Rooftop solar scheme: 300 యూనిట్ల ఉచిత విద్యుత్ అందించే రూఫ్ టాప్ సోలార్ స్కీమ్ అంటే ఏంటి? ఎలా అప్లై చేసుకోవాలి..?
13 February 2024, 20:33 IST
- Rooftop solar scheme: ప్రతి నెలా 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందించడం లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ఇటీవల రూఫ్ టాప్ సోలార్ పథకాన్ని ప్రకటించింది. ఈ స్కీమ్ ద్వారా కోటి కుటుంబాలకు వెలుగులు నింపాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
రూఫ్ టాప్ సోలార్ స్కీమ్
Rooftop solar scheme: ప్రజలు తమ పైకప్పులపై సోలార్ ప్యానెళ్లను ఏర్పాటు చేసుకునేలా ప్రోత్సహించే రూఫ్ టాప్ సోలార్ పథకాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. రూ.75,000 కోట్లకు పైగా పెట్టుబడితో చేపట్టనున్న ఈ ‘‘పీఎం సూర్య ఘర్: ముఫ్త్ బిజ్లీ యోజన’’ ద్వారా కోటి కుటుంబాలకు ప్రతి నెలా 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. 2024-25 మధ్యంతర బడ్జెట్లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ పథకాన్ని మొదట ప్రకటించారు.
భారీగా సబ్సీడీలు..
ఈ సోలార్ ప్యానెల్ పథకం (Rooftop solar scheme) కింద లబ్దిదారులకు గణనీయమైన సబ్సిడీలు అందిస్తామని, వాటిని నేరుగా వారి బ్యాంకు ఖాతాలకు బదిలీ చేస్తామని 2024-25 మధ్యంతర బడ్జెట్లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు. ఈ సబ్సీడీని ప్రజల బ్యాంకు ఖాతాలకు నేరుగా ఇవ్వనున్నామన్నారు. అలాగే, రాయితీతో కూడిన బ్యాంకు రుణాలను అందిస్తామన్నారు. ‘‘పట్టణ స్థానిక సంస్థలు, పంచాయతీలు తమ పరిధిలో రూఫ్ టాప్ సోలార్ వ్యవస్థలను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ప్రోత్సహిస్తుంది. అదే సమయంలో, ఈ పథకం ప్రజలకు ఎక్కువ ఆదాయం, తక్కువ విద్యుత్ బిల్లులు, ఉపాధి కల్పనకు దారితీస్తుంది’’ అని మోదీ అభిప్రాయపడ్డారు. ఈ పథకం కింద ఇల్లు లేదా భవనం రూఫ్ టాప్ పై సోలార్ ఫోటోవోల్టాయిక్ (P) ప్యానెల్స్ ను అమరుస్తారు.
ఇలా అప్లై చేసుకోవాలి
ఈ పథకానికి లబ్దిదారులుగా చేరాలంటే ముందుగా https://pmsuryaghar.gov.in వెబ్ సైట్ ను సందర్శించి పూర్తి వివరాలు తెలుసుకోండి. ఆ వెబ్ సైట్ లో ఈ కింది స్టెప్స్ ఫాలో కావడం ద్వారా ఈ స్కీమ్ కు అప్లై చేసుకోవచ్చు.
- ముందుగా మీ రాష్ట్రాన్ని ఎంచుకోండి.
- మీ విద్యుత్ పంపిణీ సంస్థను ఎంచుకోండి.
- మీ విద్యుత్ వినియోగదారు సంఖ్యను నింపండి.
- మీ మొబైల్ నెంబరు ఎంటర్ చేయండి
స్టెప్ 2
- మీ కన్స్యూమర్ నెంబరు, మొబైల్ నెంబరులతో లాగిన్ అవ్వండి
- ఫారం లో పేర్కొన్న విధంగా వివరాలు నమోదు చేసి రూఫ్ టాప్ సోలార్ కోసం అప్లై చేయండి.
స్టెప్ 3
- మీ సాధ్యాసాధ్యాల ఆమోదం కోసం వేచి ఉండండి.
- మీ దరఖాస్తు ఆమోదం పొందగానే ఆ విషయాన్ని మీకు మెయిల్ లేదా మెసేజ్ చేస్తారు.
స్టెప్ 4
- ఇన్ స్టలేషన్ పూర్తయిన తరువాత, ప్లాంట్ వివరాలను సబ్మిట్ చేయండి. నెట్ మీటర్ కొరకు అప్లై చేయండి
స్టెప్ 5
- నెట్ మీటర్ ను ఇన్ స్టాల్ చేసిన తరువాత. డిస్కం అధికారులు తనిఖీ చేస్తారు. ఆ తరువాత, పోర్టల్ నుంచి కమిషన్ సర్టిఫికేట్ జనరేట్ అవుతుంది.
- బ్యాంకు ఖాతా వివరాలు, రద్దయిన చెక్కును పోర్టల్ ద్వారా సబ్మిట్ చేయాలి.
- 30 రోజుల్లో మీ బ్యాంకు ఖాతాలో సబ్సిడీ జమ అవుతుంది.