ఏడాదిన్నరలో 2లక్షల మంది కొన్న కారు ఇది- మైలేజ్‌లో ది బెస్ట్!
21 September 2024, 6:34 IST
- Maruti Suzuki Fronx sales : భారతీయ రోడ్లపై మారుతీ సుజుకీ ఫ్రాంక్స్ దూసుకెళుతోంది! మోడల్ లాంచ్ అయిన ఏడాదిన్నర లోపే 2 లక్షల సేల్స్ మైలురాయిని టచ్ చేసింది. పూర్తి వివరాలను ఇక్కడ తెలుసుకోండి.
మారుతీ సుజుకీ ఫ్రాంక్స్
దిగ్గజ ఆటోమొబైల్ సంస్థ మారుతీ సుజుకీకి ఫ్రాంక్స్ వెహికిల్ బెస్ట్ సెల్లింగ్ మోడల్‌గా మారింది! ఈ సబ్ కాంపాక్ట్ కూపే ఎస్యూవీ ఇప్పుడు కొత్త మైలురాయిని సాధించింది. మారుతీ సుజుకీ ఫ్రాంక్స్ ఏప్రిల్ 2023 లో లాంచ్ అయిన 17 నెలల్లోనే రెండు లక్షల సేల్స్ మైల్‌స్టోన్‌ని టచ్ చేసింది. ఈ బలెనో ఆధారిత క్రాసోవర్.. దేశీయ మార్కెట్లోనే కాకుండా ఇతర దేశాల్లో బలమైన డిమాండ్‌తో భారీ విజయాన్ని సాధించింది. ఫ్రాంక్స్ మరికొద్ది రోజుల్లో సుజుకి సొంత మార్కెట్ జపాన్‌లో సైతం లాంచ్ కానుంది!
మారుతీ సుజుకీ ఫ్రాంక్స్ సేల్స్..
లాంచ్ అయిన కేవలం రెండున్నర నెలల్లోనే 50,000 యూనిట్లు అమ్ముడుపోయాయి. 10 నెలల్లోనే మారుతీ సుజుకీ ఫ్రాంక్స్ 1 లక్ష అమ్మకాల మార్కును దాటింది. అయితే కేవలం 14 నెలల్లో 1.50 లక్షల మైలురాయిని సాధించింది. స్పోర్టీ, బచ్ స్టైలింగ్‌తో పాటు కూపే రూఫ్ లైన్ జనాలకు బాగా నచ్చింది.
దీనికితోడు 1.2-లీటర్ నేచురల్ ఆస్పిరేటెడ్ పెట్రోల్ కూడా హిట్ అయింది! పెప్పీ స్వభావం, పొదుపుకు ప్రసిద్ధి చెందిన కే-సిరీస్ ఇంజిన్ పనితీరు, సామర్థ్యం మధ్య ఆరోగ్యకరమైన సమతుల్యతను అందిస్తుంది. అంతేకాకుండా, 1.0-లీటర్ బూస్టర్ జెట్ ఇంజిన్ మాన్యువల్, టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ ఆప్షన్స్‌తో స్పోర్టియర్ పర్ఫర్మెన్స్ని అందిస్తుంది.
ఈ మారుతీ సుజుకీ ఫ్రాంక్స్ మైలేజ్ 20-23 కేఎంపీఎల్ మధ్యలో ఉంటుంది.
మారుతీ సుజుకీ ఫ్రాంక్స్ ఫీచర్లు..
మారుతీ సుజుకీ పోర్ట్‌ఫోలియోలో వేగంగా సేల్ అవుతున్న వెహికిల్స్‌లో ఈ ఫ్రాంక్స్ ఒకటి. యాపిల్ కార్ప్లే, ఆండ్రాయిడ్ ఆటోతో కూడిన టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టెమ్, పుడిల్ ల్యాంప్స్, హెచ్యూడీ యూనిట్, డీఆర్ఎల్లతో కూడిన ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్స్, ఎంఐడీ యూనిట్‌తో మరెన్నో ఫీచర్లతో ఈ మోడల్లో కనిపిస్తాయి.
మారుతీ సుజుకీ ఫ్రాంక్స్ ధర రూ .7.46 లక్షల (ఎక్స్-షోరూమ్) నుంచి ప్రారంభమవుతుంది. బ్రాండ్ ప్రీమియం నెక్సా అవుట్‌లెట్స్ ద్వారా కొనుగోలు చేసుకోవచ్చు. 2 లక్షల అమ్మకాల మైలురాయిని చేరుకున్న వేగవంతమైన నెక్సా మోడల్‌గా ఫ్రాంక్స్ నిలిచింది. ఈ సబ్ కాంపాక్ట్ ఎస్యూవీ ఈ సెగ్మెంట్లోని నిస్సాన్ మాగ్నైట్, రెనో కిగర్, టయోటా అర్బన్ క్రూయిజర్ వంటి ప్రత్యర్థులకు గట్టి పోటీనిస్తుంది.
50 లక్షల మందికిపైగా కొనుగోలు చేసిన ఏకైక కారు..
ఇండియాలో మారుతీ సుజుకీకి మంచి గుర్తింపు ఉంది. ఈ కంపెనీలో చాలా బెస్ట్ సెల్లింగ్ మోడల్స్ ఉన్నాయి. మారుతీ ఆల్టో దేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న కారుగా నిలిచింది. ఇప్పటి వరకూ 50 లక్షల యూనిట్లు అమ్ముడయ్యాయి! ఈ అద్భుత ఘనత సాధించిన ఏకైక మోడల్ ఇదే. విశేషమేమిటంటే ఇన్నేళ్ల తర్వాత కూడా దాని డిమాండ్ అలాగే ఉంది! టాప్-10 కార్ల జాబితాలో ఇది లేకపోయినప్పటికీ, ప్రతి నెలా 10 వేలకు పైగా వినియోగదారులు దీనిని కొనుగోలు చేస్తున్నారు. ఇది కంపెనీ ఎంట్రీ లెవల్ కారు కూడా. దేశంలోనే అత్యంత చౌకైన కారు కూడా ఇదే. దీని ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర రూ.3.99 లక్షలు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.