Apple iPhone : ఐఫోన్ 15 ప్రోకి యాపిల్ గుడ్ బై! ఈ బెస్ట్ సెల్లింగ్ ప్రాడెక్ట్స్ కూడా డిస్కంటిన్యూ..!
Apple 15 pro discontinuation : ఐఫోన్ 16 సిరీస్, ఇతర కొత్త డివైజ్లను ప్రవేశపెట్టడానికి యాపిల్ రెడీ అవుతోంది. ఈ నేపథ్యంలో 10కిపైగా బెస్ట్ సెల్లింగ్ ప్రాడెక్ట్స్‌ని డిస్కంటిన్యూ చేసేందుకు సంస్థ ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది!
2024 మచ్ అవైటెడ్ స్మార్ట్‌ఫోన్స్ లాంచ్‌లో యాపిల్ ఐఫోన్ 16 సిరీస్ ఒకటి. సెప్టెంబర్ 9న జరగనున్న ఈవెంట్లో కొత్త ఐఫోన్లు, ఎయిర్‌పాడ్స్, యాపిల్ వాచ్‌లను సంస్థ లాంచ్ చేసే అవకాశం ఉంది. అయితే ఈ ఈవెంట్ తర్వాత, ఇప్పటికే ఉన్న అనేక యాపిల్ ప్రాడెక్ట్స్కి సంస్థ గుడ్‌బై చెబుతుందని వార్తలు వినిపిస్తున్నాయి. మరీ ముఖ్యంగా గతేడాది లాంచ్ అయిన యాపిల్ ఐఫోన్ 15 సిరీస్‌లోని కొన్ని మోడల్స్‌ని సంస్థ డిస్కంటిన్యూ చేస్తుందని సమాచారం. సెప్టెంబర్‌లో కొత్త గ్యాడ్జెట్స్ లాంచ్ తరువాత యాపిల్ అధికారిక స్టోర్ నుంచి నిలిచిపోయే పరికరాల జాబితా ఇక్కడ ఉంది..
ఈ యాపిల్ ప్రాడక్ట్స్ డిస్కంటిన్యూ..!
1. సంస్థ నుంచి వచ్చిన తొలి టిటానియం కేస్ మోడల్స్ ఐఫోన్ 15 ప్రో, ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్ మోడళ్లను యాపిల్ వదులుకోవచ్చని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ మోడళ్లు 6.1-ఇంచ్, 6.7-ఇంచ్ డిస్ప్లేలతో చివరి ప్రో వర్షెన్లు కావచ్చు. ఎందుకంటే భవిష్యత్తు ప్రో మోడళ్లు మరింత పెద్ద స్క్రీన్లను కలిగి ఉండవచ్చు.
2. ఐఫోన్ 14 ప్లస్: 2022లో ప్రవేశపెట్టిన ఐఫోన్ 14 ప్లస్ కొత్త ఐఫోన్ల అరంగేట్రం తర్వాత నిలిచిపోయే అవకాశం ఉంది. ఐఫోన్ 13 ప్లస్ వంటి మునుపటి 'ప్లస్' మోడళ్లను లైనప్ నుంచి తొలగించే యాపిల్ సంప్రదాయ పద్ధతికి ఈ చర్య అనుగుణంగా ఉంటుంది. అయితే, స్టాండర్డ్ ఐఫోన్ 14 అందుబాటులో ఉండవచ్చు.
3. ఐఫోన్ 13: 2021 నుంచి అందుబాటులో ఉన్న ఐఫోన్ 13ను ఐఫోన్ 16 లాంచ్ తర్వాత నిలిపివేసే అవకాశం ఉంది. ప్రస్తుతం యాపిల్ అందిస్తున్న పురాతన ఐఫోన్ ఇదే కావడంతో, దీని తొలగింపు తరువాత ఐఫోన్ ఎస్ఈ4 విడుదలయ్యే వరకు ఐఫోన్ 14 లభ్యత కొనసాగే అవకాశం ఉంది.
4. యాపిల్ తన 10 సంవత్సరాల వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని సిరీస్ 10 ను విడుదల చేయడానికి సిద్ధమవుతున్నందున, యాపిల్ వాచ్ సిరీస్ 9, యాపిల్ వాచ్ అల్ట్రా 2, యాపిల్ వాచ్ ఎస్ఈ 2 మోడళ్లను నిలిపివేయవచ్చు. ఇది యాపిల్ వాచ్ సిరీస్ 10, యాపిల్ వాచ్ అల్ట్రా 3, యాపిల్ వాచ్ ఎస్ఈ 3 లను ప్రవేశపెట్టడానికి అనుమతిస్తుంది.
5. యాపిల్ ఎయిర్‌పాడ్స్ 2, ఎయిర్‌పాడ్స్ 3: 2019లో ప్రవేశపెట్టిన ఎయిర్‌పాడ్స్ 2, 2021లో విడుదలైన ఎయిర్‌పాడ్స్ 3లను దశలవారీగా రద్దు చేసే అవకాశం ఉంది. యాపిల్ రెండు కొత్త ఎయిర్‌పాడ్ మోడళ్లను విడుదల చేస్తుందని పుకార్లు ఉన్నాయి. అవి.. ఎంట్రీ లెవల్, మిడ్-టైర్. ఫలితంగ ఈ పాత వెర్షన్లను నిలిపివేసే అవకాశం ఉంది.
6. ఐప్యాడ్ 10- ఐప్యాడ్ మినీ 6: ఐప్యాడ్ 10, ఐప్యాడ్ మినీ 6 స్థానంలో యాపిల్ సెప్టెంబర్‌లో కొత్త ఐప్యాడ్లను ప్రవేశపెట్టే అవకాశం ఉంది. ఈ కొత్త మోడళ్లు లాంచ్ అయితే ప్రస్తుత వెర్షన్లను నిలిపివేసి కొత్త ఎంట్రీ లెవల్, మినీ టాబ్లెట్లకు మార్గం సుగమం చేసే అవకాశం ఉంది.
ఇవి ప్రస్తుతం ఊహాగానాలు మాత్రమే. దీనిపై సంస్థ అధికారికంగా ప్రకటన చేయాల్సి ఉంది. ఒకవేళ యాపిల్ ప్రాడక్ట్స్ నిలిచిపోయినా, అవి థర్డ్ పార్టీ రిటైలర్లు మరియు ఆన్లైన్ స్టోర్ల ద్వారా అందుబాటులో ఉండవచ్చని గుర్తుపెట్టుకోవాలి.
సంబంధిత కథనం