తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Meta Launches Threads: ‘థ్రెడ్స్’ ను లాంచ్ చేసిన మెటా; యుద్ధం మొదలైంది.. ట్విటర్ కు కష్టమే ఇక..

Meta Launches Threads: ‘థ్రెడ్స్’ ను లాంచ్ చేసిన మెటా; యుద్ధం మొదలైంది.. ట్విటర్ కు కష్టమే ఇక..

HT Telugu Desk HT Telugu

06 July 2023, 15:16 IST

google News
    • Meta Launches Threads: ఫేస్ బుక్, ఇన్ స్టా, వాట్సాప్ ల పేరెంట్ కంపెనీ మెటా నుంచి మరో సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ అందుబాటులోకి వచ్చింది. మైక్రో బ్లాగింగ్ యాప్ ‘థ్రెడ్స్’ ను మెటా లాంచ్ చేసింది. ‘లెట్స్ డూ దిస్.. వెల్ కం టు థ్రెడ్స్’ అంటూ మెటా సీఈఓ మార్క్ జుకర్ బర్గ్ అందులో తొలి పోస్ట్ చేశారు.
ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Meta Launches Threads: ఫేస్ బుక్, ఇన్ స్టా, వాట్సాప్ ల పేరెంట్ కంపెనీ మెటా నుంచి మరో సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ అందుబాటులోకి వచ్చింది. మైక్రో బ్లాగింగ్ యాప్ ‘థ్రెడ్స్ (Threads)’ ను మెటా లాంచ్ చేసింది. ‘లెట్స్ డూ దిస్.. వెల్ కం టు థ్రెడ్స్’ అంటూ మెటా సీఈఓ మార్క్ జుకర్ బర్గ్ (Meta CEO Mark Zuckerberg) అందులో తొలి పోస్ట్ చేశారు.

ఇన్ స్టా క్రెడెన్షియల్స్ తో..

థ్రెడ్స్ (Threads) యాప్ ను మొదట కొందరు ఎంపిక చేసిన వారికే అందుబాటులోకి తీసుకువచ్చారు. వారిలో మెటా సీఈఓ మార్క్ జుకర్ బర్గ్, కొందరు సీనియర్ జర్నలిస్ట్ లు, ఇండస్ట్రియలిస్ట్ లు, ఇతర ప్రముఖులు ఉన్నారు. వారి నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకున్న తరువాత, అవసరమైన మార్పులు చేసి.. ఇప్పుడు అందరికీ ఈ యాప్ ను అందుబాటులోకి తీసుకువచ్చారు. ప్రస్తుతానికి ఇన్ స్టాగ్రామ్ ఇన్ ఫ్రా స్ట్రక్చర్ నే ఈ థ్రెడ్ (Threads) వాడుకుంటోంది. యూజర్లు కూడా తమ ఇన్ స్టా క్రెడెన్షియల్స్ తో ఇందులో లాగిన్ కావచ్చు.

ట్విటర్ కు గట్టి పోటీ..

ఇప్పటివరకు మైక్రో బ్లాగింగ్ సెగ్మెంట్లో ట్విటర్ (Twitter) ది గుత్తాధిపత్యం. థ్రెడ్స్ రాకతో ట్విటర్ మోనోపలీకి తెర పడనుంది. ట్విటర్ ను టెస్లా, స్పేస్ ఎక్స్ వంటి సంస్థల ఓనర్ ఎలాన్ మస్క్ కొనుగోలు చేసి, స్వాధీనం చేసుకున్న తరువాత.. ట్విటర్ (Twitter) ఖ్యాతి మసకబారుతూ వస్తోంది. ట్విటర్ లో మస్క్ చేస్తున్న మార్పులు, ఆదాయం పెంపునకు యూజర్లపై భారం వేయడం.. మొదలైనవి ట్విటర్ ను యూజర్లకు దూరం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో, మైక్రో బ్లాగింగ్ మార్కెట్లోకి ఎంటరైన థ్రెడ్స్ (Threads).. ట్విటర్ కు గట్టిపోటీనే ఇవ్వనుందని విశ్లేషకులు భావిస్తున్నారు.

20 లక్షల మంది యూజర్లు

మార్కెట్లోకి రిలీజ్ చేసిన 2 గంటల్లోపే.. ‘థ్రెడ్స్ (Threads)’ కు 20 లక్షల మంది రిజిస్టర్ చేసుకున్నారని జుకర్ బర్గ్ వెల్లడించారు. ట్విటర్ (Twitter) కు ప్రత్యామ్నాయం అవసరమని నెటిజన్లు, సోషల్ మీడియా యూజర్లు భావిస్తున్నారని, అందువల్ల థ్రెడ్స్ కు మంచి స్పందన లభించిందని ఇన్ స్టా వైస్ ప్రెసిడెంట్ కానర్ హేయస్ వ్యాఖ్యానించారు.

తదుపరి వ్యాసం