IREDA IPO: మరో రెండు రోజుల్లో ఐఆర్ఈడీఏ ఐపీఓ; అప్లై చేయొచ్చా?.. నిపుణులేమంటున్నారు?
18 November 2023, 15:24 IST
- IREDA IPO: మరో రెండు రోజుల్లో ఐఆర్ఈడీఏ ఐపీఓ (IREDA IPO) మార్కెట్లోకి వస్తోంది. ఈ ప్రభుత్వ రంగ సంస్థకు చెందిన ఐపీఓ వివరాలేంటి? దీనికి అప్లై చేయడంపై నిపుణుల అభిప్రాయాలు ఎలా ఉన్నాయి?
ప్రతీకాత్మక చిత్రం
IREDA IPO: ప్రభుత్వ రంగ సంస్థ అయిన ‘ఇండియన్ రెన్యూవబుల్ ఎనర్జీ డెవలప్‌మెంట్ ఏజెన్సీ (Indian Renewable Energy Development Agency - IREDA)’ ఐపీఓ ఈ నెల 21న ప్రారంభమవుతుంది. రూ. 2,150.21 కోట్ల విలువైన పబ్లిక్ ఇష్యూకు నవంబర్ 23 వరకు సబ్‌స్క్రైబ్ చేసుకోవచ్చు. అంటే, వచ్చే మంగళవారం నుంచి గురువారం వరకు సబ్ స్క్రైబ్ చేసుకోవచ్చు.
ప్రైస్ బ్యాండ్, ఇతర వివరాలు..
- ఈ ఐపీఓ (IREDA IPO) ప్రైస్ బ్యాండ్‌ను ఒక్కో ఈక్విటీ షేర్‌కు రూ. 30 నుంచి రూ. 32 గా నిర్ణయించారు.
- నవంబర్ 21 నుంచి 23 వరకు సబ్ స్క్రైబ్ చేసుకోవచ్చు.
- ఈ ఐపీఓ ఒక్కో లాట్ లో 460 ఈక్విటీ షేర్లు ఉంటాయి. అంటే, ఒక లాట్ కు రూ. 14,720 ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది.
- ఈ ఐపీఓ ద్వారా రూ. 2,150.21 కోట్లను సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
- ఈ ఐపీఓ షేర్ల అలాట్మెంట్ నవంబర్ 24 లేదా నవంబర్ 27న జరిగే అవకాశం ఉంది.
- ఈ ఐపీఓ స్టాక్ మార్కెట్లో నవంబర్ 28వ తేదీన లిస్ట్ అయ్యే అవకాశం ఉంది.
- శనివారం గ్రే మార్కెట్లో ఈ ఐపీఓ షేర్లు రూ. 9 ప్రీమియం () తో ట్రేడ్ అవుతున్నాయి.
IREDA IPO: Apply or not? : అప్లై చేయొచ్చా?
ఈ ఐపీఓకు దరఖాస్తు చేయాలా? వద్దా? అనే దానిపై, బిగుల్ సీఈఓ పలు సూచనలు చేశారు. ఈ ఐపీఓకు అప్లై చేసుకోవాలనే తాను సూచిస్తానని, ఈ స్టాక్ షేర్లు అలాట్ అయితే, లిస్టింగ్ లాభాలను పొందవచ్చని, లేదా, ఇన్వెస్టర్లు కోరుకుంటే, లాంగ్ టర్మ్ ప్రయోజనాల కోసం అట్టిపెట్టుకోవచ్చని ఆయన సూచించారు. రెన్యూవబుల్ ఎనర్జీ రంగం భవిష్యత్తులో మంచి వృద్ధిని సాధించే అవకాశం ఉందని రైట్ రీసెర్చ్ ఫౌండర్ సోనమ్ శ్రీవాస్తవ తెలిపారు. ఎల్ఐసీ తరువాత వస్తున్న తొలి ప్రభుత్వ రంగ ఐపీఓ ఇదని ఆయన గుర్తు చేశారు.
సూచన: ఈ కథనం నిపుణుల సూచనలతో రూపొందించబడినది. ఇన్వెస్టర్లు స్వీయ విచక్షణతో నిర్ణయం తీసుకోవడం సముచితం.