తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Ipl 2023 Sponsors : ఐపీఎల్​ 2023కి స్పాన్సర్ల కొరత.. కారణం ఇదే!

IPL 2023 sponsors : ఐపీఎల్​ 2023కి స్పాన్సర్ల కొరత.. కారణం ఇదే!

Sharath Chitturi HT Telugu

25 March 2023, 11:33 IST

  • IPL 2023 sponsors : ఐపీఎల్​ స్పాన్సర్​షిప్స్​ కోసం ఒకప్పుడు ఎగబడిన సంస్థలు ఇప్పుడు దూరంగా ఉంటున్నట్టు తెలుస్తోంది. ఇందుకు పలు కారణాలు ఉన్నాయి. అవేంటంటే..

ఐపీఎల్​ 2023కి స్పాన్సర్ల కొరత.. కారణం ఇదే!
ఐపీఎల్​ 2023కి స్పాన్సర్ల కొరత.. కారణం ఇదే!

ఐపీఎల్​ 2023కి స్పాన్సర్ల కొరత.. కారణం ఇదే!

IPL 2023 sponsors : అంతర్జాతీయంగా టెక్​ రంగంలో నెలకొన్న అనిశ్చితి, ఆర్థిక మాంద్యం భయాల ఎఫెక్ట్​ ఐపీఎల్​ 2023 ఎడిషన్​పైనా పడింది! మరికొన్ని రోజుల్లో ప్రారంభంకానున్న ఐపీఎల్​ను స్పాన్సర్ల కొరత వెంటాడుతున్నట్టు తెలుస్తోంది. ముఖ్యంగా.. స్పాన్సర్​షిప్​, అడ్వర్టైజ్​మెంట్స్​ కోసం గత సీజన్​ వరకు భారీగా డబ్బులు కురిపించిన స్టార్టప్​ కంపెనీలు.. ఇప్పుడు ఐపీఎల్​కు దూరంగా ఉంటున్నాయి. బైజూస్​, అన్​అకాడమీ, ఫోన్​పే, అమెజాన్​ ప్రైమ్​, పిస్టిన్​ కేర్​, జెప్టో, ఎథర్​ ఎనర్జీ, నియో, స్పాటిఫైతో పాటు మరిన్ని ప్రముఖ సంస్థలు.. ఈ దఫా టోర్నమెంట్​ను పట్టించుకోవడం లేదు.

ట్రెండింగ్ వార్తలు

TVS iQube : టీవీఎస్​ ఐక్యూబ్​ ఎలక్ట్రిక్​ స్కూటర్​లో​ కొత్త వేరియంట్లు​..

7th Pay Commission : ప్రభుత్వ ఉద్యోగులకు షాక్​! గ్రాట్యుటీ పెంపును హోల్డ్​లో పెట్టిన ఈపీఎఫ్​ఓ..

Tecno Camon 30 launch : ఇండియాలో టెక్నో కామోన్​ 30 సిరీస్​​ లాంచ్​- ధర ఎంతంటే..

Upcoming electric cars : మారుతీ సుజుకీ ఈవీఎక్స్​ నుంచి టాటా హారియర్​ ఈవీ వరకు.. క్రేజీ లైనప్​!

వెంచర్​ ఇంటెలిజెన్స్​ డేటా ప్రకారం.. 2021లో ఇండియన్​ స్టార్టప్స్​లోకి 35.5 బిలియన్​ డాలర్ల వెంచర్​ ఫండింగ్​ జరగ్గా.. 2022లో అది 23.9 బిలియన్​ డాలర్లకు పడిపోయింది. ఫలితంగా స్టార్టప్స్​, యూనికార్న్​ సంస్థలు కాస్ట్​ కటింగ్​ ప్రక్రియను చేపట్టాయి.

ఐపీఎల్​ 2022లో స్టార్టప్స్​ జోరు..

IPL 2023 latest news : ఐపీఎల్​ 2022 సమయానికి అంతర్జాతీయంగా పరిస్థితులు కాస్త మెరుగ్గానే ఉన్నాయి. ఫలితంగా అనేక కంపెనీలు స్పాన్సర్​షిప్​ల కోసం ఎగబడ్డాయి. ముఖ్యంగా స్టార్టప్స్​ నుంచి మంచి డిమాండ్​ కనిపించింది. స్టార్​ స్పోర్ట్స్​కు 14 స్పాన్సర్లు దక్కగా.. వాటిల్లో 8 కంపెనీలు అంకుర సంస్థలే. క్రెడ్​, ఫోన్​పే, స్పాటిఫై, స్విగ్గీ ఇన్​స్టామార్ట్​, మీషో వంటివి అసోసియేట్​ స్పాన్సర్లుగా నిలిచాయి. ఇక డ్రీమ్​ 11, టాటా నియో, బైజూస్​ వంటి సంస్థలు కో- ప్రెసెంటింగ్​ స్పాన్సర్స్​ పాత్ర తీసుకున్నాయి.

అదే విధంగా.. డిస్నీ+ హాట్​స్టార్​కు లభించిన 18 అడ్వర్టైజర్స్​లో 12 స్టార్టప్​ సంస్థలే ఉన్నాయి. అవి.. డ్రీమ్​ 11, క్రెడ్​, టాటా నియో, జెప్టో, స్పిన్ని, ప్రిస్టీన్​ కేర్​, స్విగ్గీ, రూపే, ఎథర్​, లైవ్​స్పేస్​, నియోఎక్స్​, స్పాటిఫ్​. వీటితో పాటు 40కిపైగా స్టార్టప్​ సంస్థలు వివిధ జట్లకు ఫండింగ్​ చేశాయి. కొన్ని సంస్థలైతే ఒకటి కన్నా ఎక్కువ టీమ్స్​కు ఫండింగ్​ చేయడం గమనార్హం.

ఐపీఎల్​ 2023లో సీన్​ మారింది..!

IPL 2023 schedule : కానీ 2022 చివరి నాటికి ప్రపంచవ్యాప్తంగా పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. టెక్​ రంగంలో కాస్ట్​ కటింగ్​ పేరు తీవ్రంగా వినపడింది. అనేక సంస్థలు భారీ మొత్తంలో ఉద్యోగులను తొలగించాయి. 2023లోనూ ఈ ప్రక్రియ కొనసాగుతోంది. ముఖ్యంగా స్టార్టప్స్​పై ఈ ప్రభావం ఎక్కువ పడింది. నిధుల కొరత వాటిని కుదిపేస్తోంది. ఫలితంగా ఐపీఎల్​ 2023 స్పాన్సర్​షిప్​పై సంస్థలు ఆచితూచి వ్యవహరిస్తున్నట్టు తెలుస్తోంది.

IPL 2023 startups sponsorship : నివేదికల ప్రకారం.. ఫుల్​-టైమ్​ స్పాన్సర్లుగా ఉండకుండా, స్పాట్​ యాడ్​ డీల్స్​ చేసుకునేందుకే బ్రాడ్​కాస్టింగ్​, స్ట్రీమింగ్​ వేదికలతో అనేక సంస్థలు చర్చలు జరుపుతున్నాయి. డిస్నీ సంస్థ ఇప్పటివరకు 11 మంది స్పాన్సర్లను, దాదాపు 60 స్పాడ్​ అడ్వర్టైజర్స్​ను దక్కించుకున్నట్టు తెలుస్తోంది. వయ్​కామ్​ 18 సంస్థ.. డ్రీమ్​ 11, పార్లే ఆగ్రో, పూమా వంటి సంస్థలతో ఒప్పందం కుదుర్చుకున్నట్టు సమాచారం.

తదుపరి వ్యాసం