HT తెలుగు మీకు నోటిఫికేషన్ పంపాలనుకుంటోంది. సబ్‌స్క్రైబ్ చేసుకోవడానికి సరే అని క్లిక్ చేయండి.
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Hyundai: పండుగ సీజన్ సందర్భంగా హ్యుందాయ్ కార్లపై భారీ డిస్కౌంట్స్; ఏ కారుపై ఎంత అంటే..?

Hyundai: పండుగ సీజన్ సందర్భంగా హ్యుందాయ్ కార్లపై భారీ డిస్కౌంట్స్; ఏ కారుపై ఎంత అంటే..?

Sudarshan V HT Telugu

09 October 2024, 18:59 IST

    • పండుగ సీజన్ సందర్భంగా కార్ల అమ్మకాలను పెంచుకోవడానికి తన లైనప్ లోని పలు కార్లపై ఆకర్షణీయమైన డిస్కౌంట్లను హ్యుందాయ్ ప్రకటించింది. హ్యుందాయ్ ఫ్లాగ్ షిప్ మోడళ్లపై డిస్కౌంట్లు ఉన్నాయి. ఏ మోడల్ పై ఎంత డిస్కౌంట్ లభిస్తుందో ఇక్కడ చూడండి.
హ్యుందాయ్ కార్లపై భారీ డిస్కౌంట్స్
హ్యుందాయ్ కార్లపై భారీ డిస్కౌంట్స్

హ్యుందాయ్ కార్లపై భారీ డిస్కౌంట్స్

పండుగ సీజన్ రద్దీని క్యాష్ చేసుకోవడం కోసం ఈ అక్టోబర్ పండుగ నెలలో కొన్ని మోడళ్ల కార్లపై హ్యుందాయ్ డిస్కౌంట్లను ప్రకటించింది. హ్యుందాయ్ కు చెందిన రెండు ఎస్ యూవీలతో సహా నాలుగు మోడళ్ల ధరలను తగ్గించింది, ఇవి ఈ నెలాఖరు వరకు తగ్గింపు ధరలకు లభిస్తాయి. ఎక్స్ టర్, వెన్యూ వంటి ఎస్యూవీలు, ఐ20, గ్రాండ్ ఐ10 నియోస్ వంటి హ్యాచ్ బ్యాక్ మోడళ్లు ఇందులో ఉన్నాయి. హ్యుందాయ్ తన కొన్ని సీఎన్జీ వాహనాలపై కూడా డిస్కౌంట్లను అందిస్తోంది.

పండుగ సీజన్ ఎఫెక్ట్

అమ్మకాలను పెంచుకోవడానికి అన్ని సెగ్మెంట్ల కార్ల తయారీ సంస్థలు పండుగ నెలలో తమ వాహనాలపై భారీ డిస్కౌంట్లను అందిస్తున్నాయి. భారతదేశంలో ప్యాసింజర్ వాహన విభాగంలో వరుసగా మూడవ నెల అమ్మకాలు క్షీణించాయి. ప్రతి సంవత్సరం అమ్మకాలు గరిష్ట స్థాయికి చేరుకునే పండుగ సీజన్ ను సద్వినియోగం చేసుకునేందుకు కార్ల తయారీ సంస్థలు నానా తంటాలు పడుతున్నాయి. ఇందులో భాగంగానే పలు డిస్కౌంట్ (Discounts on cars) ఆఫర్లను ప్రకటిస్తున్నాయి.

తగ్గిన సేల్స్

సెప్టెంబర్ నెలలో హ్యుందాయ్ కార్ల (hyundai cars) అమ్మకాలు ఏడాది ప్రాతిపదికన 10 శాతం క్షీణతను నమోదు చేశాయి. గత నెలలో మొత్తం 64,201 యూనిట్ల హ్యుందాయ్ కార్లు అమ్ముడయ్యాయి. వీటిలో 51,101 యూనిట్లు భారతదేశంలో అమ్ముడయ్యాయి. క్రెటా ఎస్ యూవీ భారతదేశంలో హ్యుందాయ్ నుండి అత్యధికంగా అమ్ముడైన మోడల్ గా కొనసాగుతుండగా, కార్ల తయారీదారు సీఎన్జీ వాహన విభాగంలో 13 శాతానికి పైగా వృద్ధితో ఆరోగ్యకరమైన వృద్ధిని చూసింది. హ్యుందాయ్ సీఎన్జీ లైనప్ లో ఎక్స్టర్, గ్రాండ్ ఐ 10 నియోస్, ఆరా ఉన్నాయి.

ఏ కారుకు ఎంత డిస్కౌంట్

అక్టోబర్ లో ఎంపిక చేసిన మోడళ్లు, వేరియంట్లపై దాదాపు రూ.80,000 వరకు ప్రయోజనాలను హ్యుందాయ్ అందిస్తోంది. వీటిలో వెన్యూ కి అత్యధిక డిస్కౌంట్ లభిస్తుంది. ఈ సీజన్ లో వెన్యూ (VENUE) ను కొనుగోలు చేసినప్పుడు రూ .80,629 ఆదా చేయవచ్చు. అలాగే, రూ.21,628 విలువైన యాక్సెసరీ ప్యాకేజీని కేవలం రూ.6,000కే కొనుగోలు చేయవచ్చు. అలాగే, హ్యుందాయ్ ఎక్స్ టర్ (hyundai exter) పై రూ .42,972 వరకు తగ్గింపు లభిస్తుంది. రూ.5,000 తగ్గింపు ధరతో రూ.17,971 విలువైన యాక్సెసరీ ప్యాకేజీ లభిస్తుంది. హ్యుందాయ్ ఎక్స్ టర్ సీఎన్జీ వెర్షన్ కు కూడా ఈ ప్రయోజనాలు లభిస్తాయి. ఈ నెలలో వెన్యూ తర్వాత గ్రాండ్ ఐ 10 నియోస్ (GRAND I10) హ్యాచ్ బ్యాక్ కొనుగోలుపై ఎక్కువ ప్రయోజనం కలుగుతుంది. హ్యుందాయ్ గ్రాండ్ ఐ 10 నియోస్ పై ఈ నెలలో రూ .58,000 వరకు డిస్కౌంట్ (Discount) లభిస్తుంది. స్టాండర్డ్, ఎన్ లైన్ వెర్షన్లలో లభించే హ్యుందాయ్ (hyundai) ఐ20పై రూ.55,000 వరకు బెనిఫిట్స్ లభిస్తాయి.

తదుపరి వ్యాసం
నోటిఫికేషన్ సెంటర్