Repair iPhone from Water Damage : మీ ఐఫోన్ నీటిలో పడిందా? బియ్యం బస్తాలో పెడితే మాత్రం ప్రమాదమే!
01 September 2024, 13:40 IST
iPhone water damage tips : మీ ఐఫోన్లో నీటిలో పడిపోయిందా? తీసుకెళ్లి బియ్యం బస్తాలో పెట్టారా? అది చాలా ప్రమాదకరం! ఈ విషయాన్ని స్వయంగా యాపిల్ సంస్థ వెల్లడించింది. మరి ఐఫోన్ నీటిలో పడితే ఏం చేయాలి? ఇక్కడ తెలుసుకోండి..
ఐఫోన్ నీటిలో పడితే ఏం చేయలి?
‘ఐఫోన్ కొనాలంటే కిడ్నీలు అమ్ముకోవాలి,’ వంటి మీమ్స్ ఎక్కువగాw వినిపిస్తుంటాయి. ఎందుకంటే యాపిల్ తయారు చేసే ఐఫోన్స్ చాలా ఖరీదైనవి. ఐఫోన్స్ మాత్రమే కాదు, వాటి రిపేర్- సర్వీస్‌లు కూడా భారీ ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. అందుకే ఈ స్మార్ట్‌ఫోన్స్‌ని చాలా భద్రంగా చూసుకోవాలి. కానీ ఒక్కోసారి ఎంత భద్రంగా చూసుకున్నా, ఐఫోన్స్ కిందపడటం జరగొచ్చు. మరీ ముఖ్యంగా చాలా మంది తమ స్మార్ట్‌ఫోన్స్‌ని నీటిలో పడేసుకుంటారు. ఆ తర్వాత బాధపడుతుంటారు. "ఐఫోన్ నీటిలో పడితే ఏం చేయాలి?" అని ఆన్లైన్లో సెర్చ్ చేసి, బియ్యం బస్తాలో పెడుతుంటారు. కానీ ఇది చాలా ప్రమాదకరం! ఇలా చేస్తే.. మీరు మీ ఫోన్‌కి మరింత హాని కలిగించినట్టు అవుతుందని మీకు తెలుసా?
ఐఫోన్ నీటిలో పడిపోతే ఏమి చేయాలి?
ముందుగా ఆన్లైన్లో టిప్స్ సూచించినట్టు బియ్యం బస్తాలో ఐఫోన్‌ని వేయకూడదు. తడిసిన ఐఫోన్‌ని బియ్యంలో ఉంచవద్దని యాపిల్ సంస్థ స్వయంగా తన వినియోగదారులకు అధికారికంగా సూచించింది. "అలా చేయడం వల్ల చిన్న బియ్యం కణాలు (రైస్ పార్టికల్స్) మీ ఐఫోన్‌ని దెబ్బతీస్తాయి," అని యాపిల్ వివరించింది.
మీరు అనుకోకుండా మీ ఐఫోన్‌ని నీటిలో పడేస్తే చేయాల్సినవి, చేయకూడనివి ఈ కింద తెలుసుకోండి..
ఇలా చేయండి (డూస్)..,
- మీ ఐఫోన్‌ను కనెక్టర్‌తో మీ చేతికి సున్నితంగా నొక్కండి. తద్వారా లోపల ఉన్న అదనపు నీరు ఖాళీ అవుతుంది.
- తరువాత పొడి ప్రదేశంలో వదిలేయండి.
- కనీసం 30 నిమిషాల తర్వాత, స్మార్ట్‌ఫోన్‌ని ఛార్జ్ చేయడానికి లేదా యాక్ససరీని కనెక్ట్ చేయడానికి ప్రయత్నించండి. అలర్ట్ మళ్లీ ఆన్ అయితే, కనెక్టర్‌లో, పిన్స్ కింద లేదా కేబుల్లో నీరు ఉందని అర్థం. మళ్లీ ప్రయత్నించే ముందు, కనీసం ఒక రోజు పొడి ప్రదేశంలో ఉంచండి.
ఇలా చేయకండి (డోన్ట్)..
- బాహ్య వనరును ఉపయోగించి లేదా కంప్రెస్డ్ గాలిని ఉపయోగించడం ద్వారా మీ ఐఫోన్‌ని ఎండబెట్టడానికి ప్రయత్నించవద్దు.
- కాటన్ స్వాబ్ లేదా పేపర్ టవల్ వంటి వస్తువులను కనెక్టర్లోకి చొప్పించవద్దు.
- ఫోన్ ఎండిపోయిందని నిర్ధారించుకునే వరకు ఛార్జింగ్ కేబుల్ లేదా ఏదైనా యాక్సెసరీని ప్లగ్ చేయవద్దు.
- మొదట్లో చెప్పినట్లు బియ్యం బస్తాలో వేయకూడదు.
ఈ యాపిల్ ప్రాడక్ట్స్‌కి గుడ్ బై..?
2024 మచ్ అవైటెడ్ స్మార్ట్‌ఫోన్స్ లాంచ్‌లో యాపిల్ ఐఫోన్ 16 సిరీస్ ఒకటి. సెప్టెంబర్ 9న జరగనున్న ఈవెంట్లో కొత్త ఐఫోన్లు, ఎయిర్‌పాడ్స్, యాపిల్ వాచ్‌లను సంస్థ లాంచ్ చేసే అవకాశం ఉంది. అయితే ఈ ఈవెంట్ తర్వాత, ఇప్పటికే ఉన్న అనేక యాపిల్ ప్రాడెక్ట్స్కి సంస్థ గుడ్‌బై చెబుతుందని వార్తలు వినిపిస్తున్నాయి. మరీ ముఖ్యంగా గతేడాది లాంచ్ అయిన యాపిల్ ఐఫోన్ 15 సిరీస్‌లోని కొన్ని మోడల్స్‌ని సంస్థ డిస్కంటిన్యూ చేస్తుందని సమాచారం. సెప్టెంబర్‌లో కొత్త గ్యాడ్జెట్స్ లాంచ్ తరువాత యాపిల్ అధికారిక స్టోర్ నుంచి నిలిచిపోయే పరికరాల జాబితా ఇక్కడ ఉంది..
సంస్థ నుంచి వచ్చిన తొలి టిటానియం కేస్ మోడల్స్ ఐఫోన్ 15 ప్రో, ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్ మోడళ్లను యాపిల్ వదులుకోవచ్చని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ మోడళ్లు 6.1-ఇంచ్, 6.7-ఇంచ్ డిస్ప్లేలతో చివరి ప్రో వర్షెన్లు కావచ్చు. ఎందుకంటే భవిష్యత్తు ప్రో మోడళ్లు మరింత పెద్ద స్క్రీన్లను కలిగి ఉండవచ్చు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.