తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Instagram: ‘ఇన్ స్టా’ యూజర్లకు గుడ్ న్యూస్.. ‘మెటా ఏఐ స్టూడియో’ తో ఇలా వండర్స్ చేసేయండి..

Instagram: ‘ఇన్ స్టా’ యూజర్లకు గుడ్ న్యూస్.. ‘మెటా ఏఐ స్టూడియో’ తో ఇలా వండర్స్ చేసేయండి..

HT Telugu Desk HT Telugu

30 July 2024, 17:14 IST

google News
  • ఇన్ స్టాగ్రామ్ యూజర్లకు గుడ్ న్యూస్. ఇన్ స్టాలో యూజర్లకు ఉపయోగపడే కొత్త టూల్ ను అందుబాటులోకి రానుంది. దీంతో, ఇన్ స్టా వినియోగదారులు మెటా ఏఐ స్టూడియో ద్వారా  కస్టమైజ్డ్ ఏఐ క్యారెక్టర్లను సృష్టించే అవకాశం లభిస్తుంది. యూజర్లు సృష్టించిన ఏఐ క్యారెక్టర్లు ఇంటరాక్టివ్ గా ఉంటాయి.

‘ఇన్ స్టా’ యూజర్లకు గుడ్ న్యూస్
‘ఇన్ స్టా’ యూజర్లకు గుడ్ న్యూస్ (Reuters)

‘ఇన్ స్టా’ యూజర్లకు గుడ్ న్యూస్

వినియోగదారులు కస్టమైజ్డ్ ఏఐ చాట్ బాట్ లను అభివృద్ధి చేయడానికి, డిజైన్ చేయడానికి వీలుగా ఏఐ స్టూడియో అనే కొత్త టూల్ ను విడుదల చేయనున్నట్లు మెటా ప్లాట్ ఫామ్స్ వెల్లడించింది. మెటా ఆవిష్కరిస్తున్న ఈ కొత్త ఏఐ టూల్ తో ఇన్ స్టా యూజర్లు, కంటెంట్ క్రియేటర్లు తమకు నచ్చిన ఏఐ క్యారెక్టర్లను సృష్టించుకోవచ్చు. వాటిని ఇంటరాక్టివ్ గా తమ పేజ్ లో ఉపయోగించుకోవచ్చు.

కృత్రిమ మేధ ద్వారా

కృత్రిమ మేధ (AI) క్యారెక్టర్లను ఉపయోగించి మెటా ప్లాట్ ఫామ్స్ లో క్రియేటర్లు చాలా చేయవచ్చు. వారి సొంత కస్టమైజ్డ్ ఏఐ క్యారెక్టర్లను సృష్టించవచ్చు. ఆ ఏఐ క్యారెక్టర్లతో ఇంటరాక్టివ్ సెషన్స్ ను నిర్వహించవచ్చు. ఫాలోవర్ల సాధారణ ప్రశ్నలకు జవాబులు ఇవ్వవచ్చు. ఏఐ మెటా స్టూడియో ద్వారా మీ ప్రతినిధిగా ఇన్ స్టా లో ఈ ఏఐ క్యారెక్టర్లను అభివృద్ధి చేయవచ్చు. మెటా యాజమాన్యంలోని వివిధ సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ లలో వినియోగదారులు తమ కస్టమైజ్డ్ ఏఐ క్యారెక్టర్లను పంచుకోవచ్చు.

మెటా లామా 3.1 సృష్టి

ఈ టూల్ ను మెటా లామా 3.1 ను ఉపయోగించి అభివృద్ధి చేశారు. ఇది ఎక్కువగా ఉచిత కృత్రిమ మేధస్సు మోడళ్ల (free AI models) ను అందిస్తుంది. గత వారం లాంచ్ అయిన మెటా లామా 3.1 ను వివిధ భాషల్లో యాక్సెస్ చేయవచ్చు. ఇది ఓపెన్ఎఐ వంటి పోటీదారులు విడుదల చేసిన పెయిడ్ మోడళ్లకు గట్టి పోటీ ఇస్తుంది.

ఓపెన్ఎఐ "స్ట్రాబెర్రీ" ప్రాజెక్టు

చాట్ జీపీటీ డెవలపర్ ఓపెన్ఎఐ ప్రస్తుతం "స్ట్రాబెర్రీ" అనే రహస్య పేరుతో అజ్ఞాత ప్రాజెక్టులో పనిచేస్తోందని రాయిటర్స్ జులైలో ప్రచురించిన ఒక కథనంలో వెల్లడించింది. ఈ కొత్త ప్రాజెక్టుకు సంబంధించిన సమాచారాన్ని ఓపెన్ ఏఐ లో పనిచేసే వారి నుంచి కూడా దాచిపెట్టారు. అధునాతన రీజనింగ్ సామర్థ్యాలను అందించడానికి అవసరమైన సామర్థ్యాన్ని తమ అభివృద్ధి చేసిన మోడళ్లకు కలిగి ఉన్నాయని చూపించడానికి ఓపెన్ ఏఐ కృషి చేస్తోందని సమాచారం.

ఏఐ రేసులో ముందుందెవరు?

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గేమ్ లో అగ్రస్థానంలో నిలిచేందుకు గూగుల్ (google), మెటా (meta), ఓపెన్ ఏఐ (openAI) వంటి టెక్ దిగ్గజాలు పోటీ పడుతున్నాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (artificial intelligence) ను ఉపయోగించి వినియోగదారులకు అత్యున్నత సౌలభ్యాలను అందించడానికి ఈ కంపెనీలు కృషి చేస్తున్నాయి. సమీప భవిష్యత్తులో వినియోగదారులు పైసా కూడా చెల్లించకుండా కృత్రిమ మేధస్సు అధునాతన లక్షణాలను పొందగలరు.

తదుపరి వ్యాసం