తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Hyundai Ioniq 5 Ev Launch: భారత్‍లో హ్యూందాయ్ ఐయానిక్ 5 ఎలక్ట్రిక్ కారు లాంచ్ రేపే..

Hyundai Ioniq 5 EV launch: భారత్‍లో హ్యూందాయ్ ఐయానిక్ 5 ఎలక్ట్రిక్ కారు లాంచ్ రేపే..

21 December 2022, 13:04 IST

google News
    • Hyundai Ioniq 5 Electric Car: హ్యుందాయ్ ఐయానిక్ 5 రేపు ఇండియాలో అడుగుపెట్టనుంది. ఇప్పటికే ఈ ఎలక్ట్రిక్ కారుకు సంబంధించిన చాలా వివరాలు బయటికి వచ్చాయి. ఆకర్షణీయమైన రేంజ్, ఫీచర్లతో వస్తోంది.
Hyundai Ioniq 5 EV launch: భారత్‍లో హ్యూందాయ్ ఐయానిక్ 5 లాంచ్ రేపే
Hyundai Ioniq 5 EV launch: భారత్‍లో హ్యూందాయ్ ఐయానిక్ 5 లాంచ్ రేపే (HT_Auto)

Hyundai Ioniq 5 EV launch: భారత్‍లో హ్యూందాయ్ ఐయానిక్ 5 లాంచ్ రేపే

Hyundai Ioniq 5 Electric Car: హ్యూందాయ్ ఐయానిక్ 5 ఎలక్ట్రిక్ కారు లాంచ్‍కు సిద్ధమైంది. ఈ ఎలక్ట్రిక్ కారు రేపు (డిసెంబర్ 20) భారత మార్కెట్‍లో అడుగుపెట్టనుంది. ఇండియాలో హ్యూందాయ్ విడుదల చేయనున్న రెండో ఎలక్ట్రిక్ కారు ఇది. మరోవైపు ఈ ఐయానిక్ 5 బుకింగ్స్ కూడా రేపే మొదలుకానున్నాయి. ఇప్పటికే గ్లోబల్ మార్కెట్‍లలో లభిస్తున్న ఈ ఐయానిక్ 5 కార్.. ఇప్పుడు ఇండియాకు వస్తోంది. దీంతో హ్యూందాయ్ ఐయానిక్ 5 గురించిన స్పెసిఫికేషన్లతో పాటు చాలా విషయాలు బయటికి వచ్చాయి. ఆ వివరాలు ఇవే.

Hyundai Ioniq 5 Electric Car: బ్యాటరీ, రేంజ్

ఎలక్ట్రిక్ గ్లోబల్ మాడ్యులర్ ప్లాట్‍ఫామ్ అర్కిటెక్చర్ (e-GMP) ఆధారిత రెండు బ్యాటరీ ప్యాక్‍లతో ఈ హ్యూందాయ్ ఐయానిక్ 5 వస్తోంది. 58 kWh బ్యాటరీ ప్యాక్ ఉండే కారు వేరియంట్ 385 కిలోమీటర్ల వరకు రేంజ్‍ను ఇస్తుంది. 72.6 kWh బ్యాటరీ ప్యాక్‍ను కలిగి ఉండే వేరియంట్ 480 కిలోమీటర్ల వరకు రేంజ్‍తో ఉంటుంది. అంటే ఒక్కసారి బ్యాటరీని ఫుల్ చార్జ్ చేస్తే 480 కిలోమీటర్ల వరకు ప్రయాణించవచ్చు. 350 kW డీసీ చార్జర్‌తో ఈ ఎలక్ట్రిక్ కారును చార్జ్ చేసుకోవచ్చు. కేవలం 18 నిమిషాల్లోనే బ్యాటరీ 90 శాతం చార్జ్ అవుతుందని హ్యూందాయ్ తెలిపింది.

Hyundai Ioniq 5 Electric Car: ఆకట్టుకునే ఫీచర్లతో..

12.3 ఇంచుల హెచ్‍డీ టచ్ స్క్రీన్ డిస్‍ప్లే, వైర్లెస్ ఫోన్ చార్జింగ్ సపోర్ట్, హెడ్-అప్ డిస్‍ప్లే, లెదర్ సీట్లు, సన్‍రూఫ్‍ను ఈ హ్యూందాయ్ ఐయానిక్ 5 ఈవీ కలిగి ఉంటుంది. 12.3 ఇంచుల డ్రైవర్ డిస్‍ప్లే కూడా ఉంటుంది.

ఎక్స్‌టీరియర్ విషయానికి వస్తే, ఎల్ఈడీ డేటైమ్ రన్నింగ్ ల్యాంప్‍లతో కూడిన ఎల్ఈడీ హెడ్‍ల్యాంప్స్, ఎల్ఈడీ టైల్ ల్యాంప్‍లతో హ్యూందాయ్ ఐయానిక్ 5 వస్తోంది. 20 ఇంచుల అలాయ్ వీల్స్‌పై ఈ ఎలక్ట్రిక్ కారు రన్ అవుతుంది. కీప్ అసిస్ట్, అటాప్టివ్ క్రూజ్ కంట్రోల్, ఫార్వార్డ్ కొలిజన్ వార్నింగ్, డ్రైవర్ అటెన్షన్ వార్నింగ్‍తో పాటు మరిన్ని ఫీచర్లు ఉండే స్మార్ట్ సెన్సె లెవెల్ 2 ఏడీఏఎస్ ఫంక్షనాలిటీని ఈ కారు కలిగి ఉంది.

Hyundai Ioniq 5 Electric Car: అంచనా ధర

హ్యాండాయ్ ఐయానిక్ 5 ఎలక్ట్రిక్ కారు ధర ఇంకా వెల్లడి కాలేదు. రేపు లాంచ్ అయ్యాక అధికారిక ధర తెలుస్తుంది. అయితే, ఈ ఎలక్ట్రిక్ కారు ప్రారంభ ధర సుమారు రూ.50లక్షలుగా ఉంటుందని అంచనాలు వెలువడ్డాయి. కియా ఈవీ 6, వోల్వో ఎక్స్‌సీ40 రీచార్జ్ మోడళ్లతో ఇది పోటీ పడే అవకాశం ఉంది.

తదుపరి వ్యాసం