Tata Technologies IPO : టాటా టెక్నాలజీస్​ ఐపీఓ అలాట్​ అయితే జాక్​పాట్ కొట్టినట్టే​!-tata technologies ipo gmp jumps as issue opens next week ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Tata Technologies Ipo : టాటా టెక్నాలజీస్​ ఐపీఓ అలాట్​ అయితే జాక్​పాట్ కొట్టినట్టే​!

Tata Technologies IPO : టాటా టెక్నాలజీస్​ ఐపీఓ అలాట్​ అయితే జాక్​పాట్ కొట్టినట్టే​!

Sharath Chitturi HT Telugu
Nov 18, 2023 01:15 PM IST

Tata Technologies IPO : టాటా టెక్నాలజీస్​ ఐపీఓ జీఎంపీ దూసుకెళుతోంది. బంపర్​ లిస్టింగ్​ పక్కా అని జీఎంపీ సూచిస్తోంది.

టాటా టెక్నాలజీస్​ ఐపీఓకు బంపర్​ లిస్టింగ్​ పక్కా?
టాటా టెక్నాలజీస్​ ఐపీఓకు బంపర్​ లిస్టింగ్​ పక్కా?

Tata Technologies IPO : దశాబ్దాల తర్వాత.. టాటా సంస్థ నుంచి ఒక ఐపీఓ వస్తోంది. అదే.. టాటా టెక్నాలజీస్​ ఐపీఐ. ఈ ఐపీఓ సబ్​స్క్రిప్షన్​ ఈ నెల 22న ఓపెన్​ అవ్వనుంది. ఈ నెల 24 వరకు బిడ్డింగ్​ వేసుకోవచ్చు. టాటా టెక్నాలజీస్​ ఐపీఓ ప్రైజ్​ బ్యాండ్ షేరుకు​ రూ. 475- రూ. 500గా ఫిక్స్​ చేసింది సంస్థ. ఐపీఓ అలాట్​ అవ్వాలంటే.. కచ్చితంగా రూ. 500ని కోట్​ చేయాలి.

టాటా టెక్నాలజీస్​ జీఎంపీ..

మరోవైపు.. సబ్​స్క్రిప్షన్​కి ముందు సెకెండరీ మార్కెట్​లో టాటా టెక్నాలజీస్​ ఐపీఓ గ్రే మార్కెట్​ ప్రీమియం దూసుకెళుతుంది. శనివారం ఉదయం నాటికి.. జీఎంపీ రూ. 375గా నమోదైంది. శుక్రవారం ఇది రూ. 340గా ఉండేది. అంటే రూ. 35 ఎక్కువ.

Tata Technologies IPO GMP : అంటే.. ప్రస్తుత లెక్కల ప్రకారం లిస్ట్​ అయినప్పుడు.. ఈ ఐపీఓ.. రూ. 375 ప్రీమియంతో లిస్ట్​ అవుతుందని అర్థం. కాకపోతే, కేవలం జీఎంపీని మాత్రమే చూసి ఐపీఓకు అప్లై చేయకూడదు. సంస్థ ఫండమెంటల్స్​ని చూసి, భవిష్యత్తులో పెరుగుతుందన్న నమ్మకం ఉంటేనే అప్లై చేయాలని స్టాక్​ మార్కెట్​ నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా.. లిస్టింగ్​ డేట్​ సమీపిస్తున్న కొద్ది.. అప్పటి మార్కెట్​ సెంటిమెంట్​ బట్టి ఈ గ్రే మార్కెట్​ ప్రీమియం అనేది పెరగొచ్చు లేదా తగ్గొచ్చు.

పైన చెప్పినట్టు.. టాటా టెక్నాలజీస్​ ఐపీఓ ఇష్యూ ప్రైజ్ షేరుకు​ రూ. 475- రూ. 500. ఒక లాట్​లో 30 షేర్లను అప్లై చేసుకోవచ్చు. ఈ ఐపీఓ ద్వారా.. రూ. 3,042.51 కోట్లను రైజ్​ చేస్తోంది సంస్థ. 100శాతం ఆఫర్​ ఫర్​ సేల్​ ద్వారా ఐపీఓను తీసుకొస్తోంది. అంతేకాకుండా.. షేర్​హోల్డర్​ కేటగిరీ కూడా ఉంది.

Tata Technologies IPO GMP today : జీఎంపీని చూస్తుంటే.. ఈ ఐపీఓకు భారీ డిమాండ్​ ఉంటుందని స్పష్టమవుతోంది. రీటైల్​ కేటగిరీ కొన్ని గంటల్లోనే ఫుల్​ అయిపోవచ్చు. ఎంత ఎక్కువ మంది అప్లై చేస్తుంటే.. ఐపీఓ అలాట్​ అయ్యే అవకాశాలు అంత తక్కువగా ఉంటాయి. అందుకే.. షేర్​హోల్డర్​ కేటగిరీలో అప్లై చేస్తే బెటర్​. ఇందుకోసం మీ డీమ్యాట్​ అకౌంట్​లో ఇప్పటికే ఓ టాటా మోటార్స్​ షేరు ఉండి ఉండాలి.

ఈ ఐపీఓకి అప్లై చేసుకోవచ్చా?

"గ్లోబల్​ ఇంజినీరింగ్​ సర్వీసెస్​లో టాటా టెక్నాలజీస్​ ఒక లీడింగ్​ కంపెనీ. ఆటోమొబైల్​ ఇండస్ట్రీలో ఈ కంపెనీకి డీప్​ డొమైన్​ ఉంది. ఇదొక ఈఆర్​ అండ్​డీ కంపెనీ. దీని ఫోకస్​ ఆటోమోటివ్​ ఇండస్ట్రీపైనే ఉంటుంది. ఐపీఓ కూడా అట్రాక్టివ్​ వాల్యుయేషన్​లోనే వస్తోంది. అందుకే ఈ ఐపీఓకు మేము మిడ్​ టర్మ్​- లాంగ్​ టర్మ్​ కోసం 'సబ్​స్క్రైబ్​' చేసుకోవాలని సూచిస్తున్నాము," అని బొనాంజ పోర్ట్​ఫోలియో సీనియర్​ రీసెర్చ్​ ఎనలిస్ట్​ రాజేశ్​ సిన్హా తెలిపారు.

(గమనిక:- ఇవి నిపుణుల అభిప్రాయాలు మాత్రమే. స్టాక్స్​లో ఇన్​వెస్ట్​మెంట్​ అనేది రిస్క్​తో కూడుకున్న వ్యవహారం అని గ్రహించాలి. ఏదైనా ఐపీఓలో ఇన్​వెస్ట్​ చేసే ముందు.. మీ ఫైనాన్షియల్​ అడ్వైజర్​ని సంప్రదించడం శ్రేయస్కరం.)

Whats_app_banner

సంబంధిత కథనం