తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Instagram : లైఫ్​ని మీ కంట్రోల్​లోకి తీసుకోండి- ఇన్​స్టాగ్రామ్​ అకౌంట్​ని ఇలా శాశ్వతంగా డిలీట్​ చేయండి..

Instagram : లైఫ్​ని మీ కంట్రోల్​లోకి తీసుకోండి- ఇన్​స్టాగ్రామ్​ అకౌంట్​ని ఇలా శాశ్వతంగా డిలీట్​ చేయండి..

Sharath Chitturi HT Telugu

28 October 2024, 10:20 IST

google News
    • Delete instagram account permanently : ఇన్​స్టాగ్రామ్​లో మైండ్​లెస్​ స్క్రోలింగ్​ నుంచి విముక్తి పొందాలని చూస్తున్నారా? మీ లైఫ్​ని మీ కంట్రోల్​లో తెచ్చుకునేందుకు మీ ఇన్​స్టాగ్రామ్​ అకౌంట్​ని శాశ్వతంగా ఎలా డిలీట్​ చేయాలో ఇక్కడ తెలుసుకోండి..
మీ ఇన్​స్టాగ్రామ్​ అకౌంట్​ని శాశ్వతంగా డిలీట్​ చేయండి ఇలా..
మీ ఇన్​స్టాగ్రామ్​ అకౌంట్​ని శాశ్వతంగా డిలీట్​ చేయండి ఇలా..

మీ ఇన్​స్టాగ్రామ్​ అకౌంట్​ని శాశ్వతంగా డిలీట్​ చేయండి ఇలా..

సోషల్​ మీడియాని ఎక్కువగా వినియోగించి, సమయాన్ని వృథా చేసుకుంటున్నారా? మరీ ముఖ్యంగా గంటలు, గంటలు ఇన్​స్టా రీల్స్​ చూస్తూ చివరికి 'గిల్టీ' ఫీల్​ అవుతున్నారా? అయితే మీరు మీ లైఫ్​ని కంట్రోల్​లోకి తీసుకెవాల్సిన సమయం వచ్చింది. ఇన్​స్టాగ్రామ్​ని శాశ్వతంగా డిలీట్​ చేయడం లేదా అకౌంట్​ని డీయాక్టివేట్ చేయడం​ ఎలాగో ఇక్కడ తెలుసుకోండి..

ఇన్​స్టాగ్రామ్​ అకౌంట్​ని శాశ్వతంగా డిలీట్​ చేయండి ఇలా..

మీ మొబైల్​ ఫోన్​ యాప్​ ద్వారా ఇన్​స్టాగ్రామ్​ని ఎలా డిలీట్​ చేయాలంటే..

స్టెప్​ 1:- ప్రొఫైల్​లోకి వెళ్లి మెన్యూ మీద క్లిక్​ చేయండి.

స్టెప్​ 2:- సెట్టింగ్స్​ అండ్​ ప్రైవసీ మీద క్లిక్​ చేసి, అకౌంట్​ సెంటర్​లోకి వెళ్లండి.

స్టెప్​ 3:- పర్సనల్​ డీటైల్స్​ సెక్షన్​లో అకౌంట్​ ఓనర్​షిప్​ అండ్​ కంట్రోల్​ అనే ఆప్షన్​ కనిపిస్తుంది. దాని మీద క్లిక్​ చేయండి.

స్టెప్​ 4:- అప్పుడు అకౌంట్​ డీయాక్టివేషన్​ ఆర్​ డిలీషన్​ అన్న ఆప్షన్​ కనిపిస్తుంది.

స్టెప్​ 5:- మీరు ఇన్​స్టాగ్రామ్​ అకౌంట్​ని డిలీట్​ చేద్దామనుకుంటే.. డిలీట్​ అకౌంట్​ మీద క్లిక్​ చేసి కంటిన్యూని ఎంచుకోండి.

స్టెప్​ 6:- మీ పాస్​వర్డ్​ని రీ-ఎంటర్​ చేయండి. ఇన్​స్టాగ్రామ్​ని ఎందుకు శాశ్వతంగా డిలీట్​ చేద్దామని అనుకుంటున్నారో కారణం చెప్పండి.

అయితే, మీరు ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఈ ప్రాసెస్​ పూర్తి చేసినప్పటికీ, ఇన్​స్టాగ్రామ్​ మీ అకౌంట్​ని వెంటనే డిలీట్​ చేయదు. ఇందుకోసం 30 రోజుల సమయం పడుతుంది. ఈలోపు మీ అకౌంట్​ తాత్కాలికంగా డీయాక్టివేట్​ అవుతుంది. ఈ 30 రోజుల కాలంలో మీర సైన్​-ఇన్​ అవ్వకపోతే ఆ తర్వాత శాశ్వతంగా అకౌంట్​ డిలీట్​ అయిపోతుంది.

ఇన్​స్టాగ్రామ్​ అకౌంట్​ని ఇలా డీయాక్టివేట్​ చేయండి..

స్టెప్​ 1:- ప్రొఫైల్​లోకి వెళ్లి మెన్యూలోని సెట్టింగ్స్​ అండ్​ ప్రైవసీ ఆప్షన్​ మీద క్లిక్​ చేయండి. అకౌంట్స్​ సెంటర్​ ఆప్షన్​ కనిపిస్తుంది. దాన్ని ఎంచుకోండి.

స్టెప్​ 2:- పర్సనల్​ డీటైల్స్​లో అకౌంట్​ ఓనర్​షిప్​ అండ్​ కంట్రోల్​ ఆప్షన్​ ఉంటుంది. దాన్ని క్లిక్​ చేసి డీయాక్టివేషన్​ ఆర్​ డిలీషన్​ ఆప్షన్​ని ఎంచుకోండి.

స్టెప్​ 3:- డీయాక్టివేట్​ అకౌంట్​ మీద క్లిక్​ చేసి, కంటిన్యూ ప్రెస్​ చేయండి.

స్టెప్​ 4:- మీ పాస్​వర్డ్​ని రీ-ఎంటర్​ చేయండి. ఇన్​స్టాగ్రామ్​ అకౌంట్​ని ఎందుకు డయాక్టివేట్​ చేస్తున్నారో కారణం చెప్పండి. కంటిన్యూ ప్రెస్​ చేయండి.

మీ అకౌంట్​ డీయాక్టివేట్​ అయిపోతుంది.

డీయాక్టివేషన్​కి డిలీట్​ చేయడానికి తేడా ఏంటి?

మీ అకౌంట్​ని డిలీట్​ చేస్తే, అది శాశ్వతంగా పోయినట్టే! కానీ డీయాక్టివేట్​ చేయడం అంటే అకౌంట్​ని ఫ్రీజ్​ చేయడం. మీ ఫ్రెండ్స్​కి కనిపించదు. సెర్చ్​లోనూ రాదు. కానీ రీయాక్టివేట్​ చేస్తే వెంటనే ఓపెన్​ అయిపోతుంది. డేటా కూడా భద్రంగా తిరిగొస్తుంది.

ఫేస్​బుక్​ని ఇలా శాశ్వతంగా డిలీట్​ చేయండి..

ఫేస్​బుక్​లోనూ మీ అకౌంట్​ని శాశ్వతంగా డిలీట్​ చేసే ఆప్షన్​ ఉంటుంది.

స్టెప్​ 1:- ఫేస్​బుక్​లో ప్రొఫైల్​ మీద క్లిక్​ చేయండి.

స్టెప్​ 2:- సెట్టింగ్స్​ అండ్​ ప్రైవసీని ఎంచుకోండి. సెట్టింగ్స్​ మీద క్లిక్​ చేయండి.

స్టెప్​ 3:- అకౌంట్స్​ సెంటర్​లోకి వెళ్లండి.

స్టెప్​ 4:- అకౌంట్​ సెట్టింగ్స్​లో కనిపించే పర్సనల్​ డీటైల్స్​ ఆప్షన్​ మీద క్లిక్​ చేయండి.

స్టెప్​ 5:- అకౌంట్​ ఓనర్​షిప్​ అండ్​ కంట్రోల్​ మీద క్లిక్​ చేయండి.

స్టెప్​ 6:- అక్కడ కనిపించే డీయాక్టివేషన్​ ఆర్​ డిలీషన్​ ఆప్షన్​ ప్రెస్​ చేయండి.

స్టెప్​ 7:- మీరు డిలీట్​ చేయదలచుకున్న అకౌంట్​ని ఎంచుకోండి. డిలీట్​ అకౌంట్​ మీద క్లిక్​ చేసి, కంటిన్యూ ప్రెస్​ చేయండి.

ఇన్​స్టాగ్రామ్​ లానే ఫేస్​బుక్​ అకౌంట్​ని శాశ్వతంగా డిలీట్​ చేసేందుకు 30 రోజుల సమయం పడుతుందని గుర్తుపెట్టుకోండి.

తదుపరి వ్యాసం