iPhone 15s above MRP: ఇండియాలో ఐ ఫోన్ 15 సిరీస్ ఫోన్ల డిమాండ్ మామూలుగా లేదు.. ఎమ్మార్పీ కన్నా ఎక్కువకే కొంటున్నారు..-iphone 15 pro iphone 15 pro max selling for upto 32 000 rupees above mrp in india ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Iphone 15s Above Mrp: ఇండియాలో ఐ ఫోన్ 15 సిరీస్ ఫోన్ల డిమాండ్ మామూలుగా లేదు.. ఎమ్మార్పీ కన్నా ఎక్కువకే కొంటున్నారు..

iPhone 15s above MRP: ఇండియాలో ఐ ఫోన్ 15 సిరీస్ ఫోన్ల డిమాండ్ మామూలుగా లేదు.. ఎమ్మార్పీ కన్నా ఎక్కువకే కొంటున్నారు..

HT Telugu Desk HT Telugu
Sep 26, 2023 03:09 PM IST

iPhone 15s above MRP: ఇండియాలో ఐఫోన్ 15 సిరీస్ ఫోన్లకు డిమాండ్ మామూలుగా లేదు. దేశవ్యాప్తంగా ఐఫోన్ 15 ఫోన్ల మేనియా కొనసాగుతుంది. ఎమ్మార్పీపై రూ. 32 వేల వరకు అధికంగా చెల్లించడానికి కూడా ఐ ఫోన్ లవర్స్ సిద్ధమవుతున్నారు.

ఐ ఫోన్ 15 సిరీస్ ఫోన్లు
ఐ ఫోన్ 15 సిరీస్ ఫోన్లు (AFP)

iPhone 15s above MRP: సెప్టెంబర్ 12వ తేదీన ఆపిల్ ఈవెంట్లో ఐఫోన్ 15 సిరీస్ ఫోన్లను లాంచ్ చేశారు. ఈ ఫోన్లలో ఐఫోన్ 15, ఐఫోన్ 15 ప్లస్, ఐఫోన్ 15 ప్రో, ఐఫోన్ 15 ప్రో మాక్స్ ఉన్నాయి. ఇవి వివిధ స్టోరేజ్ కెపాసిటీల్లో, వేర్వేరు రేట్లలో లభిస్తున్నాయి.

ఇవీ ఎమ్మార్పీ రేట్స్..

భారత్ లో ఐఫోన్ సిరీస్ ఫోన్ల రేట్స్ ఇలా ఉన్నాయి. ఐఫోన్ 15 ప్రో 128 జీబీ స్టోరేజ్ తో ఉన్న వేరియంట్ ధర రూ, 1,34,900 గా, 256 స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 1,44, 900గా, అలాగే 512 జిబి స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 1,64,900 గా, 1 టీబీ స్టోరేజ్ ఉన్న ఐఫోన్ ప్రో ధర రూ. 1,84,900 గా ఉంది. మరోవైపు ఐ ఫోన్ ప్రొ మ్యాక్స్ 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 1,59,900 గా ఉంది. 512 జీబీ వేరియంట్ ధర రూ. 1,79,900 గా, అలాగే 1 టీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 1,99,900 గా ఉంది.

ఇండియాలో ఐఫోన్ మేనియా

ఆపిల్ 15 సిరీస్ ఫోన్ల కోసం ఐఫోన్ లవర్స్ రిటైల్ స్టోర్స్ ముందు పెద్ద ఎత్తున క్యూ కడుతున్నారు. ఇండియా లోని రెండు అధికారిక ఆపిల్ స్టోర్స్ ఆపిల్ బికేసి, ఆపిల్ సాకేత్ ల ముందు ఐఫోన్ లవర్ల క్యూలు భారీగా ఉన్నాయి. హై ఎండ్ మోడల్స్ అయిన ఐఫోన్ 15 ప్రో, ఐఫోన్ 15 ప్రో మాక్స్ ఫోన్ల వెయిటింగ్ టైమ్ చాలా ఎక్కువగా ఉంది. ఈ ఫోన్లు అక్టోబర్ నెలాఖరు వరకు డెలివరీ అయ్యే పరిస్థితి కనిపిస్తుంది. మొత్తంగా భారత్ కు వస్తున్న ఐఫోన్ సిరీస్ ఫోన్లలో దాదాపు 25% ఐఫోన్ 15 ప్రో మోడల్స్ ఉన్నాయని మీడియా రిపోర్ట్స్ చెబుతున్నాయి.

ఎమ్మార్పీ కన్నా ఎక్కువకే..

కాగా భారత్ లో ఐఫోన్ 15 ఫోన్ల క్రేజ్ మామూలుగా లేదు. లేటెస్ట్ మోడల్ ఐ ఫోన్ కోసం ఎంతో కాలం నుంచి ఎదురుచూస్తున్నట్లుగా.. సాధ్యమైనంత త్వరగా ఐఫోన్ 15 ఫోన్ లను సొంతం చేసుకోవాలని వినియోగదారులు ఆశిస్తున్నారు. అందుకోసం గరిష్ట చిల్లర ధర (MRP) కన్నా ఎక్కువ ధర పెట్టడానికి కూడా సిద్ధమవుతున్నారు. ఎమ్మార్పీపై దాదాపు రూ. 32 వేల వరకు ఎక్కువ ధర చెల్లించడానికి కూడా వినియోగదారులు సిద్ధంగా ఉన్నారు. ఐఫోన్ 15 ప్రో, ఐఫోన్ 15 ప్రో మాక్స్ లకు రిటైలర్లు గరిష్ట చిల్లర ధర (MRP) పై రూ. 20000 నుంచి రూ. 32 వేల వరకు అధికంగా వసూలు చేస్తున్నారు. ఐఫోన్ 15 ప్రో మాక్స్ 256 జీబీ వేరియంట్ నేచురల్ టైటానియం కలర్ లో ఉన్న ఫోన్ కి రిటైలర్లు రూ. 20000 వరకు అదనంగా డిమాండ్ చేస్తున్నారు. అలాగే, మహారాష్ట్రలోని థానే లో రిటైలర్లు ఐఫోన్ 15 ప్రో మాక్స్ ని ఎమ్మార్పీపై రూ. 32 వేల రూపాయలు అధికంగా అమ్ముతున్నారు.

Whats_app_banner