తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Popular Cars In India : 1947 తర్వాత చాలా ఫేమస్ కార్లు.. ఈ లిస్టులో కింగ్ ఆఫ్ ఇండియన్ రోడ్స్ కూడా

Popular Cars In India : 1947 తర్వాత చాలా ఫేమస్ కార్లు.. ఈ లిస్టులో కింగ్ ఆఫ్ ఇండియన్ రోడ్స్ కూడా

Anand Sai HT Telugu

22 October 2024, 13:30 IST

google News
    • Most Popular Cars In India : భారతదేశంలో ఆటోమెుబైల్ రంగం ఎవరూ ఊహించని విధంగా దూసుకెళ్తోంది. దశాబ్దల కిందట కూడా ఇండియాలో కార్లకు మంచి డిమాండ్ ఉండేది. 1947 తర్వాత కొన్ని కార్లు ఎక్కువగా ఫేమస్ అయ్యాయి. అవేంటో చూద్దాం..
అంబాసిడర్ కారు
అంబాసిడర్ కారు (Wikipedia)

అంబాసిడర్ కారు

భారతదేశంలో పరిశ్రమలు వేగంగా అభివృద్ధి చెందుతున్నాయి. ఆటోమెుబైల్ రంగం కూడా గత దశాబ్దంలో భారీగా పెరిగింది. ఈ రంగంలో అగ్రగామి దేశాలతో ఇండియా పోటీ పడుతుంది. ఇక్కడ ఉత్పత్తి చేసిన కార్లు ప్రపంచంలోని వివిధ ప్రాంతాలకు ఎగుమతి అవుతున్నాయి. దేశంలో తయారైన కొన్ని కార్లను ఇప్పటికీ అనేకమంది తమ ఇళ్లలోనే ఉంచుకుంటున్నారు. 1947 తర్వాత ఎక్కువగా ఫేమస్ అయిన కొన్ని కార్లు ఉన్నాయి. ఇప్పటికీ అవి అప్డేట్ వెర్షన్‌లో మన ముందుకు వస్తున్నాయి. వాటి గురించి తెలుసుకుందాం..

ముందుగా హిందుస్థాన్ అంబాసిడర్ కారు గురించి కచ్చితంగా మాట్లాడుకోవాలి. ఈ కారు 1956 నుంచి మన దేశంలో ఈ కార్లు తయారు అయ్యేవి. ఇది 2014 వరకు ఉత్పత్తిలో ఉంది. ప్రముఖ వ్యాపారవేత్తలు, రాజకీయ నాయకులకు ఇష్టమైన వాహనం. దీని డిజైన్ అప్పట్లో అందరినీ ఆకర్షించేది. కింగ్ ఆఫ్ ఇండియన్ రోడ్స్ అని పిలిచేవారు. అంబాసిడర్ చివరిగా రూ. 4.31 లక్షల నుండి రూ. 6.04 లక్షల ఎక్స్-షోరూమ్ ధరగా ఉంది.

అంబాసిడర్ మోడల్‌లోని ప్రీమియర్ పద్మిని కారు కూడా 90వ దశకంలో విపరీతమైన ఆదరణ పొందింది. ఈ కారును ఫియట్ కంపెనీ భాగస్వామ్యంతో ప్రీమియర్ ఆటోమొబైల్స్ లిమిటెడ్ 1967లో భారతదేశంలో తయారు చేసి పరిచయం చేశారు. విశ్వసనీయతకు పేరుగాంచిన ప్రీమియర్ పద్మిని కారు మార్కెట్‌లో తీవ్రమైన పోటీ కారణంగా 2000లో నిలిపివేశారు. అప్పట్లో దీని ఎక్స్-షోరూమ్ ధర రూ.1.95 లక్షలు.

మారుతి 800.. 1983లో మారుతీ ఉద్యోగ్ లిమిటెడ్, సుజుకి మోటార్ భాగస్వామ్యంతో ప్రారంభించారు. అదే సంవత్సరంలో కారు డెలివరీ ప్రారంభమైంది. కొన్ని కారణాల వల్ల జనవరి 18, 2014న మారుతి 800 ఉత్పత్తి నిలిపివేశారు. అప్పటి వరకు 29.2 లక్షల యూనిట్ల కార్లు తయారయ్యాయి. ప్రస్తుత మారుతి సుజుకి ఆల్టో కె10 కంపెనీ ప్రారంభ వెర్షన్.

1985లో దేశీయ విపణిలోకి విడుదలైన మారుతీ జిప్సీ వినియోగదారులను ఎంతగానో ఆకర్షించింది. ఇది ఇప్పటికీ సైనిక వాహనంగా వాడుకలో ఉంది. 2017లో జిప్సీ ఉత్పత్తి నిలిచిపోయింది. రూ.5.21 లక్షల నుంచి రూ.6.73 లక్షల చొప్పున దొరికేది. పెట్రోల్ ఆప్షన్‌లో లభించే ఈ కారు లీటరుకు 14.8 కేఎంపీఎల్ మైలేజీని ఇచ్చింది. ఇప్పుడు జిప్సీ స్థానంలో జిమ్నీ ఉంది.

1998లో ప్రవేశపెట్టిన హోండా సిటీ సెడాన్ అనేక అప్డేట్స్‌తో విక్రయిస్తున్నారు. కొత్త తరం సిటీ ధర రూ. 11.71 లక్షల నుండి రూ. 16.19 లక్షల మధ్య ఎక్స్-షోరూమ్‌గా ఉంది.

మరోవైపు 2002లో ప్రారంభించిన మహీంద్రా స్కార్పియో ఇప్పటికీ ప్రజాదరణ పొందింది. స్కార్పియో ఎన్, క్లాసిక్ వేరియంట్‌లలో అందుబాటులో ఉంది.

2005లో ప్రవేశపెట్టిన మారుతి సుజుకి స్విఫ్ట్, 2015లో ప్రవేశపెట్టిన హ్యుందాయ్ క్రెటా, టాటా నెక్సాన్ కూడా చాలా ప్రజాదరణ పొందాయి.

2005లో విడుదలైన టొయోటా ఇన్నోవా మంచి ఆదరణ పొందింది. ప్రస్తుతం భారీ సంఖ్యలో విక్రయాలు జరుపుతోంది. Innova Hicross ధర రూ. 19.77 లక్షల నుంచి రూ. 30.68 లక్షల మధ్య ఉండగా, ఇన్నోవా క్రిస్టా రూ. 19.99 లక్షల నుంచి రూ. 26.30 లక్షల ఎక్స్-షోరూమ్ ధరగా ఉంది. ప్రస్తుతం చాలా కార్లు మార్కెట్‌లో హల్‌చల్ చేస్తున్నాయి.

తదుపరి వ్యాసం