iPhone apps: ఐ ఫోన్ లో యాప్స్ కు లొకేషన్ యాక్సెస్ ఇస్తున్నారా?.. జాగ్రత్త..
08 September 2023, 20:30 IST
iPhone apps: మనకు తెలియకుండానే, మన ఫోన్ లోని చాలా యాప్స్ మన లొకేషన్ ను, మన షాపింగ్ ట్రెండ్స్ ను, ఇతర వ్యక్తిగత వివరాలను ట్రాక్ చేస్తుంటాయి. కొన్ని సమయాల్లో అది ప్రమాదకరంగా మారుతుంది.
ప్రతీకాత్మక చిత్రం
iPhone apps: ఐఫోన్ లోని చాలా యాప్స్ లొకేషన్ ను ట్రాక్ చేస్తుంటాయి. సాధారణంగా ఒకేసారి అన్ని యాప్స్ కు లొకేషన్ యాక్సెస్ ఇవ్వడమో లేక, అవసరం వచ్చినప్పుడు వేరువేరు యాప్స్ కు వేరు వేరు సమయాల్లో లొకేషన్ యాక్సెస్ ఇవ్వడమో చేస్తుంటాం. అవసరం తీరిపోయిన తరువాత ఆ యాక్సెస్ డిసెబుల్ చేయడం మర్చిపోతుంటాం.
ప్రైవసీకి ప్రమాదం..
లొకేషన్ ట్రాక్ చేసే కొన్ని యాప్స్ వల్ల కొంతవరకు ప్రైవసీ దెబ్బతింటుంది. ఇతరులకు మన లొకేషన్ తెలియకూడదు అనుకునేవారు తన ఐఫోన్ లో లొకేషన్ యాక్సెస్ ని డిజేబుల్ చేయవచ్చు. ఐఫోన్ లో లొకేషన్ ట్రాక్ చేసే యాప్స్ ను డిసేబుల్ చేయడానికి రెండు మార్గాలు ఉన్నాయి. అవి ఒకటి సింపుల్ గా మొత్తం లోకేషన్ ట్రాక్ ఆప్షన్ ని డిసేబుల్ చేసేయడం. దీని వల్ల లొకేషన్ ట్రాకింగ్ అవసరమైన గూగుల్ మ్యాప్స్ వంటి యాప్స్ ను ఉపయోగించుకోలేము. అందువల్ల ప్రత్యేకంగా ఏ ఏ యాప్స్ మన లొకేషన్ ట్రాక్ చేస్తున్నాయో గుర్తించి వాటిలో అవసరం లేని వాటిని డిసేబుల్ చేయడం మంచిది.
ఇలా చేయండి..
లొకేషన్ ట్రాకింగ్ ను డిసేబుల్ చేయడానికి ఐ ఫోన్ లో రెండు మార్గాలు ఉంటాయి.. అవి
ఒకటవ విధానం..
- మొదట ఐఫోన్ సెట్టింగ్స్ లోకి వెళ్ళాలి
- అనంతరం ప్రైవసీ అండ్ సెక్యూరిటీ ని ఓపెన్ చేయాలి
- అక్కడ లొకేషన్స్ సర్వీసెస్ ని వెతకాలి
- ఆ లొకేషన్స్ సర్వీసెస్ పక్కనే గ్రీన్ మార్క్ కనిపిస్తుంది
- దానిని డిజేబుల్ చేయాలి.
- ఇలా చేయడం వల్ల మీ ఐ ఫోన్ లోని ఏ యాప్ కు కూడా లొకేషన్ ట్రాక్ చేయడానికి యాక్సెస్ లభించదు.
- గూగుల్ మ్యాప్స్ లాంటి అవసరమైన ఆప్స్ ను ఉపయోగించలేము
రెండో విధానం..
ఈ విధానం ద్వారా మన ఐ ఫోన్ లో లొకేషన్ ను ట్రాక్ చేస్తున్న యాప్స్ ను ఎంపిక చేసుకుని డిసేబుల్ చేసుకోవచ్చు.
- మొదట ఐఫోన్ సెట్టింగ్స్ లోకి వెళ్ళాలి
- అనంతరం ప్రైవసీ అండ్ సెక్యూరిటీ ని ఓపెన్ చేయాలి
- అక్కడ లొకేషన్స్ సర్వీసెస్ ని వెతకాలి
- అక్కడ మీ ఫోన్ లోని యాప్స్ లిస్ట్ కనిపిస్తుంది. పక్కనే అవి ఇనేబుల్ అయి ఉన్నాయా? లేక డిసేబుల్ అయి ఉన్నాయా? అనే విషయం తెలుస్తుంది.
- వాటిలో మనకు అవసరం లేని లేదా లొకేషన్ ట్రాక్ చేయడం ప్రమాదకరమని భావించిన యాప్స్ కు లొకేషన్ యాక్సిస్ ని డిసేబుల్ చేయవచ్చు.