Janmashtami: శ్రీకృష్ణ జన్మాష్టమి సెలవు ఏ రోజు? సెప్టెంబర్ లో బ్యాంకులకు ఎన్ని రోజులు హాలీడేస్?
06 September 2023, 13:14 IST
Janmashtami: శ్రీ కృష్ణ జన్మాష్టమి పర్వదినం సందర్భంగా బ్యాంకులకు కొన్ని రాష్ట్రాల్లో సెప్టెంబర్ 6వ తేదీన, కొన్ని రాష్ట్రాల్లో సెప్టెంబర్ 7వ తేదీన సెలవు ఉంది.
ప్రతీకాత్మక చిత్రం
Janmashtami HOLIDAY: శ్రీ కృష్ణ జన్మాష్టమి పర్వదినం సందర్భంగా వివిధ రాష్ట్రాల్లో సెలవు రోజులు ఇలా ఉన్నాయి. కొన్ని రాష్ట్రాల్లో కొన్ని బ్యాంకులు సెప్టెంబర్ 6 వ తేదీని, కొన్ని రాష్ట్రాల్లో కొన్ని బ్యాంకులు సెప్టెంబర్ 7 వ తేదీని శ్రీ కృష్ణ జన్మాష్టమి పర్వదినం సందర్భంగా సెలవుగా ప్రకటించాయి.
సెప్టెంబర్ 6న..
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఒడిశా, తమిళనాడు, బిహార్ రాష్ట్రాలు సెప్టెంబర్ 6 వ తేదీన సెలవు ప్రకటించాయి. గుజరాత్, మధ్య ప్రదేశ్, చండీగఢ్, రాజస్తాన్, సిక్కిం తదితర రాష్ట్రాలు సెప్టెంబర్ 7 వ తేదీని శ్రీ కృష్ణ జన్మాష్టమి పర్వదినం సందర్భంగా సెలవుగా ప్రకటించాయి.
సెప్టెంబర్ నెలలోని ఇతర సెలవులు
సెప్టెంబర్ నెలలో బ్యాంకులకు సెలవు ఉన్న ఇతర రోజులు..
సెప్టెంబర్ 8: జీ 20 సదస్సు సందర్భంగా ఢిల్లీలో సెలవు.
సెప్టెంబర్ 18: కర్నాటక, తెలంగాణాల్లో వినాయక చతుర్ధి సందర్భంగా సెలవు
సెప్టెంబర్ 19: గుజరాత్, మహారాష్ట్ర,తమిళనాడుల్లో వినాయక చతుర్ధి సందర్భంగా సెలవు
సెప్టెంబర్ 20: ఒడిశా, గోవాల్లో వినాయక చతుర్ధి సందర్భంగా సెలవు
సెప్టెంబర్ 22: కేరళలో శ్రీ నారాయణ గురు సమాధి డే సందర్భంగా సెలవు
సెప్టెంబర్ 23: నాలుగవ శనివారం సందర్భంగా సెలవు. మహారాజా హరిసింగ్ జయంతి సందర్భంగా జమ్మూలో సెలవు.
సెప్టెంబర్ 25: శ్రీమంత్ శంకర్ దేవ సందర్భంగా అస్సాంలో సెలవు
సెప్టెంబర్ 27:మిలాద్ ఇ షెరీఫ్ సందర్భంగా కేరళ, జమ్మూకశ్మీర్లలో సెలవు
సెప్టెంబర్ 28: ఈద్ ఇ మిలాద లేదా మిలాద్ ఉన్ నబీ పండుగగ సందర్భంగా దేశవ్యాప్తంగా సెలవు