International airports in India: దేశంలోని అంతర్జాతీయ విమానాశ్రయాలు ఎన్నో తెలుసా?-number of international airports in country up at 30 centre ,బిజినెస్ న్యూస్
Telugu News  /  Business  /  Number Of International Airports In Country Up At 30: Centre

International airports in India: దేశంలోని అంతర్జాతీయ విమానాశ్రయాలు ఎన్నో తెలుసా?

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

International airports in India: ప్రపంచ వ్యాప్తంగా విమానయానం పెరిగింది. విమాన ప్రయాణీకుల సంఖ్య రికార్డు స్థాయిలో పెరిగింది. దాంతో డిమాండ్ కు తగ్గట్లు విమానాశ్రయాల సంఖ్యను పెంచడానికి భారత ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది.

International airports: ప్రస్తుతం దేశంలోని విమానాశ్రయాలు రద్దీని తట్టుకునే స్థాయిలో లేవు. ఢిల్లీ, ముంబై వంటి అంతర్జాతీయ విమానాశ్రాయల్లో విపరీతమైన రద్దీ నెలకొంటోంది. దాంతో ప్రయాణీకులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవడంతో పాటు, తీవ్రమైన అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు. మేజర్ ఇంటర్నేషనల్ విమానాశ్రయాలు (International airports) 85% నుంచి 120% సామర్ధ్యంతో నడుస్తున్నాయి.

ట్రెండింగ్ వార్తలు

greenfield airports: కొత్తగా నాలుగు గ్రీన్ ఫీల్డ్స్

గత ఏడు సంవత్సరాలలో దేశవ్యాప్తంగా కొత్తగా ఆరు అంతర్జాతీయ విమానాశ్రయాలను(International airports) ఏర్పాటు చేశామని ప్రభుత్వం గురువారం లోక్ సభకు వెల్లడించింది. వాటిలో నాలుగు పర్యావరణ మిత్ర ‘గ్రీన్ ఫీల్డ్’ విమానాశ్రయాలని (greenfield airports) కేంద్రమంత్రి వీకే సింగ్ వెల్లడించారు. గత ఏడేళ్లలో కొత్తగా కేరళలోని కన్నూర్ లో, మహారాష్ట్రలోని షిర్దీలో, ఉత్తర ప్రదేశ్ లోని కుషీనగర్ లో, గోవాలోని మోపాలో గ్రీన్ ఫీల్డ్ విమానాశ్రయాలను(greenfield airports) నిర్మించామని తెలిపారు.

International airports in AP: ఏపీలో రెండు

అలాగే, ఆంధ్రప్రదేశ్ లో ఇప్పటికే విజయవాడ, తిరుపతిలలో ఉన్న విమానాశ్రయాలను అంతర్జాతీయ విమానాశ్రయాలు(International airports)గా అభివృద్ధి చేశామన్నారు. ‘2014 నాటికి దేశంలో మొత్తం 24 అంతర్జాతీయ విమానాశ్రాయలు ఉన్నాయి. ఎన్డీయే ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత గత ఏడేళ్లలో కొత్తగా ఆరు ఇంటర్నేషనల్ ఏర్ పోర్ట్స్(International airports) ను నిర్మించాం’ అని వివరించారు. కొత్తగా నిర్మించిన వాటిలో నాలుగు గ్రీన్ ఫీల్డ్ విమానాశ్రయాలు(greenfield airports) కాగా, రెండు విజయవాడ, తిరుపతిలలో ఇప్పటికే ఉన్న విమానాశ్రయాలను 2017లో అంతర్జాతీయ విమానాశ్రయాలుగా అభివృద్ధి చేశామని వివరించారు. ప్రస్తుతం దేశంలో మొత్తం 30 అంతర్జాతీయ విమానాశ్రయాలు(International airports) ఉన్నాయని స్పష్టం చేశారు.

WhatsApp channel