Apple event 2023 : యాపిల్ లవర్స్ గెట్ రెడీ- మెగా ఈవెంట్ నేడే.. ఐఫోన్ 15 వచ్చేస్తోంది!
Apple event 2023 : 'యాపిల్' లవర్స్ ఎంతగానో ఎదురుచూసే మెగా ఈవెంట్‌కు సమయం ఆసన్నమైంది. నేడు యాపిల్ వండర్లస్ట్ ఈవెంట్ జరగనుంది. పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి.
Apple event 2023 live : యాపిల్ మెగా ఈవెంట్‌కు సమయం ఆసన్నమైంది. ఐఫోన్ 15 సిరీస్.. మరికొన్ని గంటల్లో లాంచ్కానుంది. ఐఫోన్‌తో పాటు ఇతర గ్యాడ్జెట్స్‌ను సంస్థ ప్రకటించనుంది. ఈ నేపథ్యంలో ఈ యాపిల్ 'వండర్లస్ట్' 2023 ఈవెంట్ పూర్తి వివరాలను ఇక్కడ తెలుసుకుందాము..
ట్రెండింగ్ వార్తలు
యాపిల్ ఈవెంట్ టైమింగ్స్ ఇవే..
కొవిడ్ కారణంగా గత కొన్నేళ్లు ఈ యాపిల్ ఈవెంట్ ఆన్లైన్ మోడ్‌లో జరిగింది. కానీ ఈసారి డైరక్ట్‌గా ఈవెంట్‌ను నిర్వహించాలని నిర్ణయించుకుంది సంస్థ. ఇందుకోసం కాలిఫోర్నియాలోని స్టీవ్ జాబ్స్ థియేటర్‌ను సిద్ధం చేసింది.
యాపిల్ సంస్థ అధికారిక ప్రకటన ప్రకారం ఈ వండర్లస్ట్ ఈవెంట్.. కాలిఫోర్నియాలో ఉదయం 10 గంటలకు ప్రారంభమవుతుంది. భారత కాలమానం ప్రకారం అయితే.. రాత్రి 10:30 గంటలకు మొదలవుతుంది. సంస్థ అధికారిక వెబ్సైట్, యూట్యూబ్ ఛానెల్లో ఈ ఈవెంట్ లైవ్‌స్ట్రీమింగ్ చూడవచ్చు.
ఏవేవి లాంచ్ అవుతాయి?
Apple Wonderlust event 2023 : ఈ యాపిల్ వండర్లస్ట్ ఈవెంట్లో లాంచ్ చేసే ప్రాడక్ట్స్ వివరాలను సంస్థ ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. కానీ.. ఇందులో ఐఫోన్ 15, ఐఫోన్ 15 ప్లస్, ఐఫన్ 15 ప్రో, ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్ మోడల్స్ బయటకి వస్తాయని మార్కెట్లో అంచనాలు ఉన్నాయి. వీటితో పాటు యాపిల్ వాచ్ 9 సిరీస్, యాపిల్ వాచ్ 2 అల్ట్రా, యాపిల్ ఎయిర్‌పాడ్స్ వంటి ప్రాడక్ట్స్ కూడా ప్రజల ముందుకు వస్తాయని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి.
మరోవైపు ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్ లాంచ్ ఆలస్యమయ్యే అవకాశం ఉందని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. సప్లై చెయిన్ వ్యవస్థలో ఇబ్బందులు తలెత్తడమే ఇందుకు కారణమని సమాచారం. ఇదే నిజమైనా.. యాపిల్ ఈవెంట్‌పై ఎలాంటి ప్రభావం చూపించదు. అదే సమయంలో.. ధరకు సంబంధించిన వివరాలు ఆన్లైన్లో కనిపించాయి. ఈ గ్యాడ్జెట్ ధర 1199- 1299 డాలర్ల మధ్యలో ఉండొచ్చని టాక్ నడుస్తోంది. గతంలో ప్రో మ్యాక్స్‌లో 128జీబీ స్టోరేజ్ అనేది బేస్ వేరియంట్‌గా ఉండేది. ఇప్పుడది 256జీబీకి పెరిగుతుందని సమాచారం. దీనిపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.
ఇదీ చూడండి:- iPhone 15 ultra : యాపిల్ ఈవెంట్‌కు ముందు.. 'ఐఫోన్ 15 అల్ట్రా'పై కీలక అప్డేట్!
అంతర్జాతీయంగా ఐఫోన్ గ్యాడ్జెట్స్ లాంచ్ అయిన చాలా రోజులకు.. అవి ఇండియాలోకి వచ్చేవి. అయితే ఈసారి.. ఇండియాతో పాటు అంతర్జాతీయ మార్కెట్లో ఏకకాలంలో డెలివరీలు చేయాలని సంస్థ భావిస్తున్నట్టు సమాచారం. యాపిల్ సంస్థ.. ఇప్పటికే ముంబైలో ఓ స్టోర్ ఓపెన్ చేసిన విషయం తెలిసిందే.
ఐఫోన్ 16 సిరీస్‌పై అప్డేట్ ఉంటుందా?
iPhone 15 series launch : సాధారణంగా యాపిల్ ఈవెంట్ వస్తోందంటే.. అప్పుడు లాంచ్ చేసే ఐఫోన్ సిరీస్‌తో పాటు ఆ తర్వాత వచ్చే సిరీస్‌పైనా ఆసక్తి ఉంటుంది. ఈ క్రమంలో ఇప్పుడు ఐఫోన్ 16 సిరీస్‌పైనా బజ్ నెలకొంది. దీనిపై ఈ వండర్లస్ట్ ఈవెంట్లో సంస్థ ఏదైనా ప్రకటన చేస్తుందా? అని యాపిల్ లవర్స్‌లో ఆసక్తి పెరిగింది.
ఐఫోన్ 16 ప్రోలో 6.3 ఇంచ్, ఐఫోన్ 16 ప్రో మ్యాక్స్‌లో 6.9 ఇంచ్ డిస్ప్లేలు ఉంటాయని రూమర్స్ వస్తున్నాయి. ప్రో మోడల్లో ఏ18 బయానిక్ చిప్సెట్ ఉంటుందని సమాచారం. ఇందులో 48ఎంపీ ప్రైమరీ, 12ఎంపీ అల్ట్రావైడ్ కెమెరా ఉండొచ్చని టాక్ నడుస్తోంది.
ఐఫోన్ 14 సిరీస్.. గతేడాది ఇదే టైమ్‌లో లాంచ్ అయ్యింది. అప్పటి నుంచి ఐఫోన్ 15 సిరీస్‌పై విపరీతమైన రూమర్స్ నడిచాయి. ఈ సిరీస్‌లో ఆ ఫీచర్ ఉంటుంది, ఈ మార్పులు ఉంటాయని.. తెగ వార్తలు వచ్చాయి. వీటిలో ఎంత నిజం ఉందనేది.. ఇంకొన్ని గంటల్లో తేలిపోనుంది!
సంబంధిత కథనం