Infosys Q3 Results: మార్కెట్ అంచనాలను మించి ఇన్ఫోసిస్ పనితీరు-infosys q3 net profit rises 13 4 percent at 6586 crore rupees ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Infosys Q3 Results: మార్కెట్ అంచనాలను మించి ఇన్ఫోసిస్ పనితీరు

Infosys Q3 Results: మార్కెట్ అంచనాలను మించి ఇన్ఫోసిస్ పనితీరు

HT Telugu Desk HT Telugu
Jan 12, 2023 06:09 PM IST

Infosys Q3 Results: ఇన్ఫోసిస్ డిసెంబరు 30తో ముగిసిన మూడో త్రైమాసికంలో మెరుగైన ఫలితాలు ప్రకటించింది.

క్యూ 3 ఫలితాలు వెల్లడించిన ఇన్ఫోసిస్
క్యూ 3 ఫలితాలు వెల్లడించిన ఇన్ఫోసిస్ (Bloomberg)

న్యూఢిల్లీ: డిసెంబర్ 30తో ముగిసిన మూడో త్రైమాసికంలో ఇన్ఫోసిస్ 13.4 శాతం వార్షిక వృద్ధిని నమోదు చేసింది. ఏకీకృత నికర లాభం రూ. 6,586 కోట్లుగా ప్రకటించింది. గురువారం కంపెనీ తన మూడో త్రైమాసిక ఫలితాలు ప్రకటించింది. గత ఏడాది మూడో త్రైమాసికంలో నికర లాభం రూ.5,809 కోట్లుగా ఉంది.

బెంగళూరుకు చెందిన ఈ ఐటీ సంస్థ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో ఏకీకృత ఆదాయంలో ఏడాది ప్రాతిపదికన 20 శాతం వృద్ధితో రూ. 38,318 కోట్లకు చేరుకుంది. ఇది మునుపు అంచనా వేసిన 15-16 శాతం బ్యాండ్‌‌ను మించి.. సంవత్సర ఆదాయ అంచనాలను 16-16.5 శాతానికి పెంచింది.

కాగా క్యూ 3 ఫలితాలు లాభం, రెవెన్యూ విషయంలో మార్కెట్ అంచనాలను మించి ఉన్నాయి. ఇన్ఫోసిస్ సీఈఓ, ఎండీ సలీల్ పరేఖ్ మాట్లాడుతూ దాదాపు అన్ని బిజినెస్ సెగ్మెంట్లలో, భౌగోళిక ప్రాంతాల్లో వార్షిక వృద్ధి డబుల్ డిజిట్‌గా ఉందని చెప్పారు.

‘ఈ త్రైమాసికంలో మా రాబడి వృద్ధి బలంగా ఉంది. డిజిటల్ వ్యాపారం, ప్రధాన సేవలు రెండూ వృద్ధి చెందాయి. ఇది పరిశ్రమలో అగ్రగామి డిజిటల్, క్లౌడ్, ఆటోమేషన్ సామర్థ్యాలు, మా ఉద్యోగుల అలుపెరగని అంకితభావానికి స్పష్టమైన ప్రతిబింబం..’ అని చెప్పారు.

WhatsApp channel