తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Jiofiber's Affordable Data Plans: ఇది చాలా చవకగా లభించే జియో ఫైబర్ డేటా ప్లాన్

JioFiber's affordable data plans: ఇది చాలా చవకగా లభించే జియో ఫైబర్ డేటా ప్లాన్

HT Telugu Desk HT Telugu

24 May 2023, 17:00 IST

    • JioFiber's affordable data plans: డేటా ఇప్పుడు నిత్యావసరం.  ప్రతీ ఇంట్లో వైఫై సర్వ సాధారణమైంది. ఈ నేపథ్యంలో తక్కువ ధరలోనే మంచి డేటా ప్లాన్ ను జియో ఫైబర్ తీసుకువచ్చింది. ఈ ప్రి పెయిడ్ ప్లాన్ లో రూ. 1197 కే మూడు నెలల పాటు అన్ లిమిటెడ్ డేటా లభిస్తుంది.
ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

JioFiber's data plans:రిలయన్స్ జియో కు చెందిన జియో ఫైబర్ వినియోగదారులకు వారి బ్రాడ్ బ్యాండ్ అవసరాలకు అనుగుణమైన పలు ప్రి పెయిడ్, పోస్ట్ పెయిడ్ ప్లాన్లను, వివిధ వ్యాలిడిటీలతో అందుబాటులోకి తీసుకువచ్చింది. వాటితో హై స్పీడ్ ఇంటర్ నెట్, ఫ్రీ కాలింగ్, ఓటీటీ సబ్ స్క్రిప్షన్లను అందిస్తోంది. అందులో ఒకటి రూ. 1197 ప్లాన్.

ట్రెండింగ్ వార్తలు

Tata Ace EV 1000: టాటా ఏస్ ఈవీ 1000 ఎలక్ట్రిక్ కార్గో వెహికిల్ లాంచ్; రేంజ్ 161 కిమీ..

Motorola Edge 50 Fusion launch: ఇండియాలో మోటరోలా ఎడ్జ్ 50 ఫ్యూజన్ లాంచ్; స్పెసిఫికేషన్లు, ధర వివరాలు

IQOO Z9x 5G launch: ఐక్యూ జడ్9ఎక్స్ 5జీ స్మార్ట్ ఫోన్ లాంచ్; ధర, ఫీచర్స్ ఇవే..

Multibagger IPO: ‘నాలుగేళ్ల క్రితం ఈ ఐపీఓలో రూ. 1 లక్ష ఇన్వెస్ట్ చేసినవారు ఇప్పుడు కోటీశ్వరులయ్యారు..’

JioFiber's 1197 plan: రూ. 1197 ప్లాన్ విశేషాలు

ఈ ప్లాన్ రూ. 1197 లకు లభిస్తుంది. వ్యాలిడిటీ 90 రోజులు. అంటే 30 రోజులకు రూ. 399. జీఎస్టీ అదనం. ఇందులో అప్ లోడ్ కు, డౌన్ లోడ్ కు 30 ఎంబీపీఎస్ స్పీడ్ తో అన్ లిమిటెడ్ డేటా లభిస్తుంది. వాయిస్ కాలింగ్ కూడా ఫ్రీ. ఈ ప్లాన్ లో ఒక్కో నెలకు గరిష్టంగా 3.3 టీబీ డేటాను వినియోగించుకోవచ్చు. ప్రతీ మూడు నెలలకు ఒకసారి రీచార్జ్ చేసుకోవాలి. అయితే, ఈ ప్లాన్ తో ఎలాంటి ఓటీటీ సబ్ స్క్రిప్షన్స్ లభించవు. ఒక వేళ ఓటీటీ సబ్ స్క్రిప్షన్స్ కావాలనుకుంటే వేరే ప్లాన్ కు వెళ్లవచ్చు. ఓటీటీ సబ్ స్క్రిప్షన్స్ కూడా ఇచ్చే ప్లాన్స్ లో రూ. 2997 ప్లాన్ ముఖ్యమైనది.

JioFiber's 2997 plan: రూ. 2997 ప్లాన్

ఈ ప్లాన్ వ్యాలిడిటీ కూడా 90 రోజులు. 150 ఎంబీపీఎస్ తో హై స్పీడ్ ఇంటర్ నెట్ లభిస్తుంది. ఈ ప్లాన్ ద్వారా ఆమెజాన్ ప్రైమ్, డిస్నీ హాట్ స్టార్, జియో సినిమా వంటి 16 వేర్వేరు ఓటీటీ ప్లాట్ ఫామ్స్ కు సబ్ స్క్రిప్షన్స్ లభిస్తుంది. ఇది కాకుండా, రూ. 4497 ప్లాన్ ను కూడా జియో ఫైబర్ ఆఫర్ చేస్తోంది. ఇందులో 300 ఎంబీపీఎస్ స్పీడ్ తో ఇంటర్ నెట్ లభిస్తుంది. ఇందులో రూ. 2997 ప్లాన్ తో ఇచ్చే 16 ఓటీటీ ప్లాట్ ఫామ్స్ తో పాటు నెట్ ఫ్లిక్స్ సబ్ స్క్రిప్షన్ కూడా లభిస్తుంది. ఇవే కాకుండా 500 ఎంబీపీఎస్ స్పీడ్ తో రూ. 7497 ప్లాన్, 1 జీబీపీఎస్ స్పీడ్ తో రూ. 11997 ప్లాన్స్ కూడా అందుబాటులో ఉన్నాయి.

టాపిక్

తదుపరి వ్యాసం