తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Motorola Edge 50 Ultra : మోటోరోలా ఎడ్జ్​ 50 అల్ట్రా ఫీచర్స్​ లీక్​.. లాంచ్​ ఎప్పుడు?

Motorola Edge 50 Ultra : మోటోరోలా ఎడ్జ్​ 50 అల్ట్రా ఫీచర్స్​ లీక్​.. లాంచ్​ ఎప్పుడు?

Sharath Chitturi HT Telugu

12 April 2024, 8:13 IST

  • Motorola Edge 50 Ultra : మోటోరోలా ఎడ్జ్​ 50 అల్ట్రా ఫీచర్స్.. ఆన్​లైన్​లో లీక్​ అయ్యాయి. ఆ వివరాలను ఇక్కడ చూసేయండి.

మోటోరోలా ఎడ్జ్​ 50 అల్ట్రా ఫీచర్స్ ఇవే?
మోటోరోలా ఎడ్జ్​ 50 అల్ట్రా ఫీచర్స్ ఇవే? (Aishwarya Panda/ HT Tech)

మోటోరోలా ఎడ్జ్​ 50 అల్ట్రా ఫీచర్స్ ఇవే?

Motorola Edge 50 Ultra price in India : మోటోరోలా ఇటీవల ఎడ్జ్ 50 ప్రోతో కొత్త తరం ఎడ్జ్​ స్మార్ట్​ఫోన్​ను లాంచ్​ చేసింది. అయితే ఎడ్జ్ 50 సిరీస్​లో త్వరలోనే "అల్ట్రా" మోడల్​తో మరిన్ని మోడళ్లు లాంచ్ అయ్యే అవకాశం ఉంది. మోటోరోలా ఎడ్జ్ 50 అల్ట్రా.. గీక్బెంచ్ వెబ్​సైట్​ లిస్టింగ్​లో కనిపించింది. ఫలితంగా స్మార్ట్​ఫోన్​కి సంబంధించిన కొన్ని స్పెసిఫికేషన్లు లీక్​ అయ్యాయి. ఎడ్జ్ 50 అల్ట్రా రాబోయే వారాల్లో భారతదేశంలో అధికారికంగా లాంచ్ అవుతుందని మార్కెట్​ వర్గాలు భావిస్తున్నాయి. ఈ నేపథయంలో ఈ మొబైల్​పై ఇప్పటివరకు ఉన్న వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

ట్రెండింగ్ వార్తలు

Tata Ace EV 1000: టాటా ఏస్ ఈవీ 1000 ఎలక్ట్రిక్ కార్గో వెహికిల్ లాంచ్; రేంజ్ 161 కిమీ..

Motorola Edge 50 Fusion launch: ఇండియాలో మోటరోలా ఎడ్జ్ 50 ఫ్యూజన్ లాంచ్; స్పెసిఫికేషన్లు, ధర వివరాలు

IQOO Z9x 5G launch: ఐక్యూ జడ్9ఎక్స్ 5జీ స్మార్ట్ ఫోన్ లాంచ్; ధర, ఫీచర్స్ ఇవే..

Multibagger IPO: ‘నాలుగేళ్ల క్రితం ఈ ఐపీఓలో రూ. 1 లక్ష ఇన్వెస్ట్ చేసినవారు ఇప్పుడు కోటీశ్వరులయ్యారు..’

మోటోరోలా ఎడ్జ్ 50 అల్ట్రా..

గీక్బెంచ్ లిస్టింగ్ ప్రకారం, మోటోరోలా ఎడ్జ్ 50 అల్ట్రా సింగిల్-కోర్​లో 1947 పాయింట్లు, మల్టీ-కోర్ పరీక్షల్లో 5149 పాయింట్లు పొందింది. అడ్రినో 735 జీపీయూతో కనెక్ట్​ చేసిన కొత్త క్వాల్కమ్​ స్నాప్​డ్రాగన్ 8ఎస్ జెన్ 3 ఎస్​ఓసీతో ఈ స్మార్ట్​ఫోన్ పనిచేయనుంది.

అదనంగా.. ఎడ్జ్ 50 అల్ట్రా 12 జీబీ ర్యామ్​తో వస్తుందని టాక్​ నడుస్తోంది. ఇది ఆండ్రాయిడ్ 14 ఆధారిత మోటోరోలా యూఐపై పనిచేసే అవకాశం ఉంది. ఆండ్రాయిడ్ హెడ్​లైన్స్ నివేదిక ప్రకారంయయ మోటోరోలా ఎడ్జ్ 50 అల్ట్రాలో ట్రిపుల్ కెమెరా సెటప్ ఉండనుంది. ఇందులో 50 మెగాపిక్సెల్ సెన్సార్, 5ఎక్స్ ఆప్టికల్ జూమ్​తో కూడిన పెరిస్కోప్ లెన్స్ ఉండనున్నట్లు తెలుస్తోంది.

Motorola Edge 50 Ultra specifications : ఈ స్మార్ట్​ఫోన్​ కలర్ ఆప్షన్ లీకైంది. ఇది పీచ్ ఫజ్ ఇది 2024 కోసం పాంటోన్ కలర్ ఆఫ్ ది ఇయర్​గా నిలిచింది. ఇంకా, "సిసాల్" అని పిలుస్తున్న నలుపు- లేత గోధుమ రంగు షేడ్ ఉంటుంది.

మోటోరోలా ఎడ్జ్​ 50 ప్రో హై-ఎండ్ వెర్షన్​గా ఈ ఎడ్జ్ 50 అల్ట్రా లాంచ్ అయ్యే అవకాశం ఉంది. అందువల్ల, ఎక్కువ పనితీరు, స్పెసిఫికేషన్లు ఉంటాయని మార్కెట్​ వర్గాలు భావిస్తున్నాయి.

అయితే ఈ వార్తలు, ఊహాగానాలపై ఆధారపడి ఉన్నందున ఈ వివరాలను ధృవీకరించడానికి అధికారిక లాంచ్ ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే. ఈ స్మార్ట్​ఫోన్​ లాంచ్ తేదీతో పాటు ధర, ఇతర ఫీచర్స్​కి సంబంధించిన వివరాలపై త్వరలో ఓ క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి, కొత్త ఎడ్జ్ 50 అల్ట్రా తన వినియోగదారులకు ఏమి అందిస్తుందో తెలుసుకోవడానికి ఇంకొన్ని వారాలు వేచి ఉండాల్సిందే!

మోటోరోలా ఎడ్జ్​ 50 ప్రో ఫీచర్స్​ చూశారా..?

Motorola Edge 50 Ultra release date : ఈ మోటోరోలా ఎడ్జ్​ 50 ప్రోలో.. రెండు వేరియంట్లు లభిస్తున్నాయి. 8 జీబీ ర్యామ్​ + 256 జీబీ స్టోరేజ్​ వేరియంట్ ధర రూ .31999గా ఉంది. ఇక 12 జీబీ ర్యామ్​ + 256 జీబీ స్టోరేజ్​ వేరియంట్ ధర రూ .35999గా ఉంది. 8 జీబీ ర్యామ్ వేరియంట్​తో 68వాట్ ఛార్జర్.. 12 జీబీ ర్యామ్ వేరియంట్​తో​125వాట్ ఛార్జర్​ను మోటోరోలా విడుదల చేసింది. మోటరోలా ఎడ్జ్ 50 ప్రో సేల్స్​.. ఈరోజు, ఏప్రిల్​ 9న మధ్యాహ్నం 12 గంటలకు ఫ్లిప్​కార్ట్​, Motorola.in సహా దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖ రిటైల్ స్టోర్స్​లో సేల్స్​ మొదలయ్యాయి. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

ఇంకో విషయం! హెచ్​టీ తెలుగు ఇప్పుడు వాట్సాప్ ఛానల్స్​లో ఉంది! టెక్నాలజీ ప్రపంచం నుంచి ఎటువంటి అప్డేట్స్​ని మీరు మిస్ కాకుండా ఉండటానికి మమ్మల్ని అక్కడ అనుసరించండి. వాట్సప్ లో హెచ్​టీ తెలుగు ఛానల్​ని అనుసరించండి.

తదుపరి వ్యాసం