Meta Threads : ట్విట్టర్‌కు పోటీగా మెటా ‘థ్రెడ్స్’.. ఈ వారంలోనే లాంచ్
Meta Threads : ట్విట్టర్‌కు పోటీగా మార్క్ జుకర్‌బర్గ్ తయారు చేసిన మెటా థ్రెడ్స్.. ఈ నెల 6న లాంచ్ కానుంది. పూర్తి వివరాలు..
Meta Threads launch date : ఫేస్బుక్ పేరెంట్ కంపెనీ మెటా.. మరో సోషల్ మీడియా యాప్‌తో ప్రజల ముందుకు రానుంది. ట్విట్టర్‌కు పోటీగా తీసుకోస్తున్న ఈ 'థ్రెడ్స్'ను.. ఈ గురువారం (జులై 6) లాంచ్ చేయనుంది. యాపిల్ యాప్ స్టోర్ లిస్టింగ్ ద్వారా ఈ విషయం తెలిసింది. యూరోప్‌లోని గూగుల్ ప్లే స్టోర్‌లో ఈ యాప్ సోమవారం దర్శనమిచ్చింది. రాత్రి నాటికి యాపిల్ యాప్ స్టోర్‌లో కూడా కనిపించింది.
ట్విట్టర్‌కు పోటీగా..
అపరకుబేరుడు ఎలాన్ మస్క్ ట్విట్టర్‌ను కొనుగోలు చేసిన తర్వాత నుంచి సామాజిక మాధ్యమ దిగ్గజం తరచుగా వార్తల్లో నిలుస్తోంది. ట్విట్టర్‌కు వివిధ మార్పులు చేస్తూ వివాదాలు సృష్టిస్తున్నారు ఎలాన్ మస్క్. ఫేస్బుక్ ఓనర్ మార్క్ జుకర్‌బర్గ్‌కు ఇదే సరైన సమయం! అందుకే ట్విట్టర్‌కు ప్రత్యామ్నాయంగా థ్రెడ్స్‌ను లాంచ్ చేసేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. లాంచ్ డేట్‌ను గురువారంగా ఫిక్స్ చేశారు. మరోవైపు ట్విట్టర్ కొత్త నిబంధనలపై అంసతృప్తి వ్యక్తం చేస్తున్న అడ్వర్టైజర్లకు మోటా థ్రెడ్స్ మంచి ఆప్షన్ అవుతుందని అభిప్రాయాలు వెలువడుతున్నాయి.
ఇదీ చూడండి:- Twitter | ఎలాన్ మస్క్ మరో ట్విస్ట్.. రోజుకు 600 ట్వీట్లు మాత్రమే చదవొచ్చంటూ పరిమితులు
Meta Threads App : యాప్ స్టోర్‌లో ప్రస్తుతం 'ప్రీ ఆర్డర్'తో అందుబాటులో ఉంది ఈ థ్రెడ్స్. యాప్ స్టోర్ లిస్టింగ్ ప్రకారం.. సమాజాలు ఒక చోట చేరి వివిధ అంశాలు, ట్రెండింగ్ టాపిక్స్‌పై చర్చలు జరుపుకునేందుకు, ఫేవరెట్ క్రియేటర్లతో కనెక్ట్ అయ్యేందుకు ఈ మెటా థ్రెడ్స్ ఉపయోగపడుతుంది. ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్ కలయికలో ఈ యాప్ ఉంటుంది. ఫలితంగా ఇన్స్టాగ్రామ్ యూజర్లు ఇందులో చేరుతారని సంస్థ భావిస్తోంది.
నెటిజన్ల స్పందన..
ఈ మెటా థ్రెడ్స్ లాంచ్‌పై ట్విట్టర్లో నెటిజన్లు స్పందిస్తున్నారు. కొందరు థ్రెడ్స్ కోసం ఎదురుచుస్తున్నామని అంటుంటే.. ఇంకొందరు మాత్రం ట్విట్టర్లోనే ఉంటామని చెబుతున్నారు.
'ఎలాన్ మస్క్‌పై నమ్మకం ఉంచండి. ట్విట్టర్లో కొనసాగండి', అని ఓ వ్యక్తి కామెంట్ చేయగా.. 'ఎన్ని యాప్‌లు వచ్చినా.. ట్విట్టర్‌ను ఢీకొట్టడం కష్టం,' అని మరో నెటిజన్ రాసుకొచ్చాడు.
సంబంధిత కథనం