గృహ రుణాలతో పాటు ప్రాపర్టీ, సెక్యూరిటీలపై రుణాలు అందించడంపై జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ దృష్టి
01 September 2024, 16:34 IST
- Jio Financial Services : జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్ (JFSL) డిజిటల్-ఫస్ట్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సంస్థ. ప్రారంభ దశలోనే ప్రాముఖ్యతను సంపాదించింది. ఇటీవల స్టాక్ ఎక్స్ఛేంజ్‌లలో జాబితా అయిన తర్వాత మొదటి వార్షిక సర్వసభ్య సమావేశం నిర్వహించింది. ఇందులో పలు కీలక నిర్ణయాలు తీసుకుంది.
జియో ఫైనాన్షియల్ సర్వీసెస్
చాలా తక్కువ సమయంలో జియోఫైనాన్స్ యాప్ 10 లక్షల డౌన్‌లోడ్లను పూర్తి చేసుకుంది. వినియోగదారుల నుండి సానుకూల స్పందనను అందుకుంది. ప్రస్తుతానికి యాప్‌లో మ్యూచువల్ ఫండ్లపై రుణాలు, డిజిటల్ సేవింగ్స్ ఖాతాలు, UPI, బిల్ చెల్లింపులు, డిజిటల్ ఇన్సూరెన్స్, రీఛార్జ్ వంటి సేవలు అందుబాటులో ఉన్నాయి. సంస్థ తన డిజిటల్ ఫైనాన్షియల్ ఆఫరింగ్‌లను మరింత విస్తరించడానికి త్వరలో మరిన్ని సేవలను ప్రారంభించనున్నట్లు ప్రకటించింది.
జియో పేమెంట్స్ బ్యాంక్ పెద్ద మైలురాయిని సాధించింది. 10 లక్షల CASA (కరెంట్ అకౌంట్, సేవింగ్స్ అకౌంట్) ఖాతాదారులను దాటింది. బ్యాంక్ పూర్తిగా డిజిటల్ ఆన్‌బోర్డింగ్ ప్రక్రియను అందిస్తుంది. కస్టమర్లు ఐదు నిమిషాల్లోపు సేవింగ్స్ ఖాతాలను తెరవడానికి అనుమతిస్తుంది.
'గత ఆర్థిక సంవత్సరంలో మా కస్టమర్లు, పెట్టుబడిదారులు, ఉద్యోగులు, భాగస్వాములకు దీర్ఘకాలం స్థిరమైన వ్యవస్థ ద్వారా లబ్ధి చేకూర్చేందుకు ప్రయత్నాలు చేశాం. బలమైన ఫైనాన్షియల్ సర్వీసెస్ కోసం పునాది అంశాలను ఏర్పాటు చేశాం.' అని సమావేశంలో JFSL మేనేజింగ్ డైరెక్టర్, CEO హితేష్ సేతియా పేర్కొన్నారు.
JFSL భవిష్యత్తులో హోమ్ లోన్లతో పాటు, ప్రాపర్టీ, సెక్యూరిటీలపై రుణాలు వంటివాటిని ప్రారంభించడానికి ప్రణాళికలను రూపొందిస్తోంది. వీటిలో గృహ రుణాలు ప్రస్తుతం బీటా మోడ్‌లో అందుబాటులో ఉన్నాయి. ప్రపంచంలోనే అతి పెద్ద ఆస్తి నిర్వహణ సంస్థ అయిన బ్లాక్రాక్‌తో JFSL జాయింట్ వెంచర్ భారత మార్కెట్ కోసం ప్రపంచ స్థాయి పెట్టుబడి ఉత్పత్తులను అందించడానికి సిద్ధంగా ఉంది. కీలక నాయకత్వ నియామకాలు పూర్తయ్యాయని, టెక్నాలజీ మౌలిక సదుపాయాల అభివృద్ధి, మార్కెట్ వ్యూహం వేగంగా పురోగమిస్తోందని సీఈవో హితేష్ సేతియా తెలిపారు.
భారత్ దేశం 10 డాలర్ల ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థ లక్ష్యాన్ని సాధించడానికి నెక్ట్స్ జనరేషన్ ఫైనాన్షియల్ సర్వీసెస్ కీలకమైన పాత్ర పోషిస్తాయని JFSL చైర్మన్ కేవీ కామత్ తెలిపారు. 'మా ముందు అవకాశాలు విస్తృతంగా ఉన్నాయి. ఫైనాన్షియల్ సర్వీసెస్ దృశ్యాన్ని మారుస్తూ.. టెక్నాలజీ శక్తివంతమైనదిగా పనిచేస్తుంది. సరసమైన డేటా, పరికరాలకు విస్తృతంగా యాక్సెస్, అడ్వాన్స్డ్ అనలిటిక్స్ భవిష్యత్తు ఆర్థిక వ్యవస్థను నిర్మిస్తున్నాయి.' అని కామత్ వ్యాఖ్యానించారు.
టాపిక్