Petrol Consume : ట్రాఫిక్ సిగ్నల్ వద్ద 1 నిమిషం కారు ఆపితే ఎంత పెట్రోల్/డీజిల్ అయిపోతుంది?
14 November 2024, 9:28 IST
- Petrol Consume : ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర కొన్నిసార్లు నిమిషం కంటే ఎక్కువే ఆగిపోవాల్సి వస్తుంది. ఇలాంటి సమయంలో కారు 1 నిమిషంపాటు ఉంటే ఎంత పెట్రోల్ ఖర్చు అవుతుంది? ఈ ఇంట్రస్టింగ్ విషయం మీ కోసం..
ట్రాఫిక్ సిగ్నల్ వద్ద కారు ఆపితే ఎంత పెట్రోల్ ఖర్చు అవుతుంది?
డ్రైవింగ్ చేస్తున్నప్పుడు ట్రాఫిక్ సిగ్నల్ వద్ద 1 నిమిషం పాటు ఇరుక్కుపోవడం చాలా సాధారణమైన విషయం. ఇక హైదరాబాద్, బెంగళూరులాంటి నగరాల్లో అయితే సరేసరి. నిమిషం కంటే ఎక్కువసేపు కొన్నిసార్లు ఉండాల్సి వస్తుంది. నూటికి తొంభైతొమ్మిది మంది కారును ఆఫ్ చేయరు. నిమిషమే కదా అనుకుంటారు. ట్రాఫిక్ రెడ్ లైట్ ఉన్నంతసేపు కారు ఆన్‌లోనే ఉంటుంది.
అలా ఉన్నప్పుడు కచ్చితంగా కారులో ఇంధనం ఖర్చు అవుతుంది. ట్రాఫిక్ సిగ్నల్ వద్ద 1 నిమిషంపాటు కారు ఆన్‌లోనే ఉంటే ఎంత ఇంధనం కావాలి అని ఎప్పుడైనా ఆలోచించారా? ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి అక్కడక్కడా సిగ్నల్స్ ఉంటాయి. ఇలా మీరు ఎక్కవ సిగ్నల్ దగ్గర కారు ఆన్ చేసి ఉంటే.. ఎక్కువ పెట్రోల్ ఖర్చు అవుతుంది. దీనికి సంబంధించిన వివరాలు తెలుసుకుందాం..
ట్రాఫిక్ సిగ్నల్ వద్ద కారు ఆన్‌లో ఉన్నప్పుడు పెట్రోల్/డీజిల్ వినియోగం అనేది.. కారు ఇంజిన్ సామర్థ్యంపై ఆధారపడి ఉంటుంది. మీ కారు ఇంజిన్ 1000 నుండి 2000సీసీ మధ్య ఉంటే 1-నిమిషం ఆగితే 0.01 నుండి 0.02 లీటర్ల పెట్రోల్ ఖర్చవుతుంది. ఈ విషయాన్ని క్లారిటీగా తెలుసుకుందాం..
- చిన్న ఇంజన్ (1000 నుండి 1200 సీసీ) : చిన్న ఇంజన్ ఉన్న వాహనాలు 1 నిమిషంలో 0.01 లీటర్ పెట్రోల్‌ను ఉపయోగించుకోవచ్చు.
- మిడిల్ రేంజ్ ఇంజిన్‌లు (1500సీసీ వరకు) : ఈ వాహనాలు నిమిషానికి 0.015 లీటర్ల ఇంధనాన్ని ఉపయోగిస్తాయి.
- పెద్ద ఇంజన్లు (2000సీసీ పైన) : పెద్ద ఇంజన్లు నిమిషానికి 0.02 లీటర్లు లేదా అంతకంటే ఎక్కువ ఇంధనాన్ని ఉపయోగించవచ్చు.
మీ కారు ఒక్క నెలలో చాలాసార్లు ట్రాఫిక్ సిగ్నల్ వద్ద వద్ద ఆపివేయవలసి వస్తే.. అది ప్రతి నెలా చాలా ఇంధన వినియోగానికి దారి తీస్తుంది. ట్రాఫిక్ సిగ్నల్ వద్ద కారును ఆఫ్ చేయడం మంచిది. ట్రాఫిక్ లైట్ వద్ద ఎక్కువసేపు ఆగిపోవాల్సి వస్తే.. ఇంజిన్ స్విచ్ ఆఫ్ చేయడంతో చాలా ఇంధనం ఆదా అవుతుంది. నిపుణుల చెప్పేది ఏంటంటే.. కారు ఆపే సమయం 30 సెకన్ల కంటే ఎక్కువ ఉంటే.. ఇంధన వినియోగాన్ని తగ్గించడానికి ఇంజిన్ స్విచ్ ఆఫ్ చేయడం బెటర్ ఆప్షన్.
ఇంజిన్ నడుస్తున్నప్పుడు ఇంధనం కాలుతూ ఉంటుంది. స్విచ్ ఆఫ్ చేయడం వల్ల ఇంధన వినియోగం ఆగిపోతుంది. వాహన ఇంజన్‌ను స్విచ్ ఆఫ్ చేయడం వల్ల పొగ వెలువడడం ఆగి, పర్యావరణ కాలుష్యం తగ్గుతుంది. ఇంజిన్‌ను ఎక్కువసేపు నడపడం వల్ల దాని జీవితాన్ని తగ్గిస్తుంది. దాన్ని ఆఫ్ చేయడం వల్ల దాని సామర్థ్యం పెరుగుతుంది. డబ్బు కూడా ఆదా అవుతుంది.