తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Honor Earbuds X5, Watch Launch: హానర్ నుంచి లేటెస్ట్ ఇయర్ బడ్స్, లేటెస్ట్ వాచ్ లాంచ్; స్పెసిఫికేషన్స్, ధర.. వివరాలు.

Honor Earbuds X5, Watch Launch: హానర్ నుంచి లేటెస్ట్ ఇయర్ బడ్స్, లేటెస్ట్ వాచ్ లాంచ్; స్పెసిఫికేషన్స్, ధర.. వివరాలు.

HT Telugu Desk HT Telugu

17 February 2024, 15:46 IST

  • Honor Earbuds X5, Watch Launch: హానర్ నుంచి లేటెస్ట్ గా ఛాయిస్ ఇయర్ బడ్స్ ఎక్స్5, హానర్ ఛాయిస్ వాచ్ మార్కెట్లోకి వచ్చాయి. ఎక్స్ 9బి స్మార్ట్ ఫోన్ తో పాటు వీటిని హానర్  విడుదల చేసింది.

హానర్ ఛాయిస్ వాచ్
హానర్ ఛాయిస్ వాచ్ (Honor)

హానర్ ఛాయిస్ వాచ్

Honor Earbuds X5, Watch Launch: హానర్ ఎక్స్9బీ స్మార్ట్ ఫోన్ తో పాటు హానర్ ఛాయిస్ ఇయర్ బడ్స్ ఎక్స్5, హానర్ ఛాయిస్ వాచ్ లను హానర్ భారతీయ మార్కెట్లో విడుదల చేసింది. వీటితో ఇండియా మార్కెట్లో హానర్ ఉత్పత్తుల సంఖ్య మరింత పెరిగింది. ఫిబ్రవరి 15 న ఈ డివైజెస్ ను లాంచ్ చేశారు.

హానర్ ఛాయిస్ ఇయర్ బడ్స్ ఎక్స్ 5: వివరాలు

హానర్ ఛాయిస్ ఇయర్ బడ్స్ ఎక్స్ 5 (Honor X5 Earbuds) లోని 30dB ANC, ఇన్-ఇయర్ ఇంజనీరింగ్ డిజైన్ అసాధారణమైన ఆడియో అనుభవాన్ని అందిస్తుంది. బహిరంగ ప్రదేశాల్లో కూడా క్రిస్టల్-క్లియర్ ఆడియోను పొందవచ్చు. ఇందులో న్యూ జనరేషన్ బ్లూటూత్ 5.3 ఫెసిలిటీ ఉంటుంది. ఈ ఈయర్ బడ్స్ 35 గంటల బ్యాటరీ లైఫ్ ను కలిగి ఉన్నాయి. ఇందులో డ్యూయల్ మైక్రోఫోన్ ఈఎన్సీ ఫీచర్ కాలింగ్ సదుపాయం ఉంది. ఇది ఐపి 54 రేటింగ్ తో వస్తుంది.

స్టైలిష్ అండ్ ఫంక్షనల్: హానర్ ఛాయిస్ వాచ్

హానర్ ఛాయిస్ వాచ్ (Honor Choice Watch) అడ్వాన్స్ డ్ ఫీచర్స్ తో స్టైలిష్ లుక్ తో మార్కెట్లోకి వచ్చింది. ముఖ్యంగా యూత్ ను ఆకర్షించే ఫీచర్స్ ను దీనిలో పొందుపర్చారు. ఇది 1.95 అంగుళాల అల్ట్రా-థిన్ అమోలెడ్ డిస్ ప్లే, బిల్ట్-ఇన్ జీపీఎస్, వన్-క్లిక్ ఎస్ఓఎస్ కాలింగ్ వంటి ప్రత్యేకతలు కలిగి ఉంది. హానర్ హెల్త్ యాప్ తో అనుసంధానించబడిన ఈ వాచ్ రోజంతా SpO2, స్ట్రెస్ మానిటరింగ్ తో సహా అధునాతన ఆరోగ్య మానిటరింగ్ ఫీచర్లను అందిస్తుంది. ఆకట్టుకునే 5 ఎటిఎం వాటర్ రెసిస్టెన్స్ స్థాయితో, రోజువారీ కార్యకలాపాలు, ఫిట్ నెస్ యాక్టివిటీస్ కు ఇది సరైనదని హానర్ పేర్కొంది.

లభ్యత మరియు ధర

హానర్ ఛాయిస్ ఎక్స్ 5 ఇయర్ బడ్స్ ఫిబ్రవరి 16 నుండి రూ. 1999 ధరకు కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంటుంది. మరోవైపు, హానర్ ఛాయిస్ వాచ్ ఫిబ్రవరి 24న రూ.6499 ధరతో మార్కెట్లోకి రానుంది. అయితే, ఇంట్రడక్టరీ డిస్కౌంట్ గా రూ. 500 లను కంపెనీ అందిస్తోంది. డిస్కౌంట్ అనంతరం ఈ వాచ్ రూ. 5,999 లకు లభిస్తుంది.

తదుపరి వ్యాసం