తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Infinix Zero Ultra 5g: 200 మెగాపిక్సెల్ కెమెరాతో ఇన్ఫినిక్స్ జీరో అల్ట్రా 5జీ వచ్చేసింది.. ధర, పూర్తి స్పెసిఫికేషన్లు

Infinix Zero Ultra 5G: 200 మెగాపిక్సెల్ కెమెరాతో ఇన్ఫినిక్స్ జీరో అల్ట్రా 5జీ వచ్చేసింది.. ధర, పూర్తి స్పెసిఫికేషన్లు

20 December 2022, 20:22 IST

google News
    • Infinix Zero Ultra 5G price in India: ఇన్ఫినిక్స్ జీరో అల్ట్రా 5జీ మొబైల్ ఇండియాలో లాంచ్ అయింది. 200 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 12 నిమిషాల్లోనే బ్యాటరీ ఫుల్ అయ్యేలా ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్, కర్వ్డ్ అమోలెడ్ డిస్‍ప్లేతో ఈ మొబైల్ వస్తోంది.
Infinix Zero Ultra 5G: 200 మెగాపిక్సెల్ కెమెరాతో ఇన్ఫినిక్స్ అల్ట్రా 20 5జీ వచ్చేసింది (Photo: Infinix)
Infinix Zero Ultra 5G: 200 మెగాపిక్సెల్ కెమెరాతో ఇన్ఫినిక్స్ అల్ట్రా 20 5జీ వచ్చేసింది (Photo: Infinix)

Infinix Zero Ultra 5G: 200 మెగాపిక్సెల్ కెమెరాతో ఇన్ఫినిక్స్ అల్ట్రా 20 5జీ వచ్చేసింది (Photo: Infinix)

Infinix Zero Ultra 5G launched in India: ఇన్ఫినిక్స్ జీరో అల్ట్రా 5జీ స్మార్ట్‌ఫోన్ భారత్‍లో లాంచ్ అయింది. ప్రాసెసర్‌ మినహా దాదాపు ఫ్లాగ్‍షిప్ స్పెసిఫికేషన్లతో మంగళవారం ఇండియాలో అడుగుపెట్టింది. 200 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా ఈ మొబైల్‍కు హైలైట్‍గా ఉంది. 180 వాట్ల ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్, కర్వ్డ్ అమోలెడ్ డిస్‍ప్లేను ఇన్ఫినిక్స్ జీరో అల్ట్రా 5జీ కలిగి ఉంది. 12 నిమిషాల్లోనే ఈ ఫోన్ ఫుల్ చార్జ్ అవుతుందని ఇన్ఫినిక్స్ పేర్కొంది. Infinix Zero Ultra 5G ధర, సేల్, పూర్తి స్పెసిఫికేషన్‍ల వివరాలు ఇవే.

200 మెగాపిక్సెల్ కెమెరాతో..

Infinix Zero Ultra Specifications: ఇన్ఫినిక్స్ జీరో అల్ట్రా 5జీ ఫోన్ వెనుక మూడు కెమెరాల సెటప్ ఉంది. ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్‍ (OIS) సపోర్ట్ ఉండే 200 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా ఉంటుంది. 13 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్, 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ మరో రెండు కెమెరాలుగా ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 32 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాను ఇన్ఫినిక్స్ ఈ మొబైల్‍కు పొందుపరిచింది.

12 నిమిషాల్లో బ్యాటరీ ఫుల్ అయ్యేలా ..

Infinix Zero Ultra Specifications: ఇన్ఫినిక్స్ జీరో అల్ట్రా 5జీ ఫోన్‍లో 4,500 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. 180 వాట్ల ఫాస్ట్ చార్జింగ్‍కు సపోర్ట్ చేస్తుంది. దీంతో బ్యాటరీ 0 నుంచి 100 శాతం 12 నిమిషాల్లోనే చార్జ్ అవుతుందని ఇన్ఫినిక్స్ పేర్కొంది. 5జీ, 4జీ ఎల్‍టీఈ, వైఫై6, బ్లూటూత్, జీపీఎస్, యూఎస్‍బీ టైప్-సీ కనెక్టివిటీ ఫీచర్లతో ఈ మొబైల్ వస్తోంది.

కర్వ్డ్ అమోలెడ్ డిస్‍ప్లే, 5జీ ప్రాసెసర్

Infinix Zero Ultra 5G Specifications: 6.8 ఇంచుల ఫుల్ హెచ్‍డీ+ కర్వ్డ్ 3జీ అమోలెడ్ డిస్‍ప్లేతో ఇన్ఫినిక్స్ జీరో అల్ట్రా 5జీ ఫోన్ వస్తోంది. 120 హెర్ట్జ్ (Hz) రిఫ్రెష్ రేట్, 1000 నిట్స్ పీక్ బ్రైట్‍నెస్ ఉంటుంది. మీడియాటెక్ డైమన్సిటీ 920 ప్రాసెసర్‌పై ఈ మొబైల్ రన్ అవుతుంది. ఆండ్రాయిడ్ 12 బేస్డ్ ఎక్స్ఓఎస్ 12 ఆపరేటింగ్ సిస్టమ్‍తో వస్తోంది. 256జీబీ ఇంటర్నల్ స్టోరేజ్‍ను కలిగి ఉంటుంది.

ఇన్ఫినిక్స్ జీరో అల్ట్రా 5జీ ధర, సేల్

Infinix Zero Ultra 5G Price, Sale: 8జీబీ ర్యామ్+256జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ ఉన్న ఇన్ఫినిక్స్ జీరో అల్ట్రా 5జీ ధర రూ.29,999గా ఉంది. సింగిల్ వేరియంట్ లాంచ్ అయింది. ఈ-కామర్స్ ప్లాట్‍ఫామ్ ఫ్లిప్‍కార్ట్ (Flipkart)లో ఈనెల 25వ తేదీన ఈ మొబైల్ సేల్‍కు వస్తుంది. కాస్‍లైట్ సిల్వర్, జెన్సిస్ నోయిర్ కలర్ ఆప్షన్‍లో Infinix Zero Ultra లభిస్తుంది.

తదుపరి వ్యాసం