Nissan Magnite facelift : నిస్సాన్ మాగ్నైట్ ఫేస్‌లిఫ్ట్‌లో కనిపించే మార్పులు ఇవే..
06 October 2024, 6:26 IST
- Nissan Magnite facelift on road price : నిస్సాన్ మాగ్నైట్ ఫేస్‌లిఫ్ట్ ఇటీవలే లాంచ్ అయ్యింది. ఈ నేపథ్యంలో కొత్త వర్షెన్‌లో కనిపించే 5 ముఖ్యమైన మార్పుల గురించి ఇక్కడ తెలుసుకుందాము..
నిస్సాన్ మాగ్నైట్ ఫేస్‌లిఫ్ట్
ఇండియా ఆటోమొబైల్ మార్కెట్లో నిస్సాన్‌కి బెస్ట్ సెల్లింగ్ ఎస్‌యూవీగా కొనసాగుతోంది నిస్సాన్ మాగ్నైట్. ఇక ఇప్పుడు మాగ్నైట్‌కి ఫేస్‌లిఫ్ట్ వర్షెన్‌ని తీసుకొచ్చింది సంస్థ. కస్టమర్లు ఈ కొత్త వర్షెన్‌పై ఆసక్తి చూపిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ నిస్సాన్ మాగ్నైట్ ఫేస్‌లిఫ్ట్‌లో కనిపించే 5 మార్పుల గురించి ఇక్కడ తెలుసుకుందాము..
కొత్త ఎక్స్టీరియర్..
మాగ్నైట్ ఎక్స్టీరియర్లో పియానో బ్లాక్, క్రోమ్ ఇన్సర్ట్లను ఉపయోగించే కొత్త బోల్డ్ గ్రిల్‌ను అప్డేట్ చేశారు. ఫ్రంట్ బంపర్ ఇప్పుడు కొంచెం అగ్రెసివ్‌గా కనిపిస్తుంది. ఫ్రంట్ ఫాగ్ ల్యాంప్స్ స్థానాన్ని రివైజ్ చేసింది. ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్స్, డేటైమ్ రన్నింగ్ ల్యాంప్స్ ఒకేలా ఉంటాయి.సైడ్లలో డ్యూయెల్ టోన్ ఫినిషింగ్ పొందే 16 ఇంచ్ అల్లాయ్ వీల్స్ ఉన్నాయి. వెనుక భాగంలో మైల్డ్ రివైజ్డ్ ఎల్ఈడీ టెయిల్ ల్యాంప్స్ మాత్రమే ఉన్నాయి.
కొత్త ఇంటీరియర్..
ఎక్స్టీరియర్ మాదిరిగానే, నిస్సాన్ మాగ్నైట్ ఎస్యూవీ ఫేస్‌లిఫ్ట్ ఇంటీరియర్ కూడా మారింది. డ్యాష్‌బోర్డ్ లేఅవుట్ మాత్రం పాత మాగ్నైట్‌ని పోలి ఉంటుంది. నిస్సాన్ దీనిని సన్ సెట్ ఆరెంజ్ అని పిలుస్తున్న కొత్త కలర్ స్కీమ్‌కు మార్చింది. అంతేకాక, ఇప్పుడు లెథరెట్ ఫినిష్ కూడా అందుబాటులో ఉంది.
ఇదీ చూడండి:- Hyundai cars : పండగ సీజన్లో ఈ హ్యుందాయ్ కార్లపై బంపర్ ఆఫర్లు.. త్వరపడండి!
కొత్త ఫీచర్లు..
మాగ్నైట్ ఫేస్‌లిఫ్ట్ వైర్లెస్ ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్ ప్లేలను సపోర్ట్ చేసే అదే టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టెమ్తో వస్తోంది. అయితే 7 ఇంచ్ డ్రైవర్ డిస్ప్లే ఇప్పుడు కాన్ఫిగర్ చేయగల కొత్త గ్రాఫిక్స్‌తో అప్డేట్ అయ్యింది. నిస్సాన్ వైర్ లెస్ ఫోన్ ఛార్జర్‌తో పాటు యాంబియంట్ లైటింగ్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ కోసం వివిధ కలర్స్‌ని అందిస్తోంది.
కొత్త వేరియంట్ లైనప్..
నిస్సాన్ మాగ్నైట్ వేరియంట్ల పేర్లను మార్చింది. సబ్ కాంపాక్ట్ ఎస్‌యూవీని ఇప్పుడు విసియా, విసియా+, అసెంటా, ఎన్-కనెక్టా, టెక్నా, టెక్నా+ లలో విక్రయించనున్నారు. ఇంతకు ముందు, వేరియంట్ల పేర్లు ఎక్స్ఈ, ఎక్స్ఎల్, ఎక్స్‌వీ, ఎక్స్‌వీ ప్రీమియం. ఎస్వీ కురో ఎడిషన్.
మెరుగైన భద్రత..
భద్రత పరంగా, నిస్సాన్ మాగ్నైట్ ఫేస్‌లిఫ్ట్ ఇప్పుడు 6 ఎయిర్ బ్యాగులను ప్రామాణికంగా తీసుకురానుంది. ఫ్రేమ్‌లెస్ డిజైన్‌తో కొత్త ఆటో-డిమ్మింగ్ ఐఆర్వీఎమ్ కూడా ఉంది. ఇది కాకుండా, మాగ్నైట్ 360-డిగ్రీ పార్కింగ్ కెమెరా, ఫ్రంట్- రేర్ పార్కింగ్ సెన్సార్లు, హిల్ హోల్డ్ అసిస్ట్, టీపీఎంఎస్తో వస్తుంది.
నిస్సాన్ మాగ్నైట్ ఫేస్‌లిఫ్ట్‌పై సంస్థ భారీ ఆశలు పెట్టుకుంది. గట్టి పోటీ మధ్య బిజినెస్ సాగించాలంటే ఈ మాగ్నైట్ ఫేస్‌లిఫ్ట్ వర్షెన్ కూడా క్లిక్ అవ్వడం చాలా ముఖ్యం. ఈ మోడల్‌కి టాటా పంచ్, మారుతీ సుజుకీ బ్రెజా, హ్యుందాయ్ వెన్యూ వంటి బెస్ట్ సెల్లింగ్ ఎస్‌యూవీల నుంచి పోటీ ఎదురువుతోంది.