తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Higher Capital Gains Tax: ‘క్యాపిటల్ గెయిన్స్’పై పన్నును భారీగా పెంచే ప్రయత్నం

Higher Capital Gains Tax: ‘క్యాపిటల్ గెయిన్స్’పై పన్నును భారీగా పెంచే ప్రయత్నం

HT Telugu Desk HT Telugu

18 April 2023, 16:04 IST

google News
  • 2024 లో జరిగే లోక్ సభ ఎన్నికల అనంతరం, మళ్లీ అధికారంలోకి వస్తే, ప్రత్యక్ష పన్నుల విధానంలో పెద్ద ఎత్తున సంస్కరణలు తీసుకురావాలని మోదీ సర్కారు యోచిస్తున్నట్లు సమాచారం.

 ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం (HT Photo)

ప్రతీకాత్మక చిత్రం

Higher Capital Gains Tax: ప్రస్తుతం అమల్లో ప్రత్యక్ష పన్నుల విధానంలో చాలా లోపాలున్నాయని, సంపన్నులు, సామాన్యుల మధ్య అంతరాన్ని తగ్గించే దిశగా ప్రస్తుతం అమల్లో ఉన్న ప్రత్యక్ష పన్నుల విధానంలో ఎలాంటి విధివిధానాలు లేవని ఒక విమర్శ ఉంది. దాంతో, ప్రత్యక్ష పన్నుల విధానంలో సంస్కరణలకు (tax reforms) తెర తీయాలని కేంద్రప్రభుత్వం ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.

Higher Capital Gains Tax: కాలం చెల్లిన విధానం

ప్రస్తుత ప్రత్యక్ష పన్నుల (direct taxes) విధానం కాలం చెల్లిన పద్ధతులను పాటిస్తోందన్న విమర్శనల నేపథ్యంలో.. ఆదాయంలోని అంతరాలను తగ్గించే దిశగా, పన్నుల విధానంలో మార్పులు చేయడానికి ఇప్పటికే కసరత్తు ప్రారంభమైందని తెలుస్తోంది. వచ్చే లోక్ సభ ఎన్నికల్లో అధికారంలోకి వస్తే, ఆ వెంటనే ఈ విషయంపై కచ్చితమైన నిర్ణయం తీసుకునే అవకాశముంది. పన్ను మదింపు విధానాలను కూడా కాలానుగుణంగా మార్చలేదని, అందువల్ల వాటిని కూడా ప్రస్తుత పరిస్థితులకు తగ్గట్లుగా మార్చాలని భావిస్తున్నారు.

Higher Capital Gains Tax: క్యాపిటల్ గెయిన్స్ పై పన్ను పెంపు

కేంద్ర ఆర్థిక శాఖ లోని విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. పన్నుల విధానంలో (TAX SYSTEM) తీసుకురావాలని భావిస్తున్న సంస్కరణల్లో ‘క్యాపిటల్ గెయిన్స్ (capital gains)’ పై పన్నును భారీగా పెంచాలన్న ప్రతిపాదన ప్రధానమైనది. ఇప్పుడు అధికాదాయ వర్గాలపై గరిష్టంగా 30% పన్ను విధిస్తున్నారు. కానీ ఈక్విటీ ఫండ్స్ (equity funds), స్టాక్స్ (stocks) పై లభించే ఆదాయంపై పన్ను తక్కువగానే ఉంది. ఇది పురోగామి (progressive) పన్ను విధానం కాదని, ఇది సమానత్వ భావనకు కూడా వ్యతిరేకమన్న భావన ఆర్థిక రంగా నిపుణుల్లో నెలకొని ఉంది. క్యాపిటిల్ గెయిన్స్ (capital gains) పై పన్నును గరిష్ట స్థాయికి పెంచడం ద్వారా అత్యంత అధిక ఆదాయ వర్గాల నుంచి గరిష్టంగా పన్నును వసూలు చేయవచ్చు. అయితే, ఈ ఆలోచనలన్నీ కూడా ప్రస్తుతానికి ప్రతిపాదనల స్థాయిలోనే ఉన్నాయి. ఈ ప్రతిపాదనలను మరింత అధ్యయనం చేసి ఒక సమగ్ర నివేదిక రూపొందించడం కోసం కేంద్ర ప్రభుత్వం ఒక నిపుణుల కమిటీని త్వరలో ఏర్పాటు చేయనుంది. నిజానికి ప్రత్యక్ష పన్నుల (direct taxes) విధానంలో సమూల మార్పులు తీసుకురావలన్న ప్రతిపాదన మొదట 2009 లో ఆర్థిక వేత్త అయిన మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ (Dr Manmohan singh) హయాంలోనే వచ్చింది.

Higher Capital Gains Tax: పరోక్ష పన్నులపై అధికంగా ఆధారపడడం..

ఒకవైపు సంపన్నుల సంఖ్య భారీగా పెరుగుతుండడం, మరోవైపు, పేదలు పేదలుగానే మిగిలిపోవడం వెనుక పరోక్ష పన్నులపై (indirect taxes) భారత దేశం ఎక్కువగా ఆధారపడడమేనని ఎకనమిస్ట్ ల భావన. వినియోగితపై ఆధారపడే పరోక్ష పన్నుల నుంచే కాకుండా, క్యాపిటల్ గెయిన్స్ వంటి ప్రత్యక్ష పన్నుల (direct taxes) ద్వారా కూడా ఆదాయాన్ని పెంచుకోవాలని వారు సూచిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా కూడా ఆదాయ అంతరాలను తగ్గించడానికి వివిధ దేశాలు ప్రయత్నిస్తున్నాయి. చైనా లో కామన్ ప్రాస్పరిటీ (common prosperity) ప్రొగ్రామ్ కానీ, అమెరికాలో సంపన్నులపై అధిక పన్నుల భారం వేయాలన్న (higher taxes for the wealthiest) ప్రతిపాదన కానీ ఈ దిశగా రూపొందినవే.

తదుపరి వ్యాసం