Microsoft Outage Again : మరోసారి మీ ల్యాప్‌టాప్ ఆగిపోవచ్చు.. ఏం చేయలేమని మైక్రోసాఫ్ట్ హెచ్చరిక!
25 July 2024, 10:00 IST
Microsoft Outage Again : మైక్రోసాఫ్ట్ అంతరాయం మరోసారి ప్రపంచవ్యాప్తంగా అలజడి సృష్టించనుంది. దీనిపై మైక్రోసాఫ్ట్ స్వయంగా హెచ్చరించింది. కంపెనీ ఇలా ఎందుకు చెప్పిందో వివరంగా తెలుసుకోండి.
మైక్రోసాఫ్ట్ అంతరాయం
మెున్నటికి మెున్న మైక్రోసాఫ్ట్ అంతరాయంతో ఏం చేయలేని పరిస్థితి ఏర్పడింది. మైక్రోసాఫ్ట్ విండోస్ ఆగిపోవడం వల్ల చాలా మంది ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అయితే మరోసారి ఈ సమస్య రావొచ్చు. మైక్రోసాఫ్ట్ స్వయంగా హెచ్చరించింది. గతంలో మైక్రోసాఫ్ట్ అంతరాయం కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఇబ్బందులు ఎదురయ్యాయి. విమానాశ్రయాలు, సర్వీస్ ప్రొవైడర్లు, టెలికాం పరిశ్రమ, మీడియా పరిశ్రమ, స్టాక్ మార్కెట్‌తో సహా ప్రపంచవ్యాప్తంగా కోట్లాది ల్యాప్‌ట్యాప్‌లు పనిచేయడం మానేశాయి. విమానాశ్రయంలో ప్రయాణికులు బోర్డింగ్ పాస్‌ను చేతితో రాయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు క్రౌడ్ స్ట్రయిక్ వంటి అంతరాయాలు భవిష్యత్తులో మళ్లీ జరగవచ్చని, అవి మళ్లీ జరగకుండా కంపెనీ నిరోధించలేదని మైక్రోసాఫ్ట్ తెలిపింది.
థర్డ్ పార్టీ వెండర్లు ఓఎస్‌కు పూర్తి కెర్నల్ యాక్సెస్ పొందడానికి అనుమతించే యూరోపియన్ కమిషన్ నిబంధన దీనికి కారణమని కంపెనీ తెలిపింది. ఇదిలావుండగా ఈ గణనీయమైన ప్రభావం గురించి ప్రపంచవ్యాప్తంగా నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే అంతరాయం ప్రపంచవ్యాప్తంగా 8.5 మిలియన్ల విండోస్ పీసీలను ప్రభావితం చేసింది. మరోవైపు, భద్రతా సమస్య లేదా సైబర్ దాడి జరగలేదని క్రౌడ్ స్ట్రయిక్ సూచించింది.
ఏదేమైనా ఆపిల్ పరికరాలు మైక్రోసాఫ్ట్ అంతరాయం వల్ల ప్రభావితం కాలేదు, ఎందుకంటే అవి థర్డ్ పార్టీ కంపెనీలకు అటువంటి ప్రాప్యతను అందించవు. మైక్రోసాఫ్ట్ థర్డ్ పార్టీ మీద ఆధారపడటం కూడా దీనికి కారణం. అటువంటి దాడులను ఎలా నివారించాలో ఇప్పుడు మైక్రోసాఫ్ట్ గుర్తించాలి.
రాబోయే కొద్ది రోజుల్లో ప్రభావిత వినియోగదారులు సంప్రదించడానికి కంపెనీ పేరును ఉపయోగించే వెబ్‌సైట్ల జాబితాను క్రౌడ్ స్ట్రయిక్ విడుదల చేసింది. మీ విండోస్ పీసీ బ్లూ స్క్రీన్ ఆఫ్ డెత్ సమస్యను ఎదుర్కోవడంలో మీకు సహాయపడతారు. సిస్టమ్‌ను సరిగ్గా నడపడానికి అవసరమైన పరిష్కారాలను కూడా ఇస్తారు.
మైక్రోసాఫ్ట్ అంతరాయం కారణంగా విండోస్‌లో నడుస్తున్న వందలాది ల్యాప్‌టాప్‌లు, కంప్యూటర్లు బ్లూ స్క్రీన్ ఆఫ్ డెత్ (బిఎస్ఒడి) ఎర్రర్స్ చూపించడం ప్రారంభించాయి. అందుకే సిస్టమ్‌లు అకస్మాత్తుగా మూసివేయబడ్డాయి. పదేపదే రిస్టార్ట్ అవ్వడం జరిగింది. క్రౌడ్ స్ట్రయిక్ 'ఫాల్కన్ సెన్సార్' అప్ డేట్ కారణంగా ఏర్పడిన మైక్రోసాఫ్ట్ అంతరాయాలు ప్రపంచవ్యాప్తంగా విమానయాన సంస్థలు, బ్యాంకులు, స్టాక్ మార్కెట్లు, ఇతర వ్యాపారాలను తీవ్రంగా ప్రభావితం చేశాయి. పలు సంస్థల్లో పనులు గంటల తరబడి నిలిచిపోయాయి.
చాలా విమానాశ్రయాలు చెక్-ఇన్ వ్యవస్థలను మూసివేసి, సేవలను మాన్యువల్‌గా నడిపారు. దీనివల్ల జాప్యం జరిగింది. అన్ని భారతీయ విమానయాన సంస్థలు తమ వ్యవస్థలు ప్రభావితమయ్యాయని తమ ప్రయాణికులకు ఎక్స్ ద్వారా తెలిపాయి. ఈ సమయంలో ప్రయాణికులకు చేతిరాతతో బోర్డింగ్ పాస్‌లు ఇచ్చారు.
డెత్ ఎర్రర్ బ్లూ స్క్రీన్ అంటే ఏమిటి?
బ్లాక్ స్క్రీన్ ఎర్రర్ లేదా స్టాప్ కోడ్ ఎర్రర్ అని కూడా బ్లూ స్క్రీన్ ఎర్రర్‌ను పిలుస్తారు. తీవ్రమైన సమస్య కారణంగా విండోస్‌ను అకస్మాత్తుగా మూసివేయమని లేదా పునఃప్రారంభించమని వచ్చినప్పుడు ఇది సంభవించవచ్చు. ఈ ఎర్రర్‌లో మీ కంప్యూటర్ దెబ్బతినకుండా నిరోధించడానికి Windows మూసివేయబడింది అనే సందేశాన్ని మీరు చూస్తారు.
హార్డ్‌వేర్ లేదా సాఫ్ట్‌వేర్ సమస్యల వల్ల ఈ లోపాలు తలెత్తవచ్చు. మీరు ఇటీవల కొత్త హార్డ్‌వేర్‌ను ఇన్‌స్టాల్ చేసి, బ్లూ స్క్రీన్ ఎర్రర్ ఎదుర్కొన్నట్లయితే.. మీ PCని మూసివేయడానికి, కొత్త హార్డ్‌వేర్‌ను తొలగించడానికి, పునఃప్రారంభించడానికి ప్రయత్నించండి. పునఃప్రారంభించడంలో మీకు ఇబ్బంది ఉంటే మీరు మీ PCని సేఫ్‌మోడ్‌లో ప్రారంభించవచ్చు.
ఆన్‌లైన్‌లో క్రౌడ్ స్ట్రయిక్ ఫిక్స్ వలె ఒక ఫైల్ ఉంది. కానీ అది నిజానికి మాల్వేర్. ఈ మాల్వేర్ హ్యాకర్లు మీ కంప్యూటర్‌ను స్వాధీనం చేసుకోవడానికి, మీ వ్యక్తిగత సమాచారాన్ని, డేటాను దొంగిలించడానికి అనుమతిస్తుంది.
ఏంటీ క్రౌడ్ స్ట్రయిక్
CrowdStrike అనేది గ్లోబల్ సెక్యూరిటీ సాఫ్ట్‌వేర్ ప్రొవైడర్, ప్రధాన బ్యాంకులు, హెల్త్‌కేర్, ఎనర్జీ సంస్థలతో సహా అనేక ఫార్చ్యూన్ 500 కంపెనీలకు సేవలు అందిస్తోంది. ఇది 2011లో స్థాపించబడింది. టెక్సాస్‌లోని ఆస్టిన్‌లో ఉంది, క్రౌడ్ స్ట్రయిక్ 170కి పైగా దేశాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తోంది.