తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Maruti Suzuki Swift Cng : సరికొత్తగా మారుతీ సుజుకీ స్విఫ్ట్​ సీఎన్జీ- లాంచ్​ ఎప్పుడు? మార్పులేంటి?

Maruti Suzuki Swift CNG : సరికొత్తగా మారుతీ సుజుకీ స్విఫ్ట్​ సీఎన్జీ- లాంచ్​ ఎప్పుడు? మార్పులేంటి?

Sharath Chitturi HT Telugu

06 September 2024, 8:20 IST

google News
    • మారుతీ సుజుకీ స్విఫ్ట్​ సీఎన్జీలో అప్డేటెడ్​ వర్షెన్​ లాంచ్​కు రెడీ అవుతోంది. ఇంకో వారంలో ఇది లాంచ్​ అవుతుందని సమాచారం. ఈ నేపథ్యంలో ఈ మోడల్​పై ఇప్పటివరకు ఉన్న వివరాలను ఇక్కడ తెలుసుకుందాము..
న్యూ జెన్​ మారుతీ సుజుకీ స్విఫ్ట్​ సీఎన్జీ వచ్చేస్తోంది..
న్యూ జెన్​ మారుతీ సుజుకీ స్విఫ్ట్​ సీఎన్జీ వచ్చేస్తోంది..

న్యూ జెన్​ మారుతీ సుజుకీ స్విఫ్ట్​ సీఎన్జీ వచ్చేస్తోంది..

ఇండియా ఆటోమొబైల్​ మార్కెట్​లోని ఎస్​యూవీలు, ఈవీలతో పాటు సీఎన్జీ సెగ్మెంట్​కి కూడా మంచి డిమాండ్​ కనిపిస్తోంది. ఈ సెగ్మెంట్​లో అధిక మార్కెట్​ షేరు కలిగిన సంస్థ మారుతీ సుజుకీ. ఇక ఇప్పుడు.. స్విఫ్ట్​ సీఎన్జీకి కొత్త వర్షెన్​ తీసుకురానుంది ఈ దిగ్గజ ఆటోమొబైల్​ సంస్థ.​ కొత్త తరం మారుతీ సుజుకీ స్విఫ్ట్ ఈ ఏడాది మేలో భారతదేశంలోకి వచ్చింది. ఇక ఇప్పుడు పాప్యులర్​ హ్యాచ్​బ్యాక్​ స్విఫ్ట్​ సీఎన్జీ వేరియంట్​ని ప్రవేశపెట్టడానికి సన్నద్ధమవుతోంది. కొత్త తరం స్విఫ్ట్ సీఎన్జీ వచ్చే వారంలోనే లాంచ్​ అయ్యే అవకాశం ఉందని డీలర్​షిప్స్​ సూచిస్తున్నాయి. ఈ కొత్త వర్షెన్​ మరింత స్థిరమైన- పాకెట్ ఫ్రెండ్లీ ప్రత్యామ్నాయాన్ని తీసుకువస్తుందని అంచనాలు ఉన్నాయి. 2024 మారుతీ సుజుకీ స్విఫ్ట్​ లాంచ్​ అయినప్పటి నుంచి ఈ హ్యాచ్​బ్యాక్​కి డిమాండ్​ మరింత పెరిగింది. ఈ నేపథ్యంలో కొత్త స్విఫ్ట్​ సీఎన్జీలోనూ ఇదే డిమాండ్​ కనిపిస్తుందని సంస్థ భావిస్తోంది. ఈ నేపథ్యంలో ఈ కొత్త మారుతీ సుజుకీ స్విఫ్ట్​ సీఎన్జీపై ఇప్పటివరకు ఉన్న వివరాలను ఇక్కడ తెలుసుకుందాము..

కొత్త తరం మారుతీ సుజుకీ స్విఫ్ట్ సీఎన్జీ: ఏమి ఆశించాలి?

కొత్త తరం స్విఫ్ట్ సీఎన్జీ అనేక అప్​గ్రేడ్​లను పొందుతుంది. అన్నింటికంటే పెద్దది.. కొత్త 1.2-లీటర్, 3 సిలిండర్​ జెడ్ 12ఈ నేచురల్ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్​తో వచ్చే ఇంజిన్​! మునుపటి 1.2-లీటర్ కే-సిరీస్ 4 సిలిండర్​ పెట్రోల్​ ఇంజిన్​తో పోలిస్తే, కొత్త మోటారు మెరుగైన ఇంధన సామర్థ్యం కోసం ఆప్టిమైజ్ చేయడం జరిగింది. సీఎన్జీ వేరియంట్ కోసం, కొత్త జెడ్ 12ఈ మోటారు డ్రై ఫ్యూయెల్​కి అనుగుణంగా డీట్యూన్ చేయడానికి ఉపయోగపడుతుంది. అంతేకాదు ఈ ఇంజిన్​ పొందుతున్న తొలి సీఎన్జీ కారు మారుతీ సుజుకీ స్విఫ్ట్​. ఫలితంగా రానున్న కాలంలో సీఎన్జీ వాహనాలకు ఈ ఇంజిన్​ని జోడించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.

రాబోయే మారుతీ సుజుకీ స్విఫ్ట్ సీఎన్జీ పెట్రోల్ వేరియంట్ల కంటే సుమారు రూ .80,000-90,000 ప్రీమియంను కలిగి ఉంటుందని అంచనాలు ఉన్నాయి. హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 నియోస్, హ్యుందాయ్ ఎక్స్​టర్​, టాటా పంచ్ నుంచి వస్తున్న పోటీకి పోటీగా స్విఫ్ట్ సీఎన్జీని అధిక వేరియంట్లలో ప్రవేశపెట్టవచ్చు. ముఖ్యంగా, టాటా మోటార్స్, హ్యుందాయ్ రెండూ తమ కార్లలో ట్విన్ సిలిండర్ సీఎన్జీ కిట్లను ఉపయోగిస్తున్నాయి. మారుతీ సుజుకీ సైతం కొత్త స్విఫ్ట్ సీఎన్జీతో ట్విన్​ సిలిండర్​ని తీసుకొస్తుందా? లేదా? అన్నది ఆసక్తికరంగా మారింది.

ఇండియన్ సీఎన్జీ ప్యాసింజర్ వెహికల్ కేటగిరీలో మారుతీ సుజుకీకి అధిక మర్కెట్​ షేరు ఉంది. మొత్తం అమ్మకాల్లో సీఎన్జీ మోడళ్ల వాటా 34 శాతంగా ఉందని కంపెనీ వెల్లడించింది. కొత్త స్విఫ్ట్ సీఎన్జీతో ఈ సంఖ్య మరింత పెరుగుతుందని సంస్థ భావిస్తోంది. ప్రస్తుతానికైతే ఇది కొనుగోలుదారులకు ఇష్టమైన ఆప్షనగా ఉంది. 2024 ఆర్థిక సంవత్సరంలో 4.5 లక్షల యూనిట్లను విక్రయించగా, 2025 ఆర్థిక సంవత్సరంలో 6 లక్షల సీఎన్జీ వాహనాలను విక్రయించాలనే లక్ష్యాన్ని చేరుకోవడానికి ఇది కంపెనీకి సహాయపడుతుంది.

ఇవి ప్రస్తుతం రూమర్స్​గానే ఉన్నాయి. వీటిపై అధికారిక ప్రకటన రావల్సి ఉంది. కొత్త మారుతీ సుజుకీ స్విఫ్ట్ సీఎన్జీపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. లాంచ్​ నాటికి పూర్తి వివరాలు అందుబాటులో వస్తాయి.

తదుపరి వ్యాసం