తెలుగు న్యూస్ / ఫోటో /
Maruti Suzuki Jimny: ప్రత్యర్థులతో ఇక యుద్ధమే అంటున్న మారుతి సుజుకీ జిమ్నీ
- Maruti Suzuki Jimny : ఫ్లాగ్ షిప్ 4X4 ఎస్ యూ వీ జిమ్నీ ని మారుతి సుజుకీ బుధవారం ఇండియన్ మార్కెట్లో లాంచ్ చేసింది. వ్యూహాత్మకంగా ఈ జిమ్నీ ఎస్ యూ వీకి కాంపిటీటర్ల కన్నా ఆకర్షణీయమైన ధరను మారుతి సుజుకీ నిర్ణయించింది. దాంతో, మార్కెట్లో ఈ సెగ్మెంట్లో యుద్ధమేనని స్పష్టం చేసింది.
- Maruti Suzuki Jimny : ఫ్లాగ్ షిప్ 4X4 ఎస్ యూ వీ జిమ్నీ ని మారుతి సుజుకీ బుధవారం ఇండియన్ మార్కెట్లో లాంచ్ చేసింది. వ్యూహాత్మకంగా ఈ జిమ్నీ ఎస్ యూ వీకి కాంపిటీటర్ల కన్నా ఆకర్షణీయమైన ధరను మారుతి సుజుకీ నిర్ణయించింది. దాంతో, మార్కెట్లో ఈ సెగ్మెంట్లో యుద్ధమేనని స్పష్టం చేసింది.
(1 / 7)
Maruti Suzuki Jimny: ఈ 5 డోర్ ఎస్ యూవీ ఎక్స్ షో రూమ్ ప్రారంభ ధర రూ. 12.74 లక్షలని మారుతి సుజుకీ ప్రకటించింది. ఈ మోడల్ హై ఎండ్ వేరియంట్ ఎక్స్ షో రూమ్ ధర రూ. 15.05 లక్షలుగా నిర్ణయించింది. ఈ 5 డోర్ ఎస్ యూ వీ ని మారుతి సుజుకి మొదట ఇండియన్ మార్కెట్లో నే ప్రవేశపెట్టడం విశేషం.
(2 / 7)
Maruti Suzuki Jimny: ఈ మారుతి సుజుకి జిమ్నీ ఎస్ యూ వీ 3,985 ఎంఎం పొడవు, 1,645 ఎంఎం వెడల్పు, 1,720 ఎంఎం ఎత్తు ఉంటుంది. క్యాబిన్ స్పేస్ కూడా ఎక్కువగా ఉంటుంది. మారుతి సుజుకీ జిమ్నీలో 5 డోర్ మోడల్, 3 డోర్ మోడల్, 2 డోర్ మోడల్ ఉన్నాయి.
(3 / 7)
Maruti Suzuki Jimny: నిజానికి ఫస్ట్ జనరేషన్ జిమ్నీని అంతర్జాతీయ మార్కెట్లలో 1970లలోనే లాంచ్ చేశారు. అప్పటి నుంచి అంతర్జాతీయంగా మంచి మార్కెట్ ను సొంతం చేసుకుంది. ముఖ్యంగా ల్యాడర్ ఫ్రేమ్ చాసిస్, నాన్ ఇండిపెండెంట్ ఫ్రంట్ అండ్ రియర్ సస్పెన్షన్స్ వినియోగదారులను విశేషంగా ఆకట్టుకున్నాయి.
(4 / 7)
Maruti Suzuki Jimny: మారుతి జిమ్నీ రెండు డ్యుయల్ టోన్ కలర్స్ సహా మొత్తం ఏడు రంగుల్లో లభిస్తుంది. నెక్సా బ్లూ, సిజ్లింగ్ రెడ్, గ్రానైట్ గ్రే, పెరల్ ఆర్క్టిక్ వైట్, బ్లూయిష్ బ్లాక్ మొదలైన కలర్స్ లో జిమ్నీ లభిస్తుంది.
(5 / 7)
Maruti Suzuki Jimny: జిమ్నీ ఇంటీరియర్స్ లో ఎక్కువగా బ్లాక్ డామినేషన్ కనిపిస్తుంది. ఇందులో 9 ఇంచ్ మెయిన్ ఇన్ఫటైన్ మెంట్ టచ్ స్క్రీన్ ఉంది. ఇది ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్ ప్లే లను సపోర్ట్ చేస్తుంది.
(6 / 7)
Maruti Suzuki Jimny: ఈ మారుతి సుజుకీ జిమ్నీ ని ప్రీమియం నెక్సా రిటైల్ నెట్ వర్క్ ద్వారానే అమ్మనున్నారు. ఈ కారు మార్కెట్లో ప్రధానంగా మహింద్ర థార్, ఫోర్స్ గూర్ఖాలకు పోటీగా నిలవనుంది.
(7 / 7)
మహింద్ర థార్ ప్రధాన పోటీ దారు కావడంతో ఆ కారు ధరను దృష్టిలో పెట్టుకుని జిమ్నీ ధరను నిర్ణయించినట్లు తెలుస్తోంది. మహింద్ర థార్ ఎక్స్ షో రూమ్ ధర రూ. 13.87 లక్షల నుంచి రూ. 16.78 లక్షల మధ్య ఉండగా.. మారుతి సుజుకీ జిమ్నీ ఎక్స్ షో రూమ్ ధరను వ్యూహాత్మకంగా రూ. 12.74 లక్షల నుంచి రూ. 15.05 లక్షల మధ్య నిర్ణయించారు.
ఇతర గ్యాలరీలు