తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Iphone 14 Plus: ఐ ఫోన్ 14 ప్లస్ పై భారీ డిస్కౌంట్; అత్యంత తక్కువ ధరకే ప్రీమియం స్మార్ట్ ఫోన్

iPhone 14 Plus: ఐ ఫోన్ 14 ప్లస్ పై భారీ డిస్కౌంట్; అత్యంత తక్కువ ధరకే ప్రీమియం స్మార్ట్ ఫోన్

HT Telugu Desk HT Telugu

20 October 2023, 19:14 IST

  • iPhone 14 Plus: మార్కెట్లో ఐ ఫోన్ 15 సిరీస్ ఫోన్లు వచ్చిన తరువాత అప్పటివరకు హాట్ కేక్స్ లా ఉన్న ఐ ఫోన్ 14 సిరీస్ ఫోన్స్ భారీ డిస్కౌంట్స్ తో లభిస్తున్నాయి. ఫ్లిప్ కార్ట్ సహా వివిధ ఈ కామర్స్ సైట్స్ వీటిపై పెద్ద ఎత్తున డిస్కౌంట్స్ ను ప్రకటిస్తున్నాయి.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం (Apple)

ప్రతీకాత్మక చిత్రం

iPhone 14 Plus: చవకగా యాపిల్ ఫోన్ ను సొంతం చేసుకోవాలనుకునే వారికి శుభవార్త. ఈ పండుగ సీజన్ లో ఐ ఫోన్ 14 ప్లస్ ను అత్యంత తక్కువ ధరకే కొనుగోలు చేయవచ్చు. ఐ ఫోన్ 14 ప్లస్ ప్రస్తుతం ప్రముఖ ఈ కామర్స్ సైట్ ‘ఫ్లిప్ కార్ట్ (Flipkart)’ లో అత్యంత తక్కువ ధరకు లభిస్తోంది. అదనంగా, బ్యాంక్ ఆఫర్స్, క్యాష్ బ్యాక్ ఆఫర్స్ కూడా ఉన్నాయి.

ట్రెండింగ్ వార్తలు

Train ticket Booking: ఈ యాప్ తో ఆన్ లైన్ లో రైలు టికెట్లు బుక్ చేసుకోవడం చాలా ఈజీ.. జనరల్ టికెట్స్ కూడా కొనేయొచ్చు..

Demat Account: మీ డీమ్యాట్ అకౌంట్ లో ట్రాన్సాక్షన్ హిస్టరీ సహా అన్ని వివరాలు తెలుసుకోవడం ఎలా?

Scam calls: స్కామ్ కాల్స్ చిరాకు పెడ్తున్నాయా? చక్షు పోర్టల్ లో రిపోర్ట్ చేయండి.. ఆ నంబర్స్ ను బ్లాక్ చేస్తారు

Gold rate today: స్థిరంగా కొనసాగుతున్న బంగారం ధర; 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములు రూ. 66,240

ఫ్లిప్ కార్ట్ లో..

ఐ ఫోన్ 14 ను ఇప్పుడు ఫ్లిప్ కార్ట్ లో రూ. 73999 లకే సొంతం చేసుకోవచ్చు. అదనంగా, బ్యాంక్ ఆఫ్ బరోడా క్రెడిట్ కార్డుతో ఈ ఫోన్ ను కొనుగోలు చేస్తే 10% తక్షణ డిస్కౌంట్ లభిస్తుంది. ఈ తక్షణ తగ్గింపు గరిష్టంగా రూ. 1500 వరకు ఉంటుంది. అంతేకాదు, అదనంగా ఎక్స్చేంజ్ ఆఫర్ కూడా ఉంది. వర్కింగ్ కండిషన్ లో ఉన్న స్మార్ట్ ఫోన్ ను ఎక్స్చేంజ్ చేస్తే గరిష్టంగా రూ. 39,150 వరకు డిస్కౌంట్ లభిస్తుంది. అంటే, మీ వద్ద ఉన్న ఫోన్ కు గరిష్ట ఎక్స్చేంజ్ మొత్తం లభిస్తే, మీరు ఐ ఫోన్ 14 ప్లస్ ను సుమారు రూ. 34 వేలకే సొంతం చేసుకోవచ్చు. అయితే, మీరు ఎక్స్చేంజ్ చేసే ఫోన్ బ్రాండ్, వర్కింగ్ కండిషన్, మోడల్ లను బట్టి ఎక్స్చేంజ్ వ్యాల్యూ మారుతుంది. అలాగే, మీరు ఎక్స్చేంజ్ చేసే ఫోన్ పై ఎలాంటి డ్యామేజ్ ఉండకూడదు. స్క్రీన్ పై డ్యామేజ్ మార్క్స్ ఏవీ ఉండకూడదు.

స్పెసిఫికేషన్స్

ఐఫోన్ 14 ప్లస్ 128 జీబీ స్టోరేజ్ కెపాసిటీని కలిగి ఉంది. ఇందులో సూపర్ రెటినా ఎక్స్ డీఆర్ 6.7-అంగుళాల డిస్‌ప్లే ఉంటుంది. ఇందులో 12 ఎంపీ ప్రధాన కెమెరా, 12 ఎంపీ అల్ట్రా-వైడ్ కెమెరా సెటప్ ఉంది. ఐ ఫోన్ 14 ప్లస్ లో వైర్‌లెస్ ఛార్జింగ్ ఫెసిలిటీ ఉంది. ఇది కేవలం 30 నిమిషాల్లో 50 శాతం వరకు వేగంగా ఛార్జ్ చేస్తుంది. దీంతో గరిష్టంగా 26 గంటల వీడియో ప్లేబ్యాక్ సమయం, 20 గంటల స్ట్రీమింగ్ మరియు 100 గంటల ఆడియో ప్లేబ్యాక్ సమయం వస్తుంది.