్లే, రగెడ్ లుక్‍తో నాయిస్‍ కొత్త స్మార్ట్‌వాచ్ లాంచ్: ధర, ఫీచర్ల వివరాలివే

27 April 2023, 17:26 IST

google News
    • NoiseFit Force Plus Smartwatch: నాయిస్‍ఫిట్ ఫోర్స్ ప్లస్ స్మార్ట్‌వాచ్ లాంచ్ అయింది. అమోలెడ్ డిస్‍ప్లేతో పాటు రగెడ్ డిజైన్ ఈ వాచ్‍కు హైలైట్‍గా ఉన్నాయి.
NoiseFit Force Plus: అమోలెడ్ డిస్‍ప్లే, రగెడ్ లుక్‍తో నాయిస్‍ కొత్త స్మార్ట్‌వాచ్ లాంచ్ (Photo: Noise)
NoiseFit Force Plus: అమోలెడ్ డిస్‍ప్లే, రగెడ్ లుక్‍తో నాయిస్‍ కొత్త స్మార్ట్‌వాచ్ లాంచ్ (Photo: Noise)

NoiseFit Force Plus: అమోలెడ్ డిస్‍ప్లే, రగెడ్ లుక్‍తో నాయిస్‍ కొత్త స్మార్ట్‌వాచ్ లాంచ్ (Photo: Noise)

NoiseFit Force Plus Smartwatch : దేశీయ కంపెనీ నాయిస్ (Noise) వరుసగా మార్కెట్‍లోకి స్మార్ట్‌వాచ్‍లను తెస్తూనే ఉంది. కొత్త మోడళ్లను తీసుకొస్తోంది. ఈ క్రమంలోనే ఫోర్స్ లైనప్‍లో మరో వాచ్‍ను విడుదల చేసింది. నాయిస్‍ఫిట్ ఫోర్స్ ప్లస్ (NoiseFit Force Plus) స్మార్ట్‌వాచ్ భారత్‍లో లాంచ్ అయింది. సర్కులర్ అమోలెడ్ (AMOLED) డిస్‍ప్లేను ఈ వాచ్ కలిగి ఉంది. అలాగే స్పోర్టీగా, రఫ్‍గా ఉండే రగెడ్ లుక్‍తో ఈ వాచ్ వచ్చింది. బ్లూటూత్ కాలింగ్ సపోర్ట్ ఉంటుంది. నాయిస్‍ఫిట్ ఫోర్స్ ప్లస్ స్మార్ట్‌వాచ్ వివరాలు ఇవే.

నాయిస్‍ఫిట్ ఫోర్స్ ప్లస్ స్పెసిఫికేషన్లు, ఫీచర్లు

NoiseFit Force Plus: 1.46 ఇంచుల సర్కిల్ షేప్డ్ అమోలెడ్ డిస్‍ప్లేతో నాయిస్‍ఫిట్ ఫోర్స్ ప్లస్ స్మార్ట్‌వాచ్ వచ్చింది. 466 x 466 పిక్సెల్స్ రెజల్యూషన్, ఆల్వేస్ ఆన్ డిస్‍ప్లే ఫీచర్ ఉంటుంది. డిస్‍ప్లే చుట్టూ రెగెట్ లుక్‍తో ఓ మెటల్ చేసిస్ ఉంటుంది. సిలికాన్ స్ట్రాప్‍‍లను ఈ వాచ్ కలిగి ఉంది.

బ్లూటూత్ కాలింగ్‍తో..

NoiseFit Force Plus: ట్రూసింక్ బ్లూటూత్ కాలింగ్ ఫీచర్‌తో నాయిస్‍ఫిట్ ఫోర్స్ ప్లస్ వాచ్ వచ్చింది. ఇందుకోసం ఈ వాచ్‍లో మైక్రోఫోన్ మైక్ ఉంటాయి. మొబైల్‍కు బ్లూటూత్ ద్వారా కనెక్ట్ చేసుకొని వాచ్ ద్వారానే కాల్స్ మాట్లాడవచ్చు. ఫోన్‍కు వచ్చే నోటిఫికేషన్లను వాచ్‍లోనే చూడవచ్చు.

హెల్త్ ఫీచర్లు, మరిన్ని..

NoiseFit Force Plus: హార్ట్ రేట్ మానిటరింగ్, నిద్రను విశ్లేషించే స్లీప్ ట్రాకింగ్, ఎస్‍పీఓ2 మానిటరింగ్, ఒత్తిడిని చూపించే స్ట్రెస్ ట్రాకింగ్, బ్రీత్ ప్రాక్టీస్ హెల్త్ ఫీచర్లతో నాయిస్‍ఫిట్ ఫోర్స్ ప్లస్ వచ్చింది. 130కుపైగా స్పోర్ట్స్ మోడ్‍లకు ఈ వాచ్ సపోర్ట్ చేస్తుంది. 100కుపైగా వాచ్ ఫేసెస్ అందుబాటులో ఉంటాయి.

NoiseFit Force Plus: ఫుల్ చార్జ్‌పై నాయిస్‍ఫిట్ ఫోర్స్ ప్లస్ ఏడు రోజుల వరకు బ్యాటరీ లైఫ్ ఇస్తుంది. బ్లూటూత్ కాలింగ్‍తో వాడితే కాస్త తక్కువ రావొచ్చు. స్మార్ట్ ఫోన్‍లో నాయిస్‍ఫిట్ యాప్‍నకు ఈ వాచ్‍ను సింక్ చేసుకోవచ్చు. వాయిస్ అసిస్టెంట్ ఫీచర్ కూడా ఈ వాచ్‍కు ఉంటుంది.

నాయిస్‍ఫిట్ ఫోర్స్ ప్లస్ ధర, సేల్ డేట్

NoiseFit Force Plus Smartwatch: నాయిస్‍ఫిట్ ఫోర్స్ ప్లస్ స్మార్ట్‌వాచ్ ధర రూ.3,999గా ఉంది. మే 1వ తేదీన ఫ్లిప్‍కార్ట్, నాయిస్ అధికారిక వెబ్‍సైట్‍లో ఈ వాచ్ సేల్‍కు వస్తుంది. బ్లాక్, మిస్ట్ గ్రే, టీల్ బ్లూ కలర్ ఆప్షన్‍లలో ఈ వాచ్ లభిస్తుంది.

తదుపరి వ్యాసం