Indian Railways Revenue: ఆదాయంలో రికార్డులు బద్దలుకొట్టిన రైల్వే: భారీ వృద్ధి
17 April 2023, 21:23 IST
- Indian Railways Revenue: 2022-23 ఆర్థిక సంవత్సరంలో భారతీయ రైల్వేల ఆదాయం గణనీయంగా పెరిగింది. అన్ని విభాగాల రెవెన్యూలో వృద్ధి నమోదైంది.
Indian Railways Revenue: ఆదాయంలో రికార్డులు బద్దలుకొట్టిన రైల్వేలు: భారీ వృద్ధి
Indian Railways Revenue: ఆదాయంలో భారతీయ రైల్వే కొత్త రికార్డు సృష్టించింది. 2022-23 ఆర్థిక సంవత్సరం(2022 ఏప్రిల్ - 2023 మార్చి 31)లో భారతీయ రైల్వేస్ (Indian Railways) రూ.2.4లక్షల కోట్ల ఆదాయాన్ని సాధించింది. కిందటి ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ఇది రూ.49వేల కోట్లు అదనం. అంటే ఏకంగా ఆదాయంలో 25 శాతం వృద్ధి సాధించింది భారతీయ రైల్వే. వివరాలివే..
Indian Railways Revenue: 2022-23 ఆర్థిక సంవత్సరంలో సరుకు రవాణా (Freight) ద్వారా రైల్వే శాఖకు రూ.1.62లక్షల కోట్ల ఆదాయం సమకూరింది. కిందటి ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ఇది 15 శాతం అధికం.
ప్యాసింజర్ రెవెన్యూలో రికార్డుస్థాయి వృద్ధి
Indian Railways Revenue: ఇక 2022-23 ఆర్థిక సంవత్సరంలో ప్రయాణికుల ద్వారా రూ.63,300 కోట్ల ఆదాయాన్ని రైల్వే శాఖ ఆర్జించింది. 2021-22తో పోలిస్తే ఇది 61 శాతం అధికంగా ఉంది. వృద్ధిలో ఇది ఆల్‍టైమ్ రికార్డుగా ఉంది. కరోనా ప్రభావం కారణంగా 2021-22లో రైల్వేలు ప్రభావితమయ్యాయి. అయితే 2022-23 ఆర్థిక సంవత్సరంలో పరిస్థితులు సద్దుమణగటంతో ఆదాయం గణనీయంగా పెరిగింది.
కరోనా పరిస్థితుల నుంచి కోలుకున్న ఇండియన్ రైల్వేస్ మూడు సంవత్సరాల తర్వాత పూర్తిస్థాయి ఆదాయాన్ని సాధించింది. ఖర్చులకు తగ్గట్టు ఆదాయాన్ని గడించింది.
Indian Railways Revenue: ఆపరేటింగ్ రేషియోను 98.14 శాతం సాధించేందుకు ఖర్చులను కఠినంగా నిర్వహించడం కూడా ఓ కారణంగా ఉంది. మొత్తంగా భారతీయ రైల్వే 2022-23 ఆర్థిక సంవత్సంలో లక్ష్యంగా పెట్టుకున్న ఆదాయాన్ని సాధించింది. ఇక, అంతర్గత వనరుల నుంచి క్యాపిటల్ ఇన్వెస్ట్‌మెంట్ల కోసం రూ.3,200 కోట్లను రైల్వేస్ జనరేట్ చేసింది.
2022-23 ఆర్థిక సంవత్సరంలో ఇండియన్ రైల్వేస్ స్థూల ఆదాయం రూ.2,39,803 కోట్లుగా ఉంది. 2021-22లో ఇది రూ.1,91,278 లక్షలుగా ఉంది.
Indian Railways Revenue: ట్రాఫిక్ రెవెన్యూ విషయానికి వస్తే, 2022-23 ఆర్థిక సంవత్సరంలో ప్యాసెంజర్ రెవెన్యూ రూ.63,000కోట్లుగా ఉంది. కిందటి ఆర్థిక సంవత్సరంలో ఇది రూ.39,214 కోట్లుగా నమోదైంది.
Indian Railways Revenue: 2022-23 ఆర్థిక సంవత్సరంలో ఇతర కోచ్‍లకు సంబంధించిన వాటి ద్వారా రూ.5,951 కోట్ల ఆదాయం రైల్వేస్‍కు సమకూరింది. 2021-22లో ఇది రూ.4,899గా నమోదైంది. దీంతో 21 శాతం వృద్ధి కనిపించింది.
2022-23 ఆర్థిక సంవత్సరంలో రైల్వేలకు ఖర్చు మొత్తంగా రూ.2,37,375 కోట్లుగా ఉంది. దీంతో ఆదాయం, ఖర్చుల ఆపరేటింగ్ రేషియో 98.14 శాతంగా నమోదైంది.
Indian Railways Revenue: 2020 నుంచి కొవిడ్-19 కారణంగా భారతీయ రైల్వేకు ఆదాయం భారీగా తగ్గింది. అన్ని రకాల రెవెన్యూపై ప్రభావం పడింది. అయితే, 2022-23 ఆర్థిక సంవత్సరంలో రైల్వే పూర్తిగా కోలుకున్నట్టు గణాంకాలను చూస్తే అర్థమవుతోంది.
ప్రస్తుతం వందే భారత్ రైళ్లను భారతీయ రైల్వేస్ వరుసగా తీసుకొస్తోంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 14 వందే భారత్ రైళ్లు నడుస్తున్నాయి. త్వరలో మరిన్ని పరుగులు పెట్టనున్నాయి.