iPhone 15 pro feature : ఐఫోన్​ 15 ప్రో మోడల్స్​లో ఉన్న 3 బెస్ట్​ ఫీచర్స్​ ఇవే..!-iphone 15 pro iphone 15 pro max see these 3 best new features ,బిజినెస్ న్యూస్
Telugu News  /  Business  /  Iphone 15 Pro, Iphone 15 Pro Max: See These 3 Best New Features

iPhone 15 pro feature : ఐఫోన్​ 15 ప్రో మోడల్స్​లో ఉన్న 3 బెస్ట్​ ఫీచర్స్​ ఇవే..!

ఐఫోన్​ 15 ప్రో మోడల్స్​లో ఉన్న 3 బెస్ట్​ ఫీచర్స్​ ఇవే..!
ఐఫోన్​ 15 ప్రో మోడల్స్​లో ఉన్న 3 బెస్ట్​ ఫీచర్స్​ ఇవే..! (REUTERS)

iPhone 15 pro features : ఐఫోన్​ 15 ప్రో, ప్రో మ్యాక్స్​ మోడల్స్​.. కస్టమర్లను ఆకర్షిస్తున్నాయి. ఈ గ్యాడ్జెట్స్​లోని 3 బెస్ట్​ ఫీచర్స్​ వివరాలు ఇవే..

iPhone 15 pro features : టెక్​ ప్రపంచంలో ఇప్పుడు టాపిక్​ అంతా ఐఫోన్​ 15 సిరీస్​ గురించే! మరీ ముఖ్యంగా.. ప్రో మోడల్స్​కు కస్టమర్ల నుంచి విశేష స్పందన లభిస్తోంది. ఈ నేపథయ్యంలో ఐఫోన్​ 15 ప్రో, ఐఫోన్​ 15 ప్రో మ్యాక్స్​లో లభిస్తున్న 3 బెస్ట్​ ఫీచర్స్​ వివరాలను ఇక్కడ తెలుసుకుందాము..

ట్రెండింగ్ వార్తలు

యాక్షన్​ బటన్​..

ఐఫోన్​ 15 ప్రో, ప్రో మ్యాక్స్​ మోడల్​లో ట్రెడీషనల్​ మ్యూట్​ స్విచ్​కు గుడ్​ బై చెప్పేసింది యాపిల్​ సంస్థ. దీని స్థానంలో యాక్షన్​ బటన్​ వచ్చింది. ఫోన్​ సైలెన్స్​ చేయడమే కాకుండా.. ఈ బటన్​తో ఇతర ఉపయోగాలు కూడా ఉన్నాయి. ఫోకస్​ మోడ్​, కెమెరా లాంచ్​, ఫ్లాష్​లైట్​, వాయిస్​ మెమో, టెక్స్ట్​ ట్రాన్స్​లేషన్​, మాగ్నిఫయర్​ వంటి వాటిని ఈ యాక్షన్​ బటన్​తో స్టార్ట్​ చేయవచ్చు.

యూఎస్​బీ-సీ..

Best features of iPhone 15 : ఐఫోన్​ 15, ఐఫోన్​ 15 ప్లస్​, ఐఫోన్​ 15 ప్రో, ఐఫోన్​ 15 ప్రో మ్యాక్స్​కు యూఎస్​బీ-టైప్​ సీ పోర్ట్​ లభిస్తోంది. ఇంతకాలం లైటెనింగ్​ కనెక్టర్​ ఉండేది. టెక్​ ప్రపంచంలో టైప్​ సీ పోర్ట్​నే చాలా మంది వినియోగిస్తున్నారు. ఇప్పుడు ఐఫోన్​ కూడా ఇందులో చేరింది.

ఇదీ చూడండి:- iPhone 15 vs Google Pixel 7 : ఐఫోన్​ 15 వర్సెస్​ గూగుల్​ పిక్సెల్​ 7.. ఏది బెస్ట్​?

సూపర్​ జూమ్​..

ఐఫోన్​ 15 ప్రో మ్యాక్స్​లో లభించే 5ఎక్స్​ ఆప్టికల్​ జూమ్​.. హైలైట్​ అని చెప్పుకోవాలి. డిజిటల్​ జూమ్​ కన్నా ఇది చాలా రెట్లు బెస్ట్​ అని టెక్క్​ వర్గాలు చెబుతున్నాయి. దీన్ని వాడి అద్భుతమైన డీటైలింగ్​తో ఫొటోలు తీసుకోవచ్చు. ఇలాంటి ఫీచర్స్​ ఉండటంతో ఐఫోన్​ 15 ప్రో మ్యాక్స్​ ధర ఇంకాస్త పెరిగింది.

ఐఫోన్​ 15 సిరీస్​ ధరల వివరాలు..

iPhone 15 pro max price in India : ఇండియాలో ఐఫోన్ 15 128 జీబీ వేరియంట్ ధర రూ. 79,900 గా ఉంది. అలాగే ఐఫోన్ 15 ప్లస్ ధర రూ. 89,900 గా ఉంది. ఈ రెండు ఫోన్లు కూడా 128 జీబీ, 256జీబీ, 512 జీబీ స్టోరేజ్ ఆప్షన్స్​తో వస్తున్నాయి. ఎక్కువ స్టోరేజ్ ఫెసిలిటీ ఉన్న ఫోన్ ధర కొంత ఎక్కువ ఉంటుంది. ఇండియాలో ఐఫోన్ 15 ప్రో (128 జీబీ వేరియంట్) ధర రూ. 1,34,900గా ఉంది. ఐఫోన్ 15 ప్రోలో 128 జీబీ, 256జీబీ, 512 జీబీ స్టోరేజ్ ఆప్షన్స్​తో పాటు 1 టీబీ స్టోరేజ్ ఫెసిలిటీ కూడా ఉంది. ఐఫోన్ 15 ప్రో మాక్స్ ధర గణనీయంగా పెరిగింది. ఐఫోన్ 15 ప్రో మాక్స్ ధర రూ. 1,59,900 (256జీబీ స్టోరేజ్ వేరియంట్)గా ఉంది. ఐఫోన్ 15 ప్రో మాక్స్ లో 128 జీబీ స్టోరేజ్ ఫెసిలిటీ లేదు. ఇది కేవలం 256జీబీ, 512 జీబీ, 1 టీబీ స్టోరేజ్ ఆప్షన్స్​లోనే లభిస్తుంది.

WhatsApp channel

సంబంధిత కథనం