iPhone 15 ultra : యాపిల్ ఈవెంట్‌కు ముందు.. 'ఐఫోన్ 15 అల్ట్రా'పై కీలక అప్డేట్!
iPhone 15 ultra : ఇంకొన్ని రోజుల్లో యాపిల్ ఈవెంట్ జరగనుంది. ఈ నేపథ్యంలో ఐఫోన్ 15 అల్ట్రాపై ఓ వార్త బయటకి వచ్చింది. ఈ మోడల్ అసలు ఉండకపోవచ్చని టాక్ నడుస్తోంది.
iPhone 15 ultra : ఐఫోన్ 15 సిరీస్ లాంచ్‌కు ఇంకొన్ని రోజులు మాత్రమే ఉంది. ఈ నెల 12న జరగనున్న యాపిల్ ఈవెంట్లో ఈ సిరీస్ బయటకు రానుంది. ఈ నేపథ్యంలో ఐఫోన్ 15 అల్ట్రాకు సంబంధించి ఓ వార్త బయటకి వచ్చింది. ఈ గ్యాడ్జెట్‌ను సంస్థ లాంచ్ చేయకపోవచ్చని పలు నివేదికలు సూచిస్తున్నాయి.
లాంచ్ ఉండదా..?
గతేడాది ఐఫోన్ 14 సిరీస్ లాంచ్ అయినప్పటి నుంచి ఐఫోన్ 15 సిరీస్‌పై బజ్ నెలకొంది. ముఖ్యంగా ఐఫోన్ 15 అల్ట్రా పేరుతో ఓ మెడల్ బయటకు వస్తుందని టెక్ వర్గాల్లో టాక్ నడిచింది. ఫీచర్స్ ఇవే, ధర ఇదేనంటూ రూమర్స్ కూడా వచ్చాయి. ‘ప్రో మ్యాక్స్’ పేరును అల్ట్రాగా మార్చే అవకాశం ఉందని రూమర్స్ వచ్చాయి. కానీ.. 'ప్రో మ్యాక్స్'నే టాప్ ఎండ్ మోడల్‌గా కొనసాగించేందుకు యాపిల్ సంస్థ మొగ్గుచూపుతోందని నివేదికలు చెబుతున్నాయి.
మరికొన్ని రోజుల్లో జరగనున్న యాపిల్ ఈవెంట్లో లాంచ్ అవుతున్న ఐఫోన్ 15, ఐఫోన్ 15 ప్లస్ మోడల్స్ బేస్ వేరియంట్లుగా ఉండనున్నాయి. వీటికి అల్యుమీనియం సైడ్స్, గ్లాస్ బ్యాక్ వంటివి వస్తాయి. వీటి డిజైన్.. ఐఫోన్ 14 మోడల్స్‌నే పోలి ఉంటాయని తెలుస్తోంది. కానీ వైడ్ టచ్ బదులు డైనమిక్ ఐల్యాండ్ పావొచ్చు.
iPhone 15 ultra price : ఇక హై ఎండ్ మోడల్స్ ఐఫోన్ 15 ప్రో, 15 ప్రో మ్యాక్స్‌లో సరికొత్త టిటానియం సైడ్స్ ఉండొచ్చు. టిటానియం సైడ్స్‌తో గ్యాడ్జెట్స్ డ్యూరెబిలిటీ పెరుగుతుందని తెలుస్తోంది. మరింత ప్రీమియం లుక్, ఫీల్ కూడా వస్తుంది. మ్యూట్ స్విచ్ ప్లేస్‌లో 'యాక్షన్' బటన్ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీనితో బేస్- ప్రీమియం మోడల్స్‌లో ఏది కొనాలి? అని ఆలోచించే కస్టమర్లకు కచ్చితమైన సమాధానం లభిస్తుందని సంస్థ భావిస్తోంది.
ఇదీ చూడండి:- iPhone 15 launch: ఈ ఒక్క కారణం వల్లనే 63 శాతం ఐ ఫోన్ యూజర్లు కొత్త ఫోన్ కొనాలని అనుకుంటున్నారట..
యాపిల్ ఈవెంట్ డైట్, టైమింగ్స్..
యాపిల్ ఈవెంట్.. భారత కాలమానం ప్రకారం సెప్టెంబర్ 12 రాత్రి 10:30 గంటలకు మొదలవుతుంది. యాపిల్ లవర్స్.. ఈ ఈవెంట్‌ను లైవ్ స్ట్రీమింగ్ ద్వారా చూడవచ్చు.
iPhone 15 series launch date and time : ఇక ఈసారి.. లాంచ్ అవుతున్న ఐఫోన్ 15 ప్రో, 15 ప్రో మ్యాక్స్‌లో 120హెచ్‌జెడ్‌తో కూడిన ప్రోమోషన్ ఎల్టీపీఓ ఓఎల్ఈడీ డిస్ప్లే ఉంటుందని తెలుస్తోంది. 3ఎన్ఎం ఏ17 బయోనిక్ చిప్సెట్తో పాటు 8జీబీ ర్యామ్- 2టీబీ స్టోరేజ్ ఉండొచ్చు. 3,650ఎంఏహెచ్- 4,852ఎంఏహెచ్ బ్యాటరీ సెటప్ ఉంటాయని టాక్.
ప్రస్తుతం ఇవన్నీ లీక్స్ మాత్రమే. వీటిని సంస్థ అధికారికంగా ధ్రువీకరించలేదు. లాంచ్ టైమ్‌లో ఐఫోన్ 15 సిరీస్‌తో పాటు 15 సిరీస్ అల్ట్రాపైనా ఓ క్లారిటీ వస్తుంది.
సంబంధిత కథనం