తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Maruti Wagon R: 24 ఏళ్లలో 30 లక్షలు.. కార్ సేల్స్ లో వేగన్ ఆర్ రికార్డు

Maruti Wagon R: 24 ఏళ్లలో 30 లక్షలు.. కార్ సేల్స్ లో వేగన్ ఆర్ రికార్డు

HT Telugu Desk HT Telugu

16 May 2023, 19:58 IST

google News
    • Maruti Wagon R: మారుతి కార్లలో వేగన్ ఆర్ (Wagon R) కు ప్రత్యేక స్థానం ఉంది. డ్రైవింగ్ కంఫర్ట్, సీటింగ్ కంఫర్ట్, తిరుగులేని మైలేజీ తో బడ్జెట్ ఫ్రెండ్లీ కారుగా భారతీయ మధ్య తరగతిని ఈ కారు ఆకట్టుకున్నట్లుగా మరే కారు ఆకర్షించలేదు.
మారుతి వేగన్ ఆర్ కారు
మారుతి వేగన్ ఆర్ కారు

మారుతి వేగన్ ఆర్ కారు

Maruti Wagon R: ఈ వేగన్ ఆర్ (Wagon R) కారును మారుతీ సంస్థ 1999లో తొలిసారి మార్కెట్లో ప్రవేశపెట్టింది. నాటి నుంచి 2023 వరకు కూడా ప్రతీ సంవత్సరం ఈ కారు అమ్మకాల్లో తొలి ఐదు స్థానాల్లో నిలుస్తోంది.

Maruti Wagon R: 30 లక్షల కార్లు..

1999 నుంచి 2023 మార్చి వరకు మారుతి వేగన్ ఆర్ (Maruti Wagon R) కారు మొత్తం 30 లక్షల యూనిట్లు అమ్ముడుపోయింది. హ్యాచ్ బ్యాక్ సెగ్మెంట్లో ఈ కారు తిరుగులేని అమ్మకాలను సొంతం చేసుకుంది. ఎన్ని పోటీ సంస్థలు వేగన్ ఆర్ కు పోటీగా హ్యాచ్ బ్యాక్ కార్లను మార్కెట్లోకి తీసుకువచ్చినా.. వేగన్ ఆర్ (Maruti Wagon R) అమ్మకాలను దెబ్బ తీయలేకపోయాయి. అలాగే, ఇప్పటివరకు భారతీయ ఆటో మార్కెట్లో 30 లక్షల యూనిట్లు అమ్ముడుపోయిన మూడో కారు మోడల్ గా వేగన్ ఆర్ నిలిచింది. వేగన్ ఆర్ కన్నా ముందు మారుతి 800 ((Maruti 800), మారుతి ఆల్టో ((Maruti alto) కార్లు 30 లక్షల యూనిట్లు అమ్ముడుపోయాయి. వేగన్ ఆర్ (Maruti Wagon R) కొనుగోలుదారుల్లో మరో ప్రత్యేకత ఏమటంటే.. పాత వేగన్ ఆర్ స్థానంలో మళ్లీ కొత్త వేగన్ ఆర్ మోడల్ నే వారు కొనుగోలు చేశారు. వేగన్ ఆర్ కొనుగోలుదారుల్లో 24% ఇలాంటి కస్టమర్లే కావడం విశేషం.

Maruti Wagon R: మొదట 9ఏళ్లలో ఐదు లక్షలు..

మారుతి వేగన్ ఆర్ ను మార్కెట్లోకి ప్రవేశపెట్టిన తరువాత తొలి 5 లక్షల కార్లు అమ్ముడుపోవడానికి తొమ్మిదేళ్లు పట్టింది. కానీ తరువాత ఐదు లక్షల కార్లను మారుతి కేవలం నాలుగేళ్లలో అమ్మగలిగింది. 2015 నాటికి వేగన్ ఆర్ (Maruti Wagon R) సేల్స్ సంఖ్య 15 లక్షలకు చేరింది. వేగన్ ఆర్ కు ఇంత పాపులారిటీ లభించడానికి కారణం అందుబాటు ధర, నమ్మకమైన పనితీరు, మంచి స్టైల్ అండ్ డిజైన్, మంచి మైలేజీ మొదలైనవి.

Maruti Wagon R: థర్డ్ జనరేషన్ వేగన్ ఆర్

ప్రస్తుతం మార్కెట్లో థర్డ్ జనరేషన్ వేగన్ ఆర్ (Maruti Wagon R) అందుబాటులో ఉంది. ఇందులో 1.0 లీటర్, 1.2 లీటర్ పెట్రోలు ఇంజిన్ ఆప్షన్స్ ఉన్నాయి. అలాగే, మాన్యువల్, ఆటో గేర్ సదుపాయాలు ఉన్నాయి. సీఎన్జీ (CNG) వర్షన్ కూడా అందుబాటులో ఉంది. మాన్యువల్ ట్రాన్స్ మిషన్ తో వేగన్ ఆర్ (Maruti Wagon R) లీటర్ పెట్రోలుకు సుమారు 24.35 కిమీల మైలేజీ ఇస్తుంది. అలాగే, సీఎన్జీ మోడల్ కిలో సీఎన్జీ కి 34.05 కిమీల మైలేజీ ఇస్తుంది.

తదుపరి వ్యాసం