Smartphone : కేవలం రూ.7299కే స్మార్ట్‌ఫోన్.. 256జీబీ స్టోరేజ్, 50ఎంపీ కెమెరా
31 October 2024, 12:30 IST
- Smartphone Under 8k : దీపావళి పండుగ కావడంతో ఆన్‌లైన్ షాపింగ్ సైట్లు మంచి ఆఫర్లను ప్రకటిస్తున్నాయి. తక్కువ ధరలో మీరు ఫోన్ సొంతం చేసుకోవచ్చు. ఈ లిస్టులో ఐటెల్ పీ55 ప్లస్ 4జీ ఫోన్ కూడా ఉంది.
ఐటెల్ స్మార్ట్ ఫోన్
దీపావళి వేడుకలు వచ్చేశాయి. ఆన్‌లైన్ షాపింగ్ సైట్‌లు కస్టమర్ల ఉత్సాహాన్ని రెట్టింపు చేశాయి. దీపావళి సందర్భంగా అమెజాన్ భారీ డిస్కౌంట్లతో ఫోన్లను విక్రయిస్తోంది. మంచి మంచి ఆఫర్లను ప్రకటించి.. వినియోగదారులను ఆకట్టుకుంటోంది. ఇందులో భాగంగా ఐటెల్ పీ55 ప్లస్ 4జీ తక్కువ ధరలో అందుబాటులో ఉంది. బడ్జెట్ ధరలో ఫోన్ కొనాలి అనుకుంటే మీరు దీనిని సొంతం చేసుకోవచ్చు. ఇది బెటర్ ఆప్షన్. కంపెనీ ఏం ఆఫర్ చేస్తోంది, ఫోన్ ఫీచర్లు ఏంటి?
ఐటెల్ పీ55 ప్లస్ 4జీ ఫోన్ అమెజాన్ సేల్‌లో తగ్గింపుతో అమ్ముతున్నారు. 16జీబీ ర్యామ్ ప్లస్ 256జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ ఆప్షన్‌లో కొనుగోలు చేయవచ్చు. ఇందులో Unisock T606 ప్రాసెసర్ ఉంది. ఫోన్ 6.6 అంగుళాల డిస్‌ప్లేను కలిగి ఉంది. ఇందులో 50 మెగాపిక్సెల్ కెమెరా, 45W ఫాస్ట్ ఛార్జింగ్, 5000mAh బ్యాటరీ కూడా ఉన్నాయి. ఇది రాయల్ గ్రీన్, వేగన్ లెదర్ రంగులలో లభిస్తుంది.
ఐటెల్ పీ55 ప్లస్ 4జీ ఫోన్ 256జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్‌ను రూ.7,299కి విక్రయిస్తోంది. మీరు, 729.90 రూ. బ్యాంక్ ఆఫర్‌తో కొనుగోలు చేయవచ్చు. అంతేకాకుండా కంపెనీ ఈ ఫోన్‌పై క్యాష్‌బ్యాక్‌ను కూడా అందిస్తోంది. రూ.328.66 వరకు ప్రయోజనం పొందవచ్చు. ఎక్స్ఛేంజ్ ఆఫర్ కింద రూ.6900 పొందుతారు.
ఈ ఫోన్ 6.6 అంగుళాల హెచ్‌డీ ప్లస్ ఐపీఎస్ ఎల్‌సీడీ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఇది 90Hz రిఫ్రెష్ రేట్‌తో 720x 1612 పిక్సెల్ రిజల్యూషన్‌కు మద్దతు ఇస్తుంది. యూనిసాక్ T606 ప్రాసెసర్‌తో కంపెనీ ఈ ఫోన్‌ను విడుదల చేసింది. ఇందులో 16జీబీ ర్యామ్, 256జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ ఆప్షన్ ఇచ్చారు. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్‌కో పని చేస్తుంది.
ఈ ఐటెల్ ఫోన్ ఎల్‌ఈడీ ఫ్లాష్‌తో కూడిన డ్యూయల్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. 50 మెగాపిక్సెల్ ప్రధాన కెమెరా ఉంది. AI లెన్స్ ఉంటుంది. సెల్ఫీలు, వీడియో కాలింగ్ కోసం 8-మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాను కలిగి ఉంది. ఐటెల్ పీ55 ప్లస్ 4జీ ఫోన్ బ్యాటరీ సామర్థ్యం 5,000mAh. ఛార్జ్ చేయడానికి, 45W ఫాస్ట్ ఛార్జింగ్ ఉంటుంది. ఐటెల్ పీ55 ప్లస్ 4జీ మొబైల్‌లో డ్యూయల్ సిమ్, బ్లూటూత్, జీపీఎస్ మైక్రో ఎస్‌డీ కార్డ్ స్లాట్, యూఎస్‌బీ టైప్-సీ పోర్ట్, 3.4ఎంఎం హెడ్‌ఫోన్ జాక్ వంటి అనేక ఆప్షన్స్ ఉన్నాయి.