తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Navratna Company Declares 60% Dividend: 60% డివిడెండ్ ప్రకటించిన నవరత్న కంపెనీ

Navratna company declares 60% dividend: 60% డివిడెండ్ ప్రకటించిన నవరత్న కంపెనీ

HT Telugu Desk HT Telugu

12 November 2022, 23:03 IST

google News
    • Navratna company declares 60% dividend: ప్రభుత్వ రంగ నవరత్న కంపెనీ తన ఇన్వెస్టర్లకు శుభవార్త తెలిపింది. షేర్ హోల్డర్లకు 60% డివిడెండ్ ఇవ్వబోతున్నట్లు ప్రకటించింది.
ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం (PTI)

ప్రతీకాత్మక చిత్రం

Navratna company declares 60% dividend: కంటైనర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్(Container Corporation of India Ltd) ప్రభుత్వ రంగ నవరత్న కంపెనీల్లో ఒకటి. దీని మార్కెట్ విలువ రూ. 46,781.62 కోట్లు. లాజిస్టిక్స్ బిజినెస్ లో ఉన్న లార్జ్ క్యాప్ కంపెనీ ఇది.

Navratna company declares 60% dividend: లాజిస్టిక్స్ కంపెనీ

కంటైనర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్(Container Corporation of India Ltd) లాజిస్టిక్స్ కు సంబంధించి క్యారియర్, టెర్మినల్ ఆపరేటర్, వేర్ హౌజ్ ఆపరేటర్ రంగాల్లో జాతీయ, అంతర్జాతీయ స్థాయిల్లో వ్యాపార కార్యకలాపాలు సాగిస్తోంది.

Navratna company declares 60% dividend: 60% డివిడెండ్

కంటైనర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్(Container Corporation of India Ltd) సంస్థ శనివారం ఈ ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికం(Q2) ఫలితాలను విడుదల చేసింది. ఈ సందర్భంగా సంస్థ మదుపర్లకు 60% డివిడెండ్ ఇవ్వబోతున్నట్లు ప్రకటించింది. ఈ ఆర్థిక సంవత్సరం లో ఇస్తున్న రెండో మధ్యంతర డివిడెండ్ ఇది. 60% అంటే రూ. 5 ముఖ విలువ కలిగిన ప్రతీ షేరుపై రూ. 3 లను డివిడెండ్ గా ఇస్తున్నట్లు వెల్లడించింది. డివిడెండ్ల రూపంలో రూ. 182.79 కోట్లను షేర్ హోల్డర్లకు ఇస్తున్నట్లు తెలిపింది. ఇందుకు రికార్డు డేట్ నవంబర్ 23వ తేదీ అని వెల్లడించింది. నవంబర్ 30 తరువాత షేర్ హోల్డర్ల ఖాతాల్లో ఈ మొత్తం చేరుతుందని తెలిపింది.

Navratna company declares 60% dividend: Q2 ఫలితాలు..

ఈ ఆర్థిక సంవత్సరం Q2 లో సంస్థ రూ. 303.80 కోట్ల నికర లాభాలను ఆర్జించింది. గత సంవత్సరం Q2లో ఇది 253.21 కోట్లుగా ఉంది. అంటే గత Q2తో పోలిస్తే, నికర లాభాల్లో దాదాపు 20% పెరుగుదల నమోదైంది. అలాగే, ఈ Q1 సంస్థ నికర లాభాలు రూ. 296.83 కోట్ల లాభాలను ఆర్జించింది. కంపెనీ నికర సేల్స్ విషయానికి వస్తే.. ఈ Q2లో రూ. 1986.34 కోట్ల నికర సేల్స్ ను సాధించింది. గత సంవత్సరం Q2లో నికర సేల్స్ మొత్తం రూ. 1837.20 కోట్లు.

Navratna company declares 60% dividend: షేరు వాల్యూ..

Container Corporation of India షేరు విలువ శుక్రవారం, నవంబర్ 11న రూ. 770.00 వద్ద క్లోజ్ అయింది. అంతకుముందు రోజు క్లోజింగ్ అయిన రూ. 803.30 కన్నా ఇది 4.15% తక్కువ. సంస్థ షేరు విలువ 2022 సంవత్సరంలో 24.23% పెరిగింది.

తదుపరి వ్యాసం