ITR refund status check : ఐటీఆర్ రీఫండ్ స్టేటస్ ఎలా చెక్ చేసుకోవాలి?
25 July 2023, 6:29 IST
- ITR refund status check : ఐటీ రిటర్నులు ఫైల్ చేశారా? రీఫండ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే ఆన్లైన్లో స్టేటస్‌ను ఇలా చెక్ చేసుకోండి..
ఐటీఆర్ రీఫండ్ స్టేటస్ ఎలా చెక్ చేసుకోవాలి?
ITR refund status check : గత ఆర్థిక ఏడాదికి సంబంధించిన ఐటీ రిటర్నుల ఫైలింగ్ గడువు ముగింపు దశకు చేరుకుంటోంది. జులై 31లోపు ఐటీ రిటర్న్స్‌ను కచ్చితంగా ఫైల్ చేసుకోవాలి. అయితే.. ఇప్పటికే ఫైల్ చేసుకున్న వారికి రీఫండ్ కూడా పడుతోంది. ఈ నేపథ్యంలో ఆన్లైన్లో మీ రీఫండ్ స్టెటస్ ఎలా చెక్ చేసుకోవాలో ఇక్కడ తెలుసుకుందాము..
ఇలా చెక్ చేసుకోండి..
స్టెప్ 1:- ముందుగా.. https://eportal.incometax.gov.in/iec/foservices/#/login లో లాగిన్ అవ్వాల్సి ఉంటుంది.
స్టెప్ 2:- యూజర్ ఐడీ- పాస్వర్డ్ టైప్ చేయండి.
స్టెప్ 3:- 'మై అకౌంట్'కు వెళ్లి.. రీఫండ్/ డిమాండ్ స్టేటస్ మీద క్లిక్ చేయాలి.
స్టెప్ 4:- డ్రాప్ డౌన్ మెనూలోకి వెళ్లి.. 'Income Tax Returns' సెలెక్ట్ చేసుకుని 'సబ్మిట్' బటన్ ప్రెస్ చేయండి.
స్టెప్ 5:- మీ అక్నాలెడ్జ్ నెంబర్ మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది.
స్టెప్ 6:- కొత్త వెబ్ పేజ్ ఓపెన్ అవుతుంది. మీ ఐటీఆర్ వివరాలన్నీ అందులో కనిపిస్తాయి. అక్కడే రీఫండ్ డేట్ కూడా ఉంటుంది.
పాన్ నెంబర్‌తో కూడా..!
ITR refund status online : పాన్ నెంబర్‌తోనూ ఐటీఆర్ రీఫండ్ స్టేటస్‌ను చెక్ చేసుకోచ్చు. ఎలా అంటే..
స్టెప్ 1:- ముందుగా https://tin.tin.nsdl.com/oltas/servlet/RefundStatusTrack లోకి వెళ్లాలి.
స్టెప్ 2:- మీ పాన్ కార్డు నెంబర్ టైప్ చేయండి.
స్టెప్ 3:- అసెస్మెంట్ ఇయర్ 2022-23గా సెలక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది.
స్టెప్ 4:- సబ్మిట్ బటన్ క్లిక్ చేయాలి.
స్టెప్ 5:- మీ రీఫండ్ స్టేటస్ కనిపిస్తుంది.
ప్రస్తుతం.. ఐటీ రిటర్నులు ఫైల్ చేసిన 10 రోజులకు రీఫండ్ స్టేటస్‌ను చూసుకునే వెసులుబాటు కల్పిస్తోంది ఆదాయపు పన్నుశాఖ.