Maruti Suzuki Jimny Thunder Edition: మారుతి సుజుకీ నుంచి సరికొత్త జిమ్నీ ‘థండర్ ఎడిషన్’; ధర కూడా తక్కువే..
01 December 2023, 18:06 IST
- Maruti Suzuki Jimny Thunder Edition: మారుతి సుజుకీ సైలెంట్ గా తన జిమ్నీ మోడల్ లో లేటెస్ట్ ఎడిషన్ ను లాంచ్ చేసింది. దీనిని స్టాండర్డ్ జిమ్నీ మోడల్ కు స్వల్పంగా కాస్మెటిక్ మార్పులు చేసి రూపొందించారు.
జిమ్నీ థండర్ ఎడిషన్
జిమ్నీ కొత్త స్పెషల్ ఎడిషన్‌ను మారుతీ సుజుకి సైలెంట్‌గా ఇండియన్ మార్కెట్లో లాంచ్ చేసింది. ఈ థండర్ ఎడిషన్ జెటా, ఆల్ఫా వేరియంట్‌లతో లభిస్తుంది. జిమ్నీ థండర్ ఎడిషన్ ఎక్స్ షో రూమ్ ధర రూ. 10.74 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. హై ఎండ్ మోడల్ ఎక్స్ షో రూమ్ ధర రూ. 14.05 లక్షల వరకు ఉంటుంది.
స్పెషల్ స్టాండర్డ్ ఫీచర్స్
ఈ థండర్ ఎడిషన్ (Maruti Suzuki Jimny Thunder Edition) లో స్టాండర్డ్‌గా అనేక యాక్సెసరీస్ వస్తున్నాయి. అవి ఫ్రంట్ స్కిడ్ ప్లేట్, సైడ్ డోర్ క్లాడింగ్, డోర్ వైజర్, డోర్ సిల్ గార్డ్, గ్రిప్ కవర్, ఫ్లోర్ మ్యాట్, ఎక్ట్సీరియర్ గ్రాఫిక్.. మొదలైనవి. ముందు బంపర్, ORVM, సైడ్ ఫెండర్, హుడ్‌పై గార్నిష్ కూడా స్టాండర్డ్ గా అందిస్తున్నారు.
ఇంజన్ వివరాలు..
ఈ మారుతి సుజుకి జిమ్నీ థండర్ ఎడిషన్ లో ఎలాంటి ఇతర మార్పులు చేయలేదు. ఇందులో ఇతర జిమ్నీ మోడల్స్ తరహాలోనే 1.5-లీటర్, 4-సిలిండర్, K-సిరీస్ పెట్రోల్ ఇంజన్ ఉంటుంది. ఇది 6,000 rpm వద్ద 103 bhp గరిష్ట శక్తిని, 4,000 rpm వద్ద 134 Nm గరిష్ట టార్క్ అవుట్‌పుట్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇందులో 5-స్పీడ్ మాన్యువల్ లేదా 4-స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో గేర్ బాక్స్ ను అమర్చారు . మాన్యువల్ గేర్‌బాక్స్ ఉన్న కారు 16.94 kmpl మైలేజీ ఇస్తుందని కంపెనీ చెబుతోంది. ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ కారు 16.39 kmpl మైలేజీని అందిస్తుంది.
6 ఎయిర్ బ్యాగ్స్..
ఈ జిమ్నీ థండర్ ఎడిషన్ లో 6 ఎయిర్‌బ్యాగ్‌లు ఉంటాయి. EBDతో కూడిన ABS, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్, హిల్ హోల్డ్ కంట్రోల్, హిల్ డిసెంట్ కంట్రోల్, రియర్ వ్యూ కెమెరా, బ్రేక్ అసిస్ట్ ఫంక్షన్, ఇంజిన్ ఇమ్మొబిలైజర్ తదితర సేఫ్టీ ఫీచర్స్ ఉన్నాయి. టాప్-ఎండ్ ఆల్ఫా వేరియంట్‌లో పుష్ స్టార్ట్/స్టాప్ బటన్, క్రూయిజ్ కంట్రోల్, లెదర్ స్టీరింగ్ వీల్ కవర్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, భారీ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ ఉన్నాయి. అదనంగా, ఇందులో ఆటోమేటిక్ LED హెడ్‌ల్యాంప్‌లు, హెడ్‌ల్యాంప్ వాషర్లు, ఫాగ్ ల్యాంప్స్, ముదురు ఆకుపచ్చ గ్లాస్ విండో, బాడీ-కలర్ డోర్ హ్యాండిల్స్, అల్లాయ్ వీల్స్, ఎలక్ట్రికల్ ఫోల్డబుల్ ORVM లు కూడా ఉన్నాయి.
డైమెన్షన్స్
మారుతి సుజుకి జిమ్నీ 3,985 ఎంఎం పొడవు, 1,645 ఎంఎం వెడల్పు, 1,720 ఎత్తు ఉంటుంది. దీని వీల్ బేస్ 2,590 మిమీ. ఉంటుంది. వీల్ బేస్ ఎక్కువగా ఉండడం వల్ల ఈ మోడల్ లో ఎక్కువ క్యాబిన్ స్పేస్ ఉంటుంది.