తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Infosys Q4 Results: ‘ఇన్ఫీ’ Q4 ఫలితాల వెల్లడి; అంచనాలు మిస్

Infosys Q4 results: ‘ఇన్ఫీ’ Q4 ఫలితాల వెల్లడి; అంచనాలు మిస్

HT Telugu Desk HT Telugu

13 April 2023, 18:47 IST

  • Infosys Q4 results: భారతీయ ఐటీ దిగ్గజ సంస్థ ఇన్ఫోసిన్ (Infosys) Q4 (Q4FY23) ఫలితాలు వెలువడ్డాయి. పన్ను అనంతర లాభాల్లో ఈ Q3తో పోలిస్తే, ఈ Q4 లో  16% తగ్గుదల నమోదైంది. 

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Infosys Q4 results: ఇన్ఫోసిస్ (Infosys) ఫలితాలు ఆశించిన స్థాయిలో వెలువడలేదు. ఈ ఆర్థిక సంవత్సరం Q4 లో పన్ను అనంతర లాభాలు (profit after tax PAT) రూ. 6, 128 కోట్లు అని ఇన్ఫోసిస్ ప్రకటించింది. ఇది ఈ ఆర్థిక సంవత్సరం Q3 కన్నా 16% తక్కువ. ఈ ఆర్థిక సంవత్సరం Q3 (FY23Q3) లో ఇన్ఫోసిస్ (Infosys) రూ. 6,586 కోట్ల నికర లాభాలను ఆర్జించింది.

ట్రెండింగ్ వార్తలు

First Bajaj CNG motorcycle: బజాజ్ నుంచి తొలి సీఎన్జీ మోటార్ సైకిల్; జూన్ 18 న లాంచ్

Bajaj Pulsar NS400Z: 2024 పల్సర్ ఎన్ఎస్400జెడ్ ను లాంచ్ చేసిన బజాజ్; ధర కూడా తక్కువే..

‘‘ఆపిల్ వాచ్ 7 నా ప్రాణాలను కాపాడింది’’: ఆపిల్ సీఈఓ టిమ్ కుక్ కు థాంక్స్ చెప్పిన ఢిల్లీ యువతి

Stock market: ర్యాలీకి బ్రేక్; స్టాక్ మార్కెట్ క్రాష్; రూ. 2.3 లక్షల కోట్లు నష్టపోయిన ఇన్వెస్టర్లు

Infosys Q4 results: ఆదాయం కూడా తగ్గింది..

ఈ Q4 లో ఇన్ఫోసిస్ ఆదాయం లోనూ తగ్గుదల నమోదైంది. ఈ Q4 లో ఇన్ఫోసిస్ (Infosys) ఆదాయంలో 2.2% తగ్గుదల నమోదైంది. ఈ Q4 లో సంస్థ ఆదాయం రూ. 37,441 కోట్లు. ఈ ఆర్థిక సంవత్సరం Q3 లో ఇన్ఫోసిస్ రూ. 38,318 కోట్ల ఆదాయం సంపాదించింది. గత ఆర్థిక సంవత్సరం Q3 తో పోలిస్తే, ఇది 20.2% అధికం. టీసీఎస్ (TCS), ఇన్ఫోసిస్ (Infosys) లు ఈ సంవత్సరం Q4 ఫలితాల్లో మార్కెట్ అంచనాలను అందుకోలేకపోయాయి.

Infosys Q4 results: డివిడెండ్ ప్రకటన

Q4 ఫలితాలతో పాటు డివిడెండ్ ను కూడా ఇన్ఫోసిస్ (Infosys) ప్రకటించింది. గత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి చివరి డివిడెండ్ గా రూ. 17.50 లను ప్రకటించింది. జూన్ 2, 2023 న జరిగే షేర్ హోల్డర్ల ఏజీఎం తరువాత ఈ డివిడెండ్ ను ఎప్పుడు షేర్ హోల్డర్ల ఖాతాలో జమ చేస్తామో తెలియజేస్తామని ఇన్ఫోసిస్ (Infosys) తెలిపింది. అలాగే, డివిడెండ్ పొందడానికి రికార్డు డేట్ గా జూన్ 2, 2023 అని వెల్లడించింది.