తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Land Rover Defender Octa: డిఫెండర్ ఆక్టాను లాంచ్ చేసిన ల్యాండ్ రోవర్; ధర జస్ట్ రూ. 2.65 కోట్లు మాత్రమే..

Land Rover Defender Octa: డిఫెండర్ ఆక్టాను లాంచ్ చేసిన ల్యాండ్ రోవర్; ధర జస్ట్ రూ. 2.65 కోట్లు మాత్రమే..

HT Telugu Desk HT Telugu

03 July 2024, 19:37 IST

google News
    • Land Rover Defender Octa: సక్సెస్ ఫుల్ మోడల్ డిఫెండర్ లో మరో వేరియంట్ ను ల్యాండ్ రోవర్ లేటెస్ట్ గా లాంచ్ చేసింది. ఈ డిఫెండర్ ఆక్టా అధికారిక బుకింగ్స్ ను త్వరలో ప్రారంభిస్తామని ల్యాండ్ రోవర్ వెల్లడించింది. ఈ ఎకానిక్ ఎస్ యూ వీ ధర (ఎక్స్ షో రూమ్) రూ. 2.65 కోట్లు అని తెలిపింది.
ల్యాండ్ రోవర్ డిఫెండర్ ఆక్టా
ల్యాండ్ రోవర్ డిఫెండర్ ఆక్టా

ల్యాండ్ రోవర్ డిఫెండర్ ఆక్టా

Land Rover Defender Octa: ల్యాండ్ రోవర్ తన లగ్జరీ ఎస్ యూవీ డిఫెండర్ కు హై పెర్ఫార్మెన్స్ వెర్షన్ గా డిఫెండర్ ఆక్టా ((Defender Octa) ఎస్ యూవీని బుధవారం లాంచ్ చేసింది. ఈ డిఫెండర్ ఆక్టా కోసం డిఫెండర్ ఫ్యాన్స్ ఎంతో కాలంగా ఎదురుచూస్తున్నారు. ల్యాండ్ రోవర్ డిఫెండర్ ఆక్టా ధర భారతదేశంలో రూ .2.65 కోట్లు (ఎక్స్-షోరూమ్) నుండి ప్రారంభమవుతుంది. అలాగే, ఉత్పత్తి మొదటి సంవత్సరంలో అందుబాటులో ఉన్న డిఫెండర్ ఆక్టా ఎడిషన్ వన్ (Defender Octa Edition One) రూ .2.85 కోట్ల (ఎక్స్-షోరూమ్) ధరతో లభిస్తుందని ల్యాండ్ రోవర్ పేర్కొంది.

టాటా మోటార్స్ బ్రిటీష్ లగ్జరీ కారు కంపెనీ

ల్యాండ్ రోవర్ టాటా మోటార్స్ కు చెందిన బ్రిటీష్ లగ్జరీ కారు కంపెనీ. ల్యాండ్ రోవర్ కార్లకు లగ్జరీ కార్ల మార్కెట్లో ప్రపంచవ్యాప్తంగా ఎంతో డిమాండ్ ఉంది. ఈ డిఫెండర్ ఆక్టా (Land Rover Defender Octa) ఎస్ యూవీ కోసం అధికారిక బుకింగ్స్ త్వరలోనే ప్రారంభమవుతాయని ల్యాండ్ రోవర్ వెల్లడించింది. అయితే, సరిగ్గా ఎప్పటి నుంచి బుకింగ్స్ ప్రారంభమవుతాయో వెల్లడించలేదు. ల్యాండ్ రోవర్ డిఫెండర్ ఆక్టా ఈ ఏడాది జూలై 11-14 వరకు జరగనున్న 2024 గుడ్ వుడ్ ఫెస్టివల్ ఆఫ్ స్పీడ్ లో తొలిసారి కనిపించనుంది.

ల్యాండ్ రోవర్ డిఫెండర్ ఆక్టా: డిజైన్

ఈ ల్యాండ్ రోవర్ డిఫెండర్ హై-పెర్ఫార్మెన్స్ వేరియంట్ కొన్ని విలక్షణమైన డిజైన్ అంశాలతో వస్తుంది. ఈ ఎస్ యూవీ హైట్ ను కొంత పెంచారు. వీల్ ఆర్చ్ లతో ఈ ఎస్ యూ వీ (SUV) రోడ్ ప్రెజెన్స్ మరింత ఆకర్షణీయంగా మారింది. ఈ ఎస్ యూవీ ముందు, వెనుక భాగాల్లో రీడిజైన్ చేసిన బంపర్లు ఉన్నాయి. మెరుగైన అప్రోచ్, డిపార్చర్ యాంగిల్స్ ను ఈ డిఫెండర్ ఆక్టా ఎస్ యూ వీ అందిస్తుంది.

అండర్ బాడీ ప్రొటెక్షన్

ల్యాండ్ రోవర్ డిఫెండర్ ఆక్టా ఈ ఎస్ యూవీ కఠినమైన అండర్ బాడీ ప్రొటెక్షన్ ను కలిగి ఉంది. అంతేకాకుండా, ఈ ఎస్ యూ వీ ని ఒక మీటరు లోతైన నీటి గుండా కూడా నడపవచ్చు. ఈ ఎస్ యూవీ ప్రత్యేకమైన కొత్త పెట్రా కాపర్, ఫారో గ్రీన్ ఎక్స్టీరియర్ పెయింట్ థీమ్ తో వస్తుంది. ఇది 20 అంగుళాల ఫోర్జ్డ్ అల్లాయ్ వీల్స్ తో నడుస్తుంది. ఇది ఆల్-టెర్రైన్ టైర్లతో వస్తుంది.

మెరుగైన గ్రౌండ్ క్లియరెన్స్

డిఫెండర్ ఆక్టా సాధారణ మోడల్ కంటే 28 మిమీ ఎక్కువ గ్రౌండ్ క్లియరెన్స్ ను, అలాగే, మెరుగైన స్థిరత్వం కోసం 68 మిమీ ఎక్కువ వెడల్పును కలిగి ఉంది. ఇది బ్రెంబో కాలిపర్లతో కూడిన అప్రేటెడ్ 400 మిమీ ఫ్రంట్ డిస్క్ బ్రేక్ లను కలిగి ఉంది. ఈ డిఫెండర్ ఆక్టా ఎస్ యూవీలో శాండ్, మడ్, రట్స్, గ్రాస్ గ్రావెల్ స్నో, రాక్ క్రాల్ కొరకు నిర్ధిష్ట కాలిబ్రేషన్ లను అందించే టెరైన్ రెస్పాన్స్ మోడ్ లు ఉన్నాయి.

ల్యాండ్ రోవర్ డిఫెండర్ ఆక్టా: పవర్ట్రెయిన్

కొత్త ల్యాండ్ రోవర్ డిఫెండర్ ఆక్టా డిఫెండర్ 110 సామర్థ్యాన్ని కొత్త స్థాయికి తీసుకువెళుతుందని ల్యాండ్ రోవర్ పేర్కొంది. ఈ ఎస్ యూవీలో శక్తివంతమైన 4.4-లీటర్ ట్విన్-టర్బోఛార్జ్ డ్ మైల్డ్-హైబ్రిడ్ వి8 ఇంజన్ ఉంది. ఇది డిఫెండర్ ఆక్టాను అత్యంత శక్తివంతమైన డిఫెండర్ గా చేస్తుంది. ఈ ఇంజన్ హై మరియు లో-రేంజ్ గేర్లతో 8-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్తో జతచేయబడి ఉంటుంది. ఈ ఇంజన్ గరిష్టంగా 626 బీహెచ్ పీ పవర్, 750ఎన్ఎమ్ గరిష్ట టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ నాలుగు సెకన్లలో 0-100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది.

తదుపరి వ్యాసం