Income Tax Calendar 2023: ఇన్ కం టాక్స్ కేలండర్; ఈ నెలలో ఈ డేట్స్ ను మర్చిపోకండి..
01 December 2023, 10:57 IST
IT deadlines in December: ఆదాయ పన్నుకు సంబంధించి ఈ డిసెంబర్ నెలలో ముఖ్యమైన లాస్ట్ డేట్స్ ఉన్నాయి. వాటిని మర్చిపోతే, టాక్స్ పేయర్స్ ఇబ్బందులు పడే అవకాశం ఉంది. అందువల్ల ఈ టాక్స్ కేలండర్ ను వ్యక్తిగత, వ్యాపార సంబంధ ఆదాయ పన్ను చెల్లింపుదారులు కచ్చితంగా గుర్తుంచుకోవాలి.
ప్రతీకాత్మక చిత్రం
IT deadlines in December: సంవత్సరం ముగుస్తున్నందున, పన్ను చెల్లింపుదారులందరూ తమ ఆదాయ పన్ను బాధ్యతల కోసం తప్పనిసరిగా పూర్తి చేయాల్సిన ముఖ్యమైన గడువుల గురించి తెలుసుకోవడం చాలా అవసరం. ఈ డిసెంబర్ నెలలో మిస్ చేయకూడని అనేక కీలకమైన తేదీలను ఇక్కడ మీ కోసం ‘హిందుస్తాన్ టైమ్స్ తెలుగు’ అందిస్తోంది.
7 December, 2023: డిసెంబర్ 7
నవంబర్ నెలకు సంబంధించి డిడక్టెడ్ లేదా కలెక్టెడ్ ఆదాయ పన్ను చెల్లింపునకు డిసెంబర్ 7వ తేదీ లాస్ట్ డేట్. ప్రభుత్వ కార్యాలయాల్లో ఆదాయ పన్ను చలానా ద్వారా కాకుండా డిడక్ట్ చేసిన లేదా సేకరించిన మొత్తం నగదును డిసెంబర్ 7న ప్రభుత్వానికి చెల్లించాలి.
15 December, 2023: డిసెంబర్ 15
2024-25 ఆర్థిక సంవత్సరం ఆదాయ పన్ను ముందస్తు చెల్లింపు మూడో ఇన్ స్టాల్ మెంట్ నకు ఆఖరు తేదీ డిసెంబర్ 15. అంతేకాదు, ప్రభుత్వ కార్యాలయాలు ఆదాయ పన్ను ఫామ్ 24 జీ (Form 24G) ని సబ్మిట్ చేయడానికి ఆఖరు తేదీ డిసెంబర్ 15. నవంబర్ నెలకు సంబంధించి టీడీఎస్ లేదా టీసీఎస్ ను చలానా లేకుండా చెల్లించి ఉంటే, డిసెంబర్ 15 వ తేదీ లోగా ఫామ్ 24 జీ ని సబ్మిట్ చేయాల్సి ఉంటుంది.
30 December, 2023: డిసెంబర్ 30
సెక్షన్ 194-IB, సెక్షన్ 194M, సెక్షన్ 194-IA, సెక్షన్ 194S సహా వివిధ సెక్షన్ల కింద మినహాయించబడిన పన్ను (deducted tax) కు సంబంధించిన చలాన్-కమ్-స్టేట్‌మెంట్ ను సబ్మిట్ చేయడానికి లాస్ట్ డేట్ డిసెంబర్ 30. డిసెంబర్ 30 లోపు వీటిని సబ్మిట్ చేయనట్లయితే, జరిమానా చెల్లించాల్సి ఉంటుంది.
31 December: డిసెంబర్ 31
అలాగే, 2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తమ ఆదాయపు పన్ను రిటర్న్‌ను ఇంకా దాఖలు చేయని వారు డిసెంబర్ 31 లోపు తమ ఐటీ రిటర్న్స్ ను సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. గతంలో రిటర్న్స్ సబ్మిట్ చేయనివారితో పాటు తమ ఐటీ రిటర్న్స్ లో ఏవైనా మార్పులు చేయాలనుకున్నవారు కూడా ఈ డిసెంబర్ 31 లోగా ఆ పని పూర్తి చేయాల్సి ఉంటుంది.