Hyundai Tucson facelift : ఇదిగో హ్యుందాయ్ టక్సన్ ఫేస్‌లిఫ్ట్..!
21 November 2023, 12:05 IST
- Hyundai Tucson facelift : హ్యుందాయ్ టక్సన్ ఫేస్‌లిఫ్ట్‌ని సంస్థ రివీల్ చేసింది. 2024లో ఈ మోడల్ ఇండియాలో లాంచ్ అవ్వనుంది.
ఇదిగో హ్యుందాయ్ టుక్సన్ ఫేస్‌లిఫ్ట్..!
Hyundai Tucson facelift : హ్యుందాయ్ టక్సన్ ఫేస్‌లిఫ్ట్ వర్షెన్‌ని తాజాగా రివీల్ చేసింది దిగ్గజ ఆటోమొబైల్ సంస్థ. ఇంటీరియర్, ఎక్స్టీరియర్లో స్వల్ప మార్పులు చేసింది. త్వరలోనే ఈ కొత్త ఎస్యూవీ.. అంతర్జాతీయ మార్కెట్లో లాంచ్కానుంది. ఈ నేపథ్యంలో ఈ మోడల్ విశేషాలను ఇక్కడ తెలుసుకుందాము..
హ్యుందాయ్ టక్సన్ ఎస్యూవీ..
సౌత్ కొరియా ఆటోమొబైల్ సంస్థలు.. ఈ మధ్య కాలంలో ఫేస్‌లిఫ్ట్ వర్షెన్లపై దృష్టిపెట్టాయి. వాహనాలకు భారీ మార్పులు చేసి కస్టమర్లను ఆకర్షిస్తున్నాయి. కానీ ఈ హ్యుందాయ్ టక్సన్ ఫేస్‌లిఫ్ట్‌లో పెద్దగా మార్పులు కనిపించకపోవడం గమనార్హం. ఎస్యూవీ ఫ్రెంట్ గ్రిల్‌కి కొత్త డిజైన్ వస్తోంది. పారామెటరిక్ డైనమిక్ డిజైన్ లభిస్తోంది. హెడ్‌ల్యాంప్ క్లస్టర్ని మార్చలేదు. ఎల్ఈడీ డేటైమ్ రన్నింగ్ లైట్స్‌ని స్వల్పగా మార్చింది సంస్థ. కొత్తగా అలాయ్ వీల్స్ వస్తున్నాయి. బంపర్- టెయిల్లైట్స్ని స్వల్పంగా రీ-డిజైన్ చేసింది హ్యుందాయ్.
ఇక ఈ హ్యుందాయ్ టక్సన్ ఫేస్‌లిఫ్ట్ కేబిన్‌లో 3 స్పోక్ స్టీరింగ్ వీల్‌ని రివైజ్ చేసింది సంస్థ. డాష్‌బోర్డ్ కూడా ట్రెడీషనల్గా మారింది. ఇందులో 12.3 ఇంచ్ ఫుల్లీ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, 12.3 ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టెమ్ వంటివి వస్తున్నాయి. స్విచ్‌గేర్‌తో పాటు ఏసీ వెంట్స్‌ని కూడా రీడిజైన్ చేసింది. వయర్లెస్ స్మార్ట్‌ఫోన్ ఛార్జింగ్ డాక్ కొత్తగా వస్తోంది. సెంటర్ కన్సోల్‌లో 2 కప్ హోల్డర్స్ వస్తున్నాయి.
ఇదీ చూడండి:- Hyundai EXTER : హ్యుందాయ్ ఎక్స్టర్ సరికొత్త మైలురాయి.. 4 నెలల్లో లక్ష బుకింగ్స్!
Hyundai Tucson facelift India : ఈ టక్సన్ ఫేస్‌లిఫ్ట్‌కు సంబంధించిన ఇంజిన్ వివరాలను సంస్థ ఇంకా ప్రకటించలేదు. ఇప్పుడున్న మోడల్లోని ఇంజిన్నే.. కొత్త వర్షెన్‌ని కూడా వాడే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి.
హ్యుందాయ్ టక్సన్ ఫేస్‌లిఫ్ట్ ధర ఎంత ఉంటుంది?
Hyundai Tucson facelift price : హ్యుందాయ్ టక్సన్ కొత్త వర్షెన్ లాంచ్ డేట్‌పై క్లారిటీ లేదు. ధరకు సంబంధించిన వివరాలను కూడా సంస్థ ఇంకా ప్రకటించలేదు. కాగా.. హైదరాబాద్‌లో ఈ హ్యుందాయ్ టక్సన్ ప్రారంభ ఎక్స్‌షోరూం ధర రూ. 29.02లక్షలుగా ఉంది. అప్డేటెడ్ వర్షెన్ ధర ఇంకాస్త ఎక్కువే ఉండొచ్చని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.