Issues in iPhone 15: ఐ ఫోన్ 15 ఫోన్లలో హీటింగ్ సమస్య; స్పీకర్స్ లో కూడా లోపాలే..-after heating issues iphone 15 users report crackling sound from speakers ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Issues In Iphone 15: ఐ ఫోన్ 15 ఫోన్లలో హీటింగ్ సమస్య; స్పీకర్స్ లో కూడా లోపాలే..

Issues in iPhone 15: ఐ ఫోన్ 15 ఫోన్లలో హీటింగ్ సమస్య; స్పీకర్స్ లో కూడా లోపాలే..

HT Telugu Desk HT Telugu
Oct 04, 2023 07:13 PM IST

Issues in iPhone 15: ప్రతిష్టాత్మకంగా లాంచ్ అయి నెల రోజులు కూడా గడవక ముందే ఐ ఫోన్ 15 సిరీస్ ఫోన్లలో సమస్యలు ప్రారంభమయ్యాయి. లాంచ్ అయిన కొన్ని రోజుల్లోనే ఈ ఐ ఫోన్ లలో హీటింగ్ సమస్యను వినియోగదారులు గుర్తించారు.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం (AFP)

Issues in iPhone 15: ఐ ఫోన్ 15 సిరీస్ ఫోన్లను సెప్టెంబర్ లో జరిగిన యాపిల్ ఈవెంట్ లో ఆవిష్కరించారు. ఐ ఫోన్ 15 సిరీస్ లోని ఐ ఫోన్ 15, ఐ ఫోన్ 15 ప్లస్, ఐ ఫోన్ 15 ప్రొ, ఐ ఫోన్ 15 ప్రొ మాక్స్ లను మార్కెట్లోకి విడుదల చేశారు. కానీ లాంచ్ అయిన నెలలోపే ఈ ఫోన్లపై అనేక ఫిర్యాదులు వస్తున్నాయి.

హీటింగ్ సమస్య

ఐ ఫోన్ 15 ఫోన్లలో ప్రధానంగా చాలా మంది వినియోగదారులు హీటింగ్ సమస్యను గుర్తించారు. ఫోన్ తీవ్రంగా వేడెక్కడం, ముఖ్యంగా చార్జ్ చేస్తున్న సమయంలో డివైజ్ వేడిగా మారిపోవడం వంటి సమస్యలను వినియోగదారులు ప్రస్తావించారు. ఐ ఫోన్ 15 స్టాండర్డ్ మోడల్స్ అన్నీ డైనమిక్ ఐలండ్ ఫీచర్ ను కలిగి ఉన్నాయి. ఐ ఫోన్ 15 ప్రొ మోడల్స్ మాత్రం టైటానియం ఫ్రేమ్ కలిగి ఉంది. ఇప్పుడు ఈ హీటింగ్ సమస్య అన్ని ఐ ఫోన్ 15 మోడల్స్ లో కూడా ఉందని, కానీ ఐ ఫోన్ 15 లో ఎక్కువగా కనిపిస్తోందని తెలుస్తోంది. ఎక్కువ ఫిర్యాదులు కూడా ఐ ఫోన్ 15 యూజర్ల నుంచే వస్తున్నాయి.

స్పీకర్ ల నుంచి వింత శబ్ధాలు..

తాజాగా ఐ ఫోన్ 15 సిరీస్ ఫోన్ల యూజర్లు మరో సమస్యను లేవనెత్తారు. ఐ ఫోన్ 15 సిరీస్ ఫోన్లలో ప్రధానంగా ఐ ఫోన్ 15 ప్రొ మోడల్స్ లో స్పీకర్ నుంచి వింత వింత శబ్దాలు వస్తున్నాయని వారు ఫిర్యాదు చేస్తున్నారు. ఎక్కువ వ్యాల్యూమ్ లో ఉన్నప్పుడు ఈ శబ్ధాలు చాలా ఇబ్బందికరంగా ఉంటున్నాయని వివరిస్తున్నారు. ఫోన్ లోపల ఏదో ద్రవం ఉన్నట్లుగా కొన్ని సార్లు, ఫోన్ లోపల ఏదో పగులుతున్నట్లుగా కొన్నిసార్లు వింత సౌండ్స్ వస్తున్నాయని ఫిర్యాదు చేస్తున్నారు. కాల్స్ సమయంలో కానీ, మ్యూజిక్ ప్లే అవుతున్న సమయంలో కానీ ఆడియో స్పష్టంగా ఉండడం లేదని చెబుతున్నారు. యాప్స్ వాడుతున్న సమయంలో కూడా వింత సౌండ్స్ వస్తున్నాయని చెబుతున్నారు.

యాపిల్ నుంచి నో రెస్సాన్స్

తాము రీసెంట్ గా కొనుగోలు చేసిన ఐ ఫోన్ 15 సిరీస్ ఫోన్లలో హీటింగ్ సమస్య, ఆడియో సమస్య ఉందని, తమ ఫోన్లను రీప్లేస్ చేయాలని కోరుతూ చాలా మంది వినియోగదారులు యాపిల్ సంస్థకు ఈమెయిల్స్ చేశారు. కానీ యాపిల్ సంస్థ నుంచి ఎలాంటి సానునకూల స్పందన రాలేదు. దాదాపు ఐ ఫోన్ 15 సిరీస్ లోని అన్ని మోడల్స్ కు సంబంధించిన వినియోగదారుల నుంచి యాపిల్ కు ఫిర్యాదులు వెళ్లాయి. ముఖ్యంగా హీటింగ్ సమస్య చాలా తీవ్రంగా ఉందని, డివైజ్ ను చేతిలో పట్టుకోలేనంత తీవ్రంగా ఫోన్ వేడెక్కుతోందని ఫిర్యాదు చేస్తున్నారు. బుల్స్ ల్యాబ్ అనే ఒక యూట్యూబర్ ఐ ఫోన్ 15 ప్రొ మాక్స్ ను థర్మల్ ఇమేజింగ్ కెమెరాతో థర్మల్ స్కాన్ చేశాడు. కొద్ది సేపు వాడకం అనంతరం ఫోన్ టెంపరేచర్ 46.7 డిగ్రీల గరిష్టానికి చేరింది.

WhatsApp channel