Jio vs BSNL : జియోని వదిలేసి బీఎస్ఎన్ఎల్కి షిఫ్ట్ అవ్వాలా? నెలవారీ ప్లాన్స్‌లో ఏది చౌకైనది?
28 July 2024, 9:46 IST
Jio vs BSNL : జియో వర్సెస్ బీఎస్ఎన్ఎల్- ఇందులో మీ నెలవారీ లేదా 28 రోజుల ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్లలో టాక్ టైమ్, డేటా ఇతర ప్రయోజనాలను పోల్చి, ఏది చౌకైనదో తెలుసుకుందాము..
జియో వర్సెస్ బీఎస్ఎన్ఎల్- నెలవారీ రీఛార్జ్ ప్లాన్లు..
ప్రముఖ టెలికాం సంస్థలు తమ రీఛార్జ్ ప్లాన్స్ పెంచడంతో కస్టమర్లు అసంతృప్తితో ఉన్నారు. మరీ ముఖ్యంగా రిలయన్స్ జియో టారీఫ్ హైక్‌పై యూజర్లు అసహనం వ్యక్తం చేస్తున్నారు. వీటన్నింటి మధ్య ప్రభుత్వ ఆధారిత బీఎస్ఎన్ఎల్ మళ్లీ వార్తలకెక్కింది. చౌకైన రీఛార్జ్ ప్లాన్స్ ఉండటంతో జులై నెలలోనే బీఎస్ఎన్ఎల్ సబ్స్క్రైబర్ల సంఖ్య అమాంత పెరిగింపోయిందని సమాచారం. ఈ నేపథ్యంలో ఇప్పుడు జియో నెలవారీ రీఛార్జ్ ప్లాన్స్‌ని బీఎస్ఎన్ఎల్ ప్రీ-పెయిన్ ప్లాన్స్ పోల్చి, రెండింటి మధ్య ఎంత వ్యత్యాసం ఉందో ఇక్కడ తెలుసుకుందాము. ఇందులో మీ నెలవారీ లేదా 28 రోజుల ప్రీ-పెయిడ్ రీఛార్జ్ ప్లాన్లలో టాక్-టైమ్, డేటా ఇతర ప్రయోజనాలను పోల్చి చూద్దాము..
జియో వర్సెస్ బీఎస్ఎన్ఎల్..
- జియో రూ.349 ప్రీపెయిడ్ ప్లాన్: 28 రోజుల పాటు రోజుకు 2 జీబీ 5జీ డేటా, అపరిమిత వాయిస్ కాల్స్, జియో సినిమాకు ఉచిత సబ్ స్క్రిప్షన్ కూడా లభిస్తుంది.
- జియో రూ.151, రూ.101, రూ.51: కొత్త 'అన్ లిమిటెడ్ ప్లాన్లు' వరుసగా 9 జీబీ, 6 జీబీ, 3 జీబీ అదనపు 4జీ డేటాను అందిస్తున్నాయి. ఇది మీ ప్రస్తుత బేస్ యాక్టివ్ ప్లాన్ వాలిడిటీ ఉన్నంత వరకు ఉంటుంది. బేస్ ప్లాన్ రోజువారీ డేటా ముగిసిన తర్వాత ఉపయోగించుకోవచ్చు.
- బీఎస్ఎన్ఎల్ రూ.108, రూ.107: కొత్త యూజర్లు రూ.108 ప్లాన్ (ఫస్ట్ రీఛార్జ్ కూపన్) పొందవచ్చు. ఇది బీఎస్ఎన్ఎల్ అపరిమిత వాయిస్ కాల్స్, రోజుకు 1 జీబీ 4జీ డేటాను 28 రోజుల పాటు అందిస్తుంది. రిపీట్ యూజర్స్‌కి 35 రోజుల వాలిడిటీ ప్రీపెయిడ్ ప్లాన్‌లో 200 నిమిషాల వాయిస్ కాల్స్, 3 జీబీ 4జీ డేటా లభిస్తుంది.
జియో వర్సెస్ బిఎస్ఎన్ఎల్- ధర, ప్రయోజనాల పోలిక..
రిలయన్స్ జియో బాటలోనే టెలికాం దిగ్గజం భారతీ ఎయిర్టెల్ సైతం జూన్ 27న టారిఫ్లను పెంచింది. భారతదేశంలో టెల్కోలకు ఆర్థికంగా, ఆరోగ్యకరమైన వ్యాపారాన్ని నడిపించాలంటే ప్రతి వినియోగదారుడి మొబైల్ సగటు ఆదాయం (ఏఆర్పీయూ) రూ .300 కంటే ఎక్కువ ఉండాలని ఎయిర్టెల్ తన ఎక్స్ఛేంజ్ ఫైలింగ్‌లో పేర్కొంది.
“ఈ స్థాయి ఏఆర్పీయూ నెట్వర్క్ టెక్నాలజీ, స్పెక్ట్రమ్లో అవసరమైన గణనీయమైన పెట్టుబడులకు వీలు కల్పిస్తుందని, మూలధనంపై స్వల్ప రాబడిని ఇస్తుందని మేము నమ్ముతున్నాము. ఈ నేపథ్యంలో టారిఫ్లను రిపేర్ చేసేలా పరిశ్రమలో ప్రకటనలను స్వాగతిస్తున్నాం. ఎయిర్టెల్ కూడా జూలై 3, 2024 నుండి తన మొబైల్ టారిఫ్లను సవరించనుంది,” అని సంస్థ ప్రకటించింది.
ప్రస్తుతం ఎయిర్ టెల్, జియోలు 4జీ తరహాలోనే 5జీ సేవలను అందిస్తున్నాయి. 5జీ సేవలకు, 4జీ సేవలకు భిన్నమైన ధర లేదా ప్రీమియం ధరలను వినియోగదారుల నుంచి వసూలు చేయబోమని ఎయిర్టెల్ టాప్ బాస్ గోపాల్ విట్టల్ స్పష్టం చేశారు.