Budget 2024: మధ్యంతర బడ్జెట్లో ‘ఆ నాలుగు కులాల’కే ప్రాధాన్యత; వారి ప్రగతే లక్ష్యం..
01 February 2024, 18:47 IST
Budget 2024: ప్రధాని అభివర్ణించిన ప్రకారం.. సమాజంలోని నాలుగు కులాల అభివృద్ధే లక్ష్యంగా బడ్జెట్ ను రూపకల్పన చేశామని ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ వెల్లడించారు. ఆ నాలుగు కులాలు మహిళలు, యువత, రైతులు, పేదలు అని తెలిపారు.
ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్
Four castes described by Modi: ప్రధాని నరేంద్ర మోదీ నాలుగు కులాలుగా అభివర్ణించిన మహిళలు, యువత, రైతులు, పేదల సాధికారతపై ప్రభుత్వం దృష్టి సారించిందని బడ్జెట్ (BUDGET) ప్రసంగంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పునరుద్ఘాటించారు. ఈ "నాలుగు కులాలు" ప్రభుత్వ విధానాలకు కేంద్ర బిందువుగా ఉన్నాయన్నారు. ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేసే వర్గాలు ఇవేనన్నారు.
వారి ప్రగతే లక్ష్యం
విధాన నిర్ణయాల ద్వారా మహిళలు, యువత, రైతులు, పేదల స్థితిని మెరుగుపరచాలన్న ప్రభుత్వ ఉద్దేశాన్ని ఆర్థిక మంత్రి తన బడ్జెట్ (BUDGET) ప్రసంగంలో నొక్కిచెప్పారు. ఈ ప్రసంగంలో సైద్ధాంతిక ఆందోళన, పెరుగుతున్న భారతదేశ జనాభా గురించి కూడా ఆమె ప్రస్తావించారు. ‘‘2047 నాటికి వికసిత భారత్ (అభివృద్ధి చెందిన భారత్)ను అభివృద్ధి చేయాలనే ప్రభుత్వ లక్ష్యాన్ని వివరిస్తూ, ఆ లక్ష్యాన్ని సాధించడానికి, "మనం ప్రజల సామర్థ్యాలను మెరుగుపరచాలి. వారికి సాధికారత కల్పించాల’’ని ఆర్థిక మంత్రి అన్నారు. జనాభా విస్ఫోటనం వల్ల ఎదురవుతున్న సవాళ్లపై ఆమె మాట్లాడుతూ, వేగవంతమైన జనాభా పెరుగుదల, జనాభా మార్పుల వల్ల తలెత్తే సవాళ్లను విస్తృతంగా పరిశీలించడానికి ప్రభుత్వం ఒక ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేస్తుందన్నారు.